Purigalla raghu ram
-
తిరిగి భారత్ పైకి లేస్తుంది
అప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా ప్రధాని మోదీ లాక్డౌన్ విధించినట్లే... ఇప్పుడు రికవరీ రేటు పెరగడం, మరణాల సంఖ్య అత్యల్పంగా ఉండటం, వైద్య సదుపాయాలు, మౌలిక సదుపాయాలు తగినన్ని ఉన్నాయనే ధీమాతోనే లాక్‌డౌన్‌ను క్రమక్రమంగా తొలగిస్తున్నారు. భారతదేశంలో అర్థిక రంగం కుదేలైపోయిందని, ఎన్నడూ లేనంత చీకట్లోకి మనం వెళ్లిపోయామని, ఇదంతా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ల వల్లనే జరిగిందనీ ప్రతిపక్ష హోదా కూడా పొందలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమ్యూనిస్టు సానుభూతిపరులుగా వ్యవహరించే విశ్లేషకులు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్లైన్లోనూ, వీడియోల్లోనూ, టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ, అడిగిన వారికీ, అడగని వారికీ అందరికీ చెప్పాలని తహతహలాడుతున్నారు. మబ్బులు కమ్మినంత సేపూ సూర్య, చంద్రులు కనిపించరు. అలాగని వారు అసమర్థులైపోతారా? మబ్బుల్ని కూడా పక్కకు తీయలేనివాళ్లు అని అనగలమా? ఈ దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఉన్నారు కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల రీత్యా వారు ఈ అపనిందలను మోయాల్సి వస్తోంది. కానీ, అసలు వాస్తవాలను కాంగీయులు, బీజేపీ అంటే గిట్టని విశ్లేషకులు ఎంతకాలం తొక్కిపెట్టగలరు? సోనియా గాంధీ పుట్టిన దేశం ఇటలీతో పాటు అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా మృతదేహాలను రోడ్లపైనే వదిలేశారు. శ్మశానాల్లో చోటు దొరక్క కొత్తకొత్త శ్మశానాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఖననం చేసిన మృతదేహాలను తీసేసి శ్మశానాలను ఖాళీ చేశారు. వేలాది మంది కరోనా బాధితులు ఆసుపత్రుల్లో వైద్య సేవలు లభించక చనిపోయారు. వృద్ధాశ్రమాల్లో ఉన్న పెద్దవారిని ఎవరూ పట్టించుకోకపోవడంతో వారు చనిపోయారు. ఇవన్నీ చాలవన్నట్లు అసలు కరోనాయే అబద్ధం, లాక్డౌన్ నిబంధనలు ఎత్తేయాలి అంటూ వేలాది మంది రోడ్లపైకి వచ్చి ర్యాలీలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితులేవీ భారతదేశంలో లేవు. దానికి ఏకైక కారణం సకాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాక్డౌన్ విధించడమే. లాక్డౌన్ నిబంధనలు పాటించేలా ప్రజల్లో ఆయన కల్పిం చిన నమ్మకమే కోట్లాది మందిని కాపాడింది. ప్రపం చవ్యాప్తంగా కరోనా పేషెంట్ల రికవరీ రేటు అధి కంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. భారత్‌లో వంద మందికి కరోనా సోకితే సగటున 76 మంది త్వరగా కోలుకుంటున్నారు. కరోనా మరణాలు అత్యంత తక్కువగా ఉన్న దేశం భారతదేశం. లాక్డౌన్ విధించడం వల్ల భారతదేశంలో లక్షలాది ప్రజలు చనిపోకుండా కాపాడారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కితాబు ఇచ్చింది. లాక్‌డౌన్‌ను ఎగతాళి చేసిన బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాలు సైతం తర్వాతి కాలంలో లాక్డౌన్ విధించాల్సి వచ్చింది. అయితే, అప్పటికే ఆలస్యం కావడంతో ఆ దేశం ఎన్నో ఇబ్బందులు పడుతోంది ఇప్పటికీ. అగ్రరాజ్య మైన బ్రిటన్‌లో వైద్యులు, వైద్య సిబ్బంది కనీస మౌలిక సదుపాయాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ, భారతదేశం మాత్రం తక్షణం స్పందించి పీపీఈ కిట్లు సహా అన్ని అత్యవసర మౌలిక సదుపాయాలనూ సొంతంగా తయారు చేసుకోగలిగింది. ఇవన్నీ, వాస్తవాలు. కానీ వీటిపై ఎక్కడా చర్చ జరగదు. జీడీపీపై వస్తున్న విమర్శల్లో ఈ వాస్తవాలకు స్థానం లేదు. జీడీపీ పతనం కేవలం భారతదేశానికే పరిమిత మైందా? కరోనా మహమ్మారి మనం ఎవ్వరం ఊహించని, వందేళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారి. ఇలాంటి విపత్తును ప్రస్తుత తరం ప్రజలెవ్వరూ ఎప్పుడూ ఊహించి ఉండరు. ప్రపంచంలోని అన్ని అగ్ర దేశాలూ దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ ప్రకటించిన ఏప్రిల్–జూన్ త్రైమాసిక గణాంకాలను పరిశీలిస్తే అన్ని అగ్రరాజ్యాల్లోనూ ఆర్థిక వ్యవస్థ పతనమైంది. అమెరికాలో 9.5 శాతం తగ్గగా, యురోపియన్ యూనియన్‌లో 14.4 శాతం, ఇటలీలో 17.3 శాతం, ఫ్రాన్స్‌లో 18.9 శాతం, బ్రిటన్‌లో 21.7 శాతం, స్పెయిన్‌లో 22.1 శాతం తగ్గుదల నమోదైంది. ఈ విషయం మన విమర్శకులకు తెలియదా? తెలిసినా కావాలని అసత్యాలనే ప్రచారం చేస్తున్నారా? ఆర్థికంగా ఇబ్బందికరమే అయినప్పటికీ ప్రజల ప్రాణాలను కాపాడాలని లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధానమంత్రి ముందే చెప్పిన మాట గుర్తు లేదా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద లక్షా 70 వేల కోట్ల ఉపశమనాన్ని కేంద్రం ప్రకటించింది. పేదలకు ఆహారాన్ని, నగదును అందించింది. మహిళలకు, వృద్ధులకు, రైతులకు నగదు బదిలీ చేసింది. నిర్మాణ రంగ కార్మికులకు ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఇవన్నీ వాస్తవాలు కాదా? అప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా ప్రధాని మోదీ లాక్డౌన్ విధించినట్లే... ఇప్పుడు రికవరీ రేటు పెరగడం, మరణాల సంఖ్య అత్యల్పంగా ఉండటం, వైద్య సదుపాయాలు, మౌలిక సదుపాయాలు తగినన్ని ఉన్నాయనే ధీమా తోనే లాక్‌డౌన్‌ను క్రమక్రమంగా తొలగిస్తున్నారు. పేదలు, కార్మికులు, ఉద్యోగులకు ఉపశమనాన్ని కలిగించడం, ఉద్యోగాలను కాపాడటమే ధ్యేయంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. పరిశ్రమలు తిరిగి తెరుచుకుంటున్నాయి. బస్సులు, రైళ్లు, విమానాలు నడుస్తున్నాయి. వ్యాపార కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకునే దిశగా జరుగుతున్నాయి. ఆర్థిక రంగం ఎలాగైతే కిందకు పడిందో అదే రీతిలో పైకిలేస్తుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా తిరిగి పుంజుకున్న దేశంగా భారతదేశం నిలబడుతుంది. ఇది నేను చెబుతున్న మాట మాత్రమే కాదు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వంటి ప్రముఖ ఆర్థిక సంస్థలు చెబుతున్న మాట కూడా. సమర్థవంతమైన నాయకత్వం మనకు ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో ఉంది. అసత్యాలను ఎంతగా ప్రచారం చేసినా సత్యమే జయిస్తుంది. పురిఘళ్ల రఘురామ్ బీజేపీ అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ -
'నీతో నీతులు చెప్పించుకొనే స్థితిలో బీజేపీ లేదు'
సాక్షి, విజయవాడ: సీపీఐ రామకృష్ణతో నీతులు చెప్పించుకొనే స్థితిలో బీజేపీ లేదంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి పురిఘళ్ల రఘురామ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీపీఐ రామకృష్ణ ఆయన పార్టీ వ్యవహారాలు ఆయన చూసుకుంటే మంచిది. చంద్రబాబు రాసిచ్చిన కాపీనే పేరు మార్చి సీపీఐ, కాంగ్రెస్ నేతలు చదువుతున్నారు. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయాలు చేయాలో బీజేపీకి తెలుసు. బీజేపీ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర శాఖ ఇప్పటికే స్పందించింది. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. ఎలాంటి రాజకీయాలు చేయాలో టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్ మాకు చెప్పనక్కరలేదు' అంటూ సీపీఐ రామకృష్ణపై ధ్వజమెత్తారు. (దళితులపై చంద్రబాబు కపట ప్రేమ) -
ఏపీ బీజేపీ నేతలకు హైకమాండ్ ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదని, లోతైన అధ్యయనం లేకుండా ఆరోపణలు చేయరాదని ఏపీ బీజేపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. బుధవారం ఆయన ఏపీ బీజేపీ ఎంపీలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ అమలు చేస్తున్న ‘ఫీడ్ ద నీడ్’ అనే కార్యక్రమంపై సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి రాకుండా అందరికీ అవసరమైన సాయం చేయాలన్నారు. బీజేపీ యంత్రాంగం పూర్తి స్థాయిలో సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు చేసిన విమర్శలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇకపై పార్టీ నేతలు ఏ ఆరోపణలు అయినా చేసే ముందు అందుకు సంబంధించి వివరాలు, ఆధారాలు కేంద్ర పార్టీకి అందజేయాలని.. జాతీయ నాయకత్వం ఆమోదిస్తేనే ఆరోపణలు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. ఏపీలో బీజేపీ స్వతంత్ర ప్రతిపక్షంగా వ్యవహరించాలని, టీడీపీ, వైఎస్సార్సీపీతో సమదూరం పాటించాలని ఆదేశించినట్టు సమాచారం. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే విమర్శలా! బీజేపీ అధికార ప్రతినిధి పురిగళ్ల రఘురాం అమరావతి: కరోనా వైరస్ కారణంగా రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే తెలుగుదేశం పార్టీ నేతలు సలహాలు ఇవ్వడం మాని విమర్శలు గుప్పించడం బాధాకరమని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పురిగళ్ల రఘురాం పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో కూర్చుని లేఖలు రాస్తూ కాలయాపన చేస్తున్నారు. తమ శాసన సభ్యులను బాబు 12 గంటల పాటు నిరాహార దీక్షలు చేయమని చెప్పారే తప్ప.. పేద ప్రజలను ఆదుకోమని చెప్పక పోవడం దురదృష్టకరం. సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా వైరస్, ఆర్థిక పరిస్థితులపై సూచనలు, సలహాలు ఇవ్వకుండా దిక్కుమాలిన విమర్శలకు దిగటం ఆయన రాజకీయ జీవితంపై అసహ్యం వచ్చే విధంగా ఉంది. రాజకీయాలకు తావు లేకుండా అందరం కలిసి కరోనాపై పోరాడాల్సిన సమయమమిది. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాలను సమన్వయం చేస్తూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.’ అని అన్నారు. -
యనమల దిక్కుమాలిన విమర్శలు చేయడం..
సాక్షి, విజయవాడ : పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు పక్క రాష్ట్రంలో కూర్చొని లేఖలు రాస్తూ కాలయాపన చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి పురిఘళ్ల రఘురాం మండిపడ్డారు. 40 ఏళ్ల అనుభవముందని చెప్పుకునే చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలకు సలహాలు ఇవ్వకుండా విమర్శలకు పరిమితం కావడం బాధాకరమన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ చంద్రబాబు తన ఎమ్మెల్యేలను 12 గంటలు దీక్షలు చేయమన్నారు. ( ప్రముఖ నటుడి తండ్రి మృతి ) కానీ, పేద ప్రజలను ఆదుకోమని చెప్పకపోవడం బాధాకరం. కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో యనమల దిక్కుమాలిన విమర్శలు చేయడం వారిపై అసహ్యం వచ్చేలా చేస్తున్నాయి. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 24 గంటలు పని చేస్తున్నాయ’’ని అన్నారు. ( కపిల్ దేవ్ గుండు.. ఆమే కారణం! ) -
వయసుకి చిన్నమ్మ.. మనసుకి పెద్దమ్మ
భారతీయత నిండుదనానికి ఆమె చిరునామా. భారతీయుల స్వప్నానికి ప్రతిబింబం. సాటి లేని వాగ్ధాటి ఆమె సొంతం. ఇంగ్లీష్, హిందీల్లో అనర్గళంగా ప్రసంగిస్తూ... చెప్పాలనుకున్న విష యాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పడంలో అందివేసిన చేయి. ఏపనైనా అలవోకగా చేసే ధైర్యం, తెగువ ఆమె సొంతం. రాజకీయంగా... అనితర సాధ్యమైన ప్రయాణాన్ని సాగించారు. ఒక స్త్రీగా, ఇల్లాలిగా, రాజకీయనాయకురాలిగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా సంపూర్ణ మహిళగా ఖ్యాతి పొందారు. ఆమె మరెవరో కాదు భారత వీరనారి, ద గ్రేట్ లెజెండ్ సుష్మ స్వరాజ్. పుట్టి పెరిగింది ఉత్తరాదిలోనైనా... దక్షిణాదిలో కూడా ఆమె సుపరిచితురాలే. పార్టీ అధినేతలకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో ఆమె పాపులర్ అయ్యారు. పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా తన మార్క్ ఉండాల్సిందే. హర్యానాలో విద్యా భ్యాసం చేసిన సుష్మ 20 ఏళ్లకే న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. జయప్రకాష్ నారాయణ ‘సంపూర్ణ విప్లవం’లో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ తర్వాత బీజేపీలో చేరి అంచ లంచెలుగా ఎదిగారు. అతి కొద్ది కాలంలోనే బీజేపీ జాతీయ నాయకురాలి స్థాయికి చేరుకున్నారు. 25 ఏళ్లకే అంబాలా కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది 27 ఏళ్లకే హర్యానా జనతా పార్టీ అధ్యక్షురాలిగా ఎంపికై ఔరా అన్పించుకున్నారు. నాలుగుసార్లు లోక్ సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నిక య్యారు. 1999లో బళ్లారి నుంచి లోక్ సభకు పోటీ చేసి సోనియాకు సవాల్ విసిరి.. దేశమంతా తనవైపు చూసేలా ప్రచారం సాగించారు. ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా సంచలనం సృష్టించారు. వాజ్‌పేయి హయాంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. సమాచార శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టి అప్పుడే వస్తున్న ఎలక్ట్రానిక్ మీడియాకు కొత్త ఒరవడి తీసుకొచ్చారు. 1996లో వాజ్‌పేయీ ప్రభుత్వం కేవలం 13 రోజులపాటు కొనసాగిన సమయంలో సుష్మ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా ఉంటూ లోక్‌సభలో జరిగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 15వ లోక్ సభలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ సుష్మ కీలక బాధ్యత నిర్వర్తించారు. 2008, 2010లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు పొందారు. ఇక 2014లో ప్రధాని నరేంద్ర మోదీ కేబి నెట్లో కీలక విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుష్మ ఆ శాఖకు ముందెన్నడూ లేని గుర్తింపు తీసుకొచ్చారు. గల్ఫ్ దేశాల్లో భారతీయులు చిక్కుకున్నప్పుడు వారిని సురక్షితంగా దేశానికి తరలించడానికి చేసిన కృషి అనన్య సామాన్యమైంది. కల్లోల దేశాల్లో ప్రజల్ని రక్షించేందుకు తాను నేరుగా ఆయా దేశాల రాయ బార కార్యాలయాలతో చర్చలు జరిపేవారు. పార్లమెంట్ లో సుష్మ చేసే ప్రసంగాలకు ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా అందరూ జేజేలు పలికేవారు. భాషపై పట్టు, వాక్చాతుర్యంతో ఎవరినైనా ఆమె ఇట్టే కట్టిపడేసేవారు. విదేశాంగ మంత్రిగా ఉంటున్న సమయంలో వచ్చిన ఆనారోగ్యం సుష్మను ఊపిరి సలుపుకోనివ్వలేదు. అందువల్లే గత ఎన్నికల్లో పోటీకి కూడా దూరంగా ఉన్నారు. అయితే ఆర్టికల్ 370 రద్దు తన జీవిత కాలంలోనే చూడాల్సిన ఘట్టంగా, చనిపోయే ముందు చేసిన ట్వీట్ భారతదేశాన్ని కన్నీరు పెట్టించింది. సుష్మ చనిపోయారన్న నిజాన్ని భారతీయులెవరూ జీర్ణించుకోలేకోపోయారు. సంతాప సందేశాల్లో ప్రపంచదేశాధినేతలు కన్నీటి పర్యంతమయ్యారంటే విదేశాంగ విధానంపై సుష్మ వేసిన ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. విదేశాంగ విధానానికి గానీ, బీజేపీ పార్టీకి గానీ సుష్మ స్వరాజ్ ముందు, సుష్మ స్వరాజ్ తర్వాత అని చెప్పాల్సిందే. ఎందుకంటే అలాంటి నేత మరొకరు ఉండరు. ఉండబోరు. ఆ ఘనత ఒక్క సుష్మకు మాత్రమే దక్కుతుంది. పురిఘళ్ల రఘురామ్: బీజేపీ సమన్వయకర్త, ఈ–మెయిల్ : raghuram.bjp@gmail.com -
జాతి మెచ్చిన సాహసోపేత చర్య
అఖండ భారతదేశ స్వప్నం నేడు సాకారమయ్యింది. 133 కోట్ల భారతీయులు సగర్వంగా తలెత్తుకు తిరిగేలా చేసింది భారత ప్రభుత్వం. స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలైనా... నెరవేరని స్వప్నం నేడు సాకారమయ్యింది. కశ్మీర్‌ను భారత్ నుంచి వేరుచేసేందుకు జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలకు చరమగీతం పాడుతూ మోదీ సర్కారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇప్పుడు దేశ ప్రజల గుండెల్లో మార్మోగుతోంది. మిగతా రాష్ట్రాల మాదిరిగా భారతదేశంలో జమ్మూ, కశ్మీర్ మారింది. ‘ఇద్దరు ప్రధానులు, రెండు రాజ్యాం గాలు... రెండు జెండాలు వద్దు’ అంటూ ప్రాణార్పణ చేసిన భారతదేశ ముద్దుబిడ్డ శ్యాం ప్రసాద్ ముఖర్జీ నినాదాన్ని నేడు మోదీ సర్కారు సుసాధ్యం చేసింది. భారత్ నుంచి కశ్మీర్‌ను విడదీస్తున్న ఆర్టికల్ 370, 35 అను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత ఖ్యాతిని హిమాలయాల ఎత్తుకు చేర్చింది. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్టికల్ 370, 35 అ నిబంధనల రద్దు నిర్ణయాలపై దేశ మంతటా పౌరులు సంబరాలు జరుపుకుంటున్నారు. భారతదేశంలో కశ్మీర్ అంతర్భాగమన్న సందేశాన్ని నేడు కేంద్రం రుజువు చేసి చూపించిందన్న సంతో షం కోట్లాది ప్రజల్లో నెలకొంది. ఇలా దేశమంతా పండుగ జరుపుకుం టుంటే... కొన్ని పక్షాలు మాత్రం కుట్రపూరితంగా వేర్పాటువాదుల వాదనకు మద్దతు పలుకుతున్నాయి. దేశంలో కశ్మీర్ అంతర్భాగమని... ఒకటే దేశం... ఒకటే రాజ్యాంగమంటూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిపై నాడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఎలుగెత్తారు. పార్లమెంట్ సాక్షిగా నెహ్రూ కళ్లు తెరిపించే పనిచేశారు. తన అభ్యంతరాలను, సూచనలను పట్టించుకోకుండా నెహ్రూ ప్రభుత్వం నడుస్తున్న తీరుపై ఆందోళనను శ్యాంజీ ఉధృతం చేశారు. 26 జూన్ 1952న ఆర్టికల్ 370ను రద్దు చేయాలంటూ పార్లమెంట్ సాక్షిగా నిరసన తెలిపారు. దేశాన్ని ఇలా వేరుచేయడం సమంజసం కాదంటూ నినదించారు. కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయాలను నిర్ద్వంద్వంగా ఖండిం చారు. కొందరు స్వార్థపరుల కోసం తీసుకొచ్చిన విధా నం చెల్లదంటూ కశ్మీర్లో పోరుబాట సాగించి అసువులు బాశారు. నాటి నుంచి నేటి వరకు మూడు తరాలు కశ్మీర్ కోసం దేశ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన లక్షల కోట్ల రూపాయలను దిగమింగారు. పైపెచ్చు మత ప్రాతిపదికన జమ్మూ, కశ్మీర్లో మిగతా ప్రజలకు హక్కులు లేకుండా కాలరాశారు. రెండో తరగతి పౌరుల్లా చూసి వంచించారు. అంబేడ్కర్ కలలుగన్న భారతావనిలో నిరుపేదలకు అందాల్సిన ఫలాలు దేశమంతా లభించినా... జమ్మూ, కశ్మీర్లో మాత్రం లభించలేదు. దేశవ్యాప్తంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందినా... జమ్మూ, కశ్మీర్లో నివశిస్తున్న బడుగు బలహీన వర్గాలకు మాత్రం ఆ ఫలాలు దక్కలేదు. రిజర్వేషన్లంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి అక్కడి ప్రజలది. కేవలం కొందరికి మాత్రమే లబ్ధి చేకూరేలా తీసుకొచ్చిన ఆర్టికల్ 370తో కొన్ని వర్గాలు మాత్రమే ఆ ఫలాలను దక్కించుకున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన తాజా నిర్ణయంతో ఇక ఒక దేశం ఒకటే రాజ్యాంగం పరిఢవిల్లుతుంది. ఏడు దశాబ్దాలుగా వేల మంది భారతీయులు దేశ రక్షణ కోసం అసువులుబాశారు. భరతమాత రక్షణలో సమిధలయ్యారు. భూలోక స్వర్గంగా ఉన్న కాశ్మీర్ తీవ్రవాదులకు స్వర్గధామంగా నిలిచింది. సాధారణ కశ్మీరీలు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారి తీవ్రవాదానికి ఆకర్షితులవుతున్నారంటే అందుకు కారణం అక్కడ స్థానిక ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ విధానాలే. కశ్మీర్ అనంతనాగ్ గుహల్లో కొలువైన పరమశివుడ్ని దర్శించుకోవాలన్నా ఇబ్బందే. దేశంలోని ఆలయాన్ని దర్శించుకోవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరి స్థితి. కశ్మీర్ పండితుల కులదైవమైన శారదా మాత... సరస్వతి దేవి ఆలయంలోకి వెళ్లాలంటే సాధ్యం కాదు. ఇందుకు కారణం అక్కడి పాలకులు. వారితోపాటు ఆర్టికల్ 370 మాత్రమే. తాజా నిర్ణయంతో భారతదేశం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని చెప్పాల్సి ఉంటుంది. దేశం గురించి నిర్ణయం తీసుకోవాలంటే ధైర్యం కావాలి. అది మోదీకి సంపూర్ణంగా ఉందన్నారు హోం మంత్రి అమిత్ షా. కశ్మీర్ ఎప్పుడూ భూతల స్వర్గంగా ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యాలవుతాయి. అధికారం కోసమో... మరెందుకో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగానే తాజా నిర్ణయం తీసుకొంది. కశ్మీర్లో ఇకపై మూడు కుటుం బాల ఆధిపత్యం చెల్లదు. సామాన్యులే కశ్మీర్లో ఏలికలవుతారు. అధికారం చెలాయిస్తారు. కశ్మీర్లో ఇక దేశమంతటా వర్తిస్తున్న విధానాలే అమలవుతాయ్. దేశంలో ఏ పారిశ్రామికవేత్త అయినా కశ్మీర్ వెళ్లి ఇక పరిశ్రమలు ప్రారంభించవచ్చు. తీవ్రవాదంతో కల్లోలంలా మారిన కశ్మీర్‌ను అభివృద్ధి పట్టాలెక్కించవచ్చు. అందుకు ప్రధాని మోదీ– అమిత్ షా జోడీ నవ శకాన్ని ఆవిష్కరించింది. భారతదేశ ఔన్యత్యాన్ని హిమాలయాల ఎత్తు ఎగిరేలా చేసిన ధీరుడిగా ప్రధాని మోదీ నిలిచి పోతారు. కులాలకు మతాలకు అతీతంగా భారతీయులందరూ ఉప్పొంగే సందర్భమిది. వ్యాసకర్త : పురిఘళ్ల రఘురామ్, బీజేపీ సమన్వయకర్త ఈ–మెయిల్ : raghuram.bjp@gmail.com -
కలకంఠి కంట కన్నీరొలకని చోటు కోసం...!!
నేడు మాతృదినోత్సవం. దేశాన్నే భరతమాత పేరుతో ఘనంగా పిలుచుకునే సంస్కృతి మనది. భరతమాత ముద్దుబిడ్డ లమంటూ దేశ జనులంతా గర్విస్తుంటారు. గంగా, యమున, కావేరీ, నర్మద, సరస్వతి, సింధు, తుంగభద్ర, గోదావరి.. ఇలా దేశంలోని నదీ నదాలన్నింటినీ మహిళా మూర్తుల పేర్లతోనే పిలుచుకుంటున్నాం. మన పురాణాల్లో ఇతిహాసాల్లో మహిళలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీ నారాయణుడు, పార్వతీపర మేశ్వరులు, రాధాకృష్ణులు, సీతా రాములు ఇలా చూస్తే కూడా... మన దేవుళ్లను పిలిచేటప్పుడూ అమ్మవారి పేర్లు ముందుగా ఉచ్చరిస్తాం. దేశంలోని ప్రతి గ్రామంలోనూ ప్రజలు తొలుత గ్రామ దేవతను కొలుస్తారు. ఆధునిక కాలంలో దేశంకోసం, స్త్రీ స్వేచ్ఛకోసం, ప్రగతి కోసం ఎందరో మహిళలు అనితర సాధ్యమైన కృషి చేశారు. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని సాగించిన వీరనారి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి. సరోజనీనాయుడు, దుర్గాబాయి దేశ్‌ముఖ్, బేగమ్ హజ్రత్ మహల్, అరుణా అసిఫ్ అలీ, సుచిత్రా కృపలానీ వంటి పలువురు మహిళా మూర్తులు స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. అలాగే మొదటి పైలట్ సరళా థక్రాల్, అంతరిక్షంలో భరతజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు కల్పనా చావ్లా. బయోటెక్‌లో కిరణ్ మజుందార్, బ్యాంకింగ్ రంగంలో చందా కొచ్చార్, అరుంధతీ భట్టాచార్య, విదేశీ వ్యవహారాల్లో నిరుపమారావ్, భారత మహిళా క్రికెట్ కెప్టెన్‌గా మిథాలీ రాజ్, టెన్నిస్‌లో సానియా మీర్జా, చెస్‌లో కోనేరు హంపి, బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించారు. తెలుగు తేజం కరణం మల్ల్లీశ్వరి ఒలింపిక్ పతకం సాధించారు. ఎలక్ట్రిక్ కార్ బిజి నెస్ రాణిగా పద్మశ్రీ వారియర్‌ను ఫార్చ్యూన్ మేగ జైన్కీర్తించింది. ఇక పెప్సీకో సీఈవోగా ఇంద్రానూయీ, స్టాక్ మార్కెట్లో చిత్రా రామ కృష్ణ, నాట్య రంగంలో యామినీ కృష్ణమూర్తి, మల్లికా సారాబాయి, మృణాళిని తదితరులు ప్రపంచఖ్యాతి పొందారు. యుగోస్ల్లోవియా నుంచి భారత్‌కి వచ్చిన థెరిసా... భారత జాతికి మదర్ థెరిసా అయ్యారు. భారత రాజకీయరంగంలో ఇందిరా గాంధీ ఓ వెలుగు వెలిగారు. నందినీ సత్పత్ రెండుసార్లు ఒరిస్సా రాష్ట్ర సీఎంగా వ్యవహరించారు. ఉమాభారతి, మాయావతి, జయలలిత, మమతాబెనర్జీ దేశ రాజకీ యాల్ల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. దేశంలో 15 మంది మహిళలు ముఖ్య మంత్రులుగా పనిచేస్తే ప్రస్త్తుతం నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో మహిళలు సీఎంలుగా ఉన్నారు. తమిళనాడులో జయలలిత, గుజరాత్లో ఆనందీ బెన్ పటేల్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, రాజస్థాన్‌లో వసుంధరా రాజే సింధియా బాధ్యతలు నిర్వర్తిస్త్తున్నారు. సుష్మాస్వరాజ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా కీలక శాఖలను నిర్వహించారు. వీరితోపాటు ప్రథమ మహిళా రాష్ర్టపతిగా ప్రతిభాపాటిల్, లోక్‌సభ స్పీకర్‌గా మీరా కుమార్ పనిచేయగా... ప్రస్తుత లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ 8 సార్లు లోక్‌సభకు ఎన్నికైన ఏకైక మహిళగా ఖ్యాతి పొందారు. మనదేశ అభివృద్ధిలో ప్రతి రంగంలోనూ మహిళల పాత్రను ఎవరూ కాదనలేని సత్యం. అయినప్పటికీ... ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత వివక్ష భారత మహిళలపై జరుగుతుండటం బాధాకరం. నిర్భయ ఘటన దేశాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. కొంతమంది పశు ప్రవర్తన చేస్త్తూ... దేశానికి వస్తున్న విదేశీ మహిళలపై, స్వదేశంలో మహిళలపై, చిన్న పిల్లలపై లైంగికదాడులకు తెగబడుతున్నారు. మహిళలపై జరుగుతున్న మానసిక దాడులు, అత్యాచారాలు దేశ ప్రతిష్టను మసకబారేలా చేస్త్తు న్నాయి. మన జీవితాల్లో ముడివేసుకున్న బంధాలతో ప్రతి వ్యక్తి జీవితంలో ప్రధాన భూమికను మహిళ పోషిస్తున్నా పురుషాధిక్యంతో మనల్ని మనం దిగజార్చుకుంటున్నాం. స్వాతంత్య్రం సాధించి ఏడు దశాబ్దాలు కావస్తున్నా.. నేటికీ మహిళలను రక్షిం చాలని, వారిని చదివించాలని చెప్పుకోవాల్సి రావడం బాధాకరం. దేశంలో మహిళల అభ్యున్నతికి మన ప్రధాని మోదీ బేటీ బచావో, బేటీ పడావో.. అనే నినాదంతో ముందుకు వచ్చారు. మహిళల కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలో్ల సుకన్యా సమృద్ధి యోజన ఒకటి. తాజాగా రైల్వే బెర్తుల్లో 33 శాతం మహిళలకు రిజర్వేష న్లివ్వాలని నిర్ణయించడం శుభసూచికం. ప్రతీ బ్యాంకు శాఖ మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయాలని మోదీ ఆకాంక్షిస్తున్నారు. మహిళల అభ్యున్నతి కోసమే మోదీ సర్కారు మహిళా బ్యాంక్‌ను స్థాపించింది. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడాన్ని, విద్యార్థులు పాఠశాల మధ్యలో విద్యను ఆపేయడాన్ని గుర్తించి ప్రతి పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టారు మోదీ. అందుకే మాతృదినోత్సవాన్ని మహిళల గౌరవ ప్రతిష్టాపన స్ఫూర్తితో జరుపుకుందాం. (నేడు మాతృ దినోత్సవం సందర్భంగా) వ్యాసకర్త బీజేపీ జాతీయ సంధానకర్త raghuram.bjp@gmail.com - పురిఘళ్ల రఘురాం