సాక్షి, విజయవాడ: సీపీఐ రామకృష్ణతో నీతులు చెప్పించుకొనే స్థితిలో బీజేపీ లేదంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి పురిఘళ్ల రఘురామ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీపీఐ రామకృష్ణ ఆయన పార్టీ వ్యవహారాలు ఆయన చూసుకుంటే మంచిది. చంద్రబాబు రాసిచ్చిన కాపీనే పేరు మార్చి సీపీఐ, కాంగ్రెస్ నేతలు చదువుతున్నారు.
రాష్ట్రంలో ఎలాంటి రాజకీయాలు చేయాలో బీజేపీకి తెలుసు. బీజేపీ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర శాఖ ఇప్పటికే స్పందించింది. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. ఎలాంటి రాజకీయాలు చేయాలో టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్ మాకు చెప్పనక్కరలేదు' అంటూ సీపీఐ రామకృష్ణపై ధ్వజమెత్తారు. (దళితులపై చంద్రబాబు కపట ప్రేమ)
Comments
Please login to add a commentAdd a comment