అవతార మూర్తి అయిన అమ్మ ప్రేమకు దాసోహం అన్నాడు. కనిపించే ప్రత్యక్ష దైవం అమ్మ అని పురాణాలు సైతం చెబుతున్నాయి. అలాంటి అపురూపమైన అమ్మ ప్రేమ, సేవలను తలుచుకుని గౌరవించడం కోసం ప్రత్యేకంగా ఓ రోజు ఏర్పాటు చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మే నెల రెండో ఆదివారం మదర్స్ డేని వేడుకగా జరుపుకుంటున్నాం. అయితే ఈ మదర్స్ డే ఎలా ప్రాచుర్యంలోకి వచ్చి ఎలా ఏర్పడిందో వింటే మనసు భావోద్వేగానికి గురవ్వుతుంది. అమ్మ అనే రెండు అక్షరాలు ఎంతటి బాధనైనా పోగొట్టేస్తుందనడానికి ఈ గాదే ఉదహారణ.
అమెరికా అంతర్యుద్ధం...
1861-65 కాలం అమెరికాలో భయంకరంగా అంతర్యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో అప్పటిదాక ఒకటిగా ఉన్న ప్రజలు ప్రాంతాల వారీగా విడిపోయారు యూనియన్ కాన్ఫడరేంట్ అంటూ రెండు వర్గాలుగా చీలిపోయారు అలాంటి సమయంలో వర్జినియాలో శత్రువులకు సంబంధించిన సైనికుడు చనిపోయారు. అతన్ని చూడటానికి ఎవరూ ముందుకు రాలేదు. మూపైళ్లు కూడా లేని ఓ మహిళ మాత్రం అతనని సాటి మనిషిగా భావించింది.
అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దించింది.ఆమె పేరు యాన్ జార్వీస్. కేవలం ప్రార్దనలతో సరిపెట్టలేదు. తను స్దాపించిన మదర్స్ డే వర్క్స్ క్లబ్‌తో ప్రజల్లో ద్వేషాన్ని తగ్గించే యత్నం చేశారు. దేశంలో ప్రతిఒక్కరూ ఎవరోఒకరి పక్షాన ఉండితీర్సాలిన ఆ పరిస్దితిలో కూడా తమ క్లబ్ యుద్ధానికి వ్యతిరేకమని ఏ పక్షంవైపు ఉండబోమని స్పష్టం చేశారు. ఆ క్లబ్ ఏ సైనికుడు అవసరంలో ఉన్నా.. తిండి, బట్టలు అందించారు. సైనిక శిబిరంలో టైఫాయిడ్ లాంటి మహమ్మారి విజృంభిస్తుంటే సపర్యలు చేశారు.
ఇంతకీ ఈ యాన్ ఎవరంటే..
1832లో వర్జీనియాలోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు యాన్. తన జీవితం సాఫీగా సాగిపోతుండేది. నచ్చిన వ్యక్తితో పెళ్లి ఆ తర్వాత పిల్లలు. అక్కడ నుంచే తనని కలిచి వేసే సంఘటనలు సందర్భాలు ఎదురు పడ్డాయి. అప్పట్లో పసిపిల్లలు చనిపోవడం ఎక్కువగా ఉండేది. అలానే యాన్‌కి పుట్టిన 13 మంది పిల్లల్లో నలుగురు మాత్రమే ఉన్నారని చెబుతారు. టైఫాయిడ్, డిప్తీరియా వంటి వ్యాధుల వల్ల ప్రతీ ఇంట్లో ఇలాంటి పరిస్దితే ఉండేది. యాన్ తన పిల్లలను ఎలాగో కోల్పోయింది. కానీ ఈ సమస్యకు తనవంతుగా పరిష్కారం కనుక్కోవాలనుకుంది.
వ్యాధుల పట్ల అవగాహన లేకపోవడం, సమయానికి మందులు వాడకపోవడం శుభ్రత లేకపోవడం వంటివే శిశు మరణాలకు కారణమని తెలుసుకుంది. దాంతో మదర్స్‌డే వర్క్ క్లబ్స్‌ని ఏర్పాటు చేసింది. అయితే చాలామంది దీనిలో చేరి సేవలందించేందుకు ముందుకు వచ్చారు. వాళ్లంతా ఇంటిఇంటికి వెళ్తూ పసిపిల్లలకు వచ్చే వ్యాధులు గురించి అవగాహన కల్పిస్తూ..మందులు ఇస్తూ సేవలు చేశారు. అలా పసిపిల్లల మరణాలను చాలా వరకు తగ్గించగలిగారు. అదుగో అలాంటి సమయంలో అమెరికన్ అంతర్యుద్ధం రావడంతో శాంతిని నెలకొల్పేందుకు మదర్స డే వర్స్ క్లబ్స్ మరో అడుగు వేశాయి.
అవి ఎంతలా విజయం సాధించాయంటే..యుద్ధం పూర్తి అయిన తర్వాత ప్రజలందరిని ఒకటి చేసేందుకు అధికారులు యాన్‌ని సంప్రదించారు. దాంతో యాన్ 'మదర్స్ ఫ్రెండ్ షిప్ డే' పేరుతో రెండు వర్గాలకు చెందిన సైనికుల కుటుంబాలని ఒకటి చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ పనిచేస్తే ఊరుకునేది లేదంటూ అధికారులు సీరియస్ అయ్యారు. వాళ్లు ఎన్ని హెచ్చరికలు చేసినా వెనక్కి తగ్గకుండా ఇరు సైనికుల కుటుంబాలను సమావేశ పరిచి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసి పూర్తి స్దాయిలో సఫలం అయ్యింది యాన్. తల్లి ప్రేమతో ఎలాంటి సమస్యనైనా పరిష్కిరించొచ్చని చాటిచెప్పింది.
తన తల్లిలాంటి వాళ్ల కోసం..
అలా ఆమె తన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఏదో ఒక స్వచ్ఛంద సేవలో పాల్గొంటూనే ఉన్నారు యాన్. 1905లో యాన్ చనిపోయారు. యాన్ కూతురైన అన్నాకు తల్లి అంటే ఆరాధనగా ఉండేది. ఆమె కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించినా..తల్లి ఆశయాలు వాటి కోసం ఆమె చేసిన కృషి చూసి గర్వపడేది. అందుకే తల్లి చనిపోయాక తన తల్లిలాంటి వాళ్లని తలుచుకునేందుకు ప్రత్యేకంగా ఓ రోజు ఉండాలని, మదర్స్ డే ఏర్పాటు చేసి, దాన్ని పాటించాలనే ఉద్యమం మొదలు పెట్టింది.
నిజానికి ఏడాదిలో ఒకరోజును ప్రత్యేకించి అమ్మకోసం కేటాయించడం అనేది అప్పట్లో కొత్తేమి కాదు. ఈస్టర్‌కి ముందు ఒక నలభై రోజుల పాటు సాగే లెంట్ అనే సంప్రదాయంలో భాగంగా దూరంగా ఉన్న పిల్లలు తల్లిదగ్గరకు వచ్చే ఆచారం ఒకటి ఉంది. ఈజిప్టు నుంచి రష్యా వరకు మదర్స్ డే వంటి సంప్రదాయాలను పాటిస్తారు. కాకపోతే యాన్ కూతురు మొదలు పెట్టిన మదర్స్ డే కాస్త వ్యక్తిగతంగా, ఆధునికంగా కనిపిస్తుంది. అందుకే త్వరలోనే ప్రచారంలోకి వచ్చేసింది.
మదర్స్‌డేకి వ్యతిరేకంగా పోరాటం..
క్రమంగా మదర్స్ డే ప్రతి ఇంటికి చేరుకుంది. కానీ దాని మొదలు పెట్టిన అన్నా మాత్రం సంతోషంగా ఉండేది కాదు. తల్లిని తలుచుకుని తనతో మనసులోని మాటను పంచుకోవాల్సిన సమయాన్ని ఇలా గ్రీటింగ్ కార్డుల తంతుగా మారడం చూసి బాధపడేది. ఒక తెల్లటి పువ్వుని ధరించి తల్లిని గుర్తు చేసుకోవాలనే 'మదర్స్ డే; సంప్రదాయం పూల వ్యాపారంగా మారడం చేసి అన్నా మనసు విరిగిపోయింది.
అందుకే తను మొదలు పెట్టిన మదర్స్‌డే ని రద్దు చేయాలంటూ మరో ఉద్యమాన్ని మొదలు పెట్టింది. చివరి రోజుల వరకు మదర్స్‌డేకి వ్యతిరేకంగా పోరాడింది. ఇక ఓపిక లేని దశలో ఓ శానిటోరియంలో చేరి దయనీయమైన స్దితిలో చనిపోయింది. మదర్స్ డే మొదలై ఇప్పటికీ నూరేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ దాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు రెండు భిన్నమైన మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఫార్మాల్టిగా అమ్మను తలుచుకోవడమా!..లేకపోతే ప్రేమకు, సహనానికి మారురూపం అయిన అమ్మ పట్ల అభిమానాన్ని చాటుకోవడమా! చాయిస్ ఈజ్ అవర్స్..!.
(చదవండి: మే నెలలో రెండో ఆదివారం మదర్స్ డే : కానీ అక్కడ మాత్రం రెండు సార్లు)
Comments
Please login to add a commentAdd a comment