కలకంఠి కంట కన్నీరొలకని చోటు కోసం...!! | Mothers day on may 9 today | Sakshi
Sakshi News home page

కలకంఠి కంట కన్నీరొలకని చోటు కోసం...!!

Published Sun, May 8 2016 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 11:37 PM

కలకంఠి కంట కన్నీరొలకని చోటు కోసం...!!

కలకంఠి కంట కన్నీరొలకని చోటు కోసం...!!

నేడు మాతృదినోత్సవం. దేశాన్నే భరతమాత పేరుతో ఘనంగా పిలుచుకునే సంస్కృతి మనది. భరతమాత ముద్దుబిడ్డ లమంటూ దేశ జనులంతా గర్విస్తుంటారు. గంగా, యమున, కావేరీ, నర్మద, సరస్వతి, సింధు, తుంగభద్ర, గోదావరి.. ఇలా  దేశంలోని నదీ నదాలన్నింటినీ మహిళా మూర్తుల పేర్లతోనే పిలుచుకుంటున్నాం. మన పురాణాల్లో ఇతిహాసాల్లో మహిళలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీ నారాయణుడు, పార్వతీపర మేశ్వరులు, రాధాకృష్ణులు, సీతా రాములు ఇలా చూస్తే కూడా... మన దేవుళ్లను పిలిచేటప్పుడూ అమ్మవారి పేర్లు ముందుగా ఉచ్చరిస్తాం. దేశంలోని ప్రతి గ్రామంలోనూ ప్రజలు తొలుత గ్రామ దేవతను కొలుస్తారు. ఆధునిక కాలంలో దేశంకోసం, స్త్రీ స్వేచ్ఛకోసం, ప్రగతి కోసం ఎందరో మహిళలు అనితర సాధ్యమైన కృషి చేశారు.
 
  ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని సాగించిన వీరనారి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి. సరోజనీనాయుడు, దుర్గాబాయి దేశ్‌ముఖ్, బేగమ్ హజ్రత్ మహల్, అరుణా అసిఫ్ అలీ, సుచిత్రా కృపలానీ వంటి పలువురు మహిళా మూర్తులు స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. అలాగే మొదటి పైలట్ సరళా థక్రాల్, అంతరిక్షంలో భరతజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు కల్పనా చావ్లా. బయోటెక్‌లో కిరణ్ మజుందార్, బ్యాంకింగ్ రంగంలో చందా కొచ్చార్, అరుంధతీ భట్టాచార్య, విదేశీ వ్యవహారాల్లో నిరుపమారావ్, భారత మహిళా క్రికెట్ కెప్టెన్‌గా మిథాలీ రాజ్, టెన్నిస్‌లో సానియా మీర్జా, చెస్‌లో కోనేరు హంపి, బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించారు.
 
 తెలుగు తేజం కరణం మల్ల్లీశ్వరి ఒలింపిక్ పతకం సాధించారు. ఎలక్ట్రిక్ కార్ బిజి నెస్ రాణిగా పద్మశ్రీ వారియర్‌ను ఫార్చ్యూన్ మేగ జైన్‌కీర్తించింది. ఇక పెప్సీకో సీఈవోగా ఇంద్రానూయీ, స్టాక్ మార్కెట్లో చిత్రా రామ కృష్ణ, నాట్య రంగంలో యామినీ కృష్ణమూర్తి, మల్లికా సారాబాయి, మృణాళిని తదితరులు ప్రపంచఖ్యాతి పొందారు. యుగోస్ల్లోవియా నుంచి భారత్‌కి వచ్చిన థెరిసా... భారత జాతికి మదర్ థెరిసా అయ్యారు.
 
 భారత రాజకీయరంగంలో ఇందిరా గాంధీ ఓ వెలుగు వెలిగారు. నందినీ సత్‌పత్ రెండుసార్లు ఒరిస్సా రాష్ట్ర సీఎంగా వ్యవహరించారు. ఉమాభారతి, మాయావతి, జయలలిత, మమతాబెనర్జీ దేశ రాజకీ యాల్ల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. దేశంలో 15 మంది మహిళలు ముఖ్య మంత్రులుగా పనిచేస్తే ప్రస్త్తుతం నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో మహిళలు సీఎంలుగా ఉన్నారు. తమిళనాడులో జయలలిత, గుజరాత్‌లో ఆనందీ బెన్ పటేల్, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, రాజస్థాన్‌లో వసుంధరా రాజే సింధియా బాధ్యతలు నిర్వర్తిస్త్తున్నారు. సుష్మాస్వరాజ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా కీలక శాఖలను నిర్వహించారు. వీరితోపాటు ప్రథమ మహిళా రాష్ర్టపతిగా ప్రతిభాపాటిల్, లోక్‌సభ స్పీకర్‌గా మీరా కుమార్ పనిచేయగా... ప్రస్తుత లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ 8 సార్లు లోక్‌సభకు ఎన్నికైన ఏకైక మహిళగా ఖ్యాతి పొందారు.
 
 మనదేశ అభివృద్ధిలో ప్రతి రంగంలోనూ మహిళల పాత్రను ఎవరూ కాదనలేని సత్యం. అయినప్పటికీ... ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత వివక్ష భారత మహిళలపై జరుగుతుండటం బాధాకరం. నిర్భయ ఘటన దేశాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. కొంతమంది పశు ప్రవర్తన చేస్త్తూ... దేశానికి వస్తున్న విదేశీ మహిళలపై, స్వదేశంలో మహిళలపై, చిన్న పిల్లలపై లైంగికదాడులకు తెగబడుతున్నారు. మహిళలపై జరుగుతున్న మానసిక దాడులు, అత్యాచారాలు దేశ ప్రతిష్టను మసకబారేలా చేస్త్తు న్నాయి. మన జీవితాల్లో ముడివేసుకున్న బంధాలతో ప్రతి వ్యక్తి జీవితంలో ప్రధాన భూమికను మహిళ పోషిస్తున్నా  పురుషాధిక్యంతో మనల్ని మనం దిగజార్చుకుంటున్నాం.
 
 స్వాతంత్య్రం సాధించి ఏడు దశాబ్దాలు కావస్తున్నా.. నేటికీ మహిళలను రక్షిం చాలని, వారిని చదివించాలని చెప్పుకోవాల్సి రావడం బాధాకరం. దేశంలో మహిళల అభ్యున్నతికి మన ప్రధాని మోదీ బేటీ బచావో, బేటీ పడావో.. అనే  నినాదంతో ముందుకు వచ్చారు. మహిళల కోసం మోదీ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలో్ల సుకన్యా సమృద్ధి యోజన ఒకటి. తాజాగా రైల్వే బెర్తుల్లో 33 శాతం మహిళలకు రిజర్వేష న్లివ్వాలని నిర్ణయించడం శుభసూచికం. ప్రతీ బ్యాంకు శాఖ మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయాలని మోదీ ఆకాంక్షిస్తున్నారు.

మహిళల అభ్యున్నతి కోసమే మోదీ సర్కారు మహిళా బ్యాంక్‌ను స్థాపించింది. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడాన్ని, విద్యార్థులు పాఠశాల మధ్యలో విద్యను ఆపేయడాన్ని గుర్తించి ప్రతి పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టారు మోదీ. అందుకే మాతృదినోత్సవాన్ని మహిళల గౌరవ ప్రతిష్టాపన స్ఫూర్తితో జరుపుకుందాం.
 (నేడు మాతృ దినోత్సవం సందర్భంగా)
 వ్యాసకర్త బీజేపీ జాతీయ సంధానకర్త  
 raghuram.bjp@gmail.com
 - పురిఘళ్ల రఘురాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement