Mothers Day 2024
-
Mothersday 2024 ‘బంగారం నువ్వమ్మా’! టాలీవుడ్ అమ్మల్నిచూశారా?
-
మదర్స్ డే 2024 : బీటౌన్ మామ్స్పై ఒక లుక్కేసుకోండి! (ఫోటోలు)
-
కుమారునితో స్టార్ హీరోయిన్.. వీడియో పోస్ట్ చేసిన భర్త!
ప్రేమకు చిరునామా అమ్మ. మమతకు మారు పేరు అమ్మ. అమ్మ ఎవరికైనా అమ్మే. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కన్న పిల్లల లాలనలో తరించిపోయోది అమ్మ. నటి నయనతార ఇప్పుడు అలాంటి మాతృత్వ మధుర్యాన్నే ఆస్వాదిస్తున్నారు. హీరోయిన్గా అగ్రస్థానంలో రాణిస్తున్న నయనతార ఇటీవలే జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.కాగా, గత 2022లో దర్శకుడు విఘ్నేశ్ శివన్‌కు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి ఆరేళ్ల ప్రేమకు నిర్వచనం ఈ పెళ్లి. కాగా అదే ఏడాది అక్టోబర్ నెలలో నయనతార, విఘ్నేశ్ శివన్‌లు సరోగసీ విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. వీరికి ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా నయనతార, విఘ్నేశ్ శివన్‌లో తమ జీవితంలో రీల్ విషయం, రియల్ విషయం గానీ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటారు.తమ పెళ్లి వేడుకను మాత్రం ఒక ఓటీటీ సంస్థకు విక్రయించి వార్తల్లోకి ఎక్కారు. ఇక పుట్టిన రోజు గాని, ఇతర వేడుకలు గాని సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆనందాన్ని పంచుకుంటారు. అలాగే తమ పిల్లల అన్నప్రాసన వేడుక ఫొటోలను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం మాతృదినోత్సం సందర్భంగా నటి నయనతార తన చిన్నపిల్లగా మారిపోయారు.వారి ముద్దు మురిపాల్లో మురిసిపోయారు. పిల్లలను భుజాలపై మోస్తూ పరవశించిపోయారు. పిల్లలను లాలించి, మురిపించి అమ్మతనాన్ని అనుభవించారు. వారి చేతులు పట్టుకుని బుడి బుడి అడుగులు వేయిస్తూ ఆనందంతో పరవశించిపోయారు. ఈ వీడియోను నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అందులో నయనతారను ఉద్ధేశించి విఘ్నేశ్‌శివన్ పేర్కొంటూ నువ్వే నా ప్రాణం, నా లోకం అని పేర్కొన్నారు. ఈ వీడియో చాలా క్యూట్‌గా ఉంది. అమ్మకు కన్నపిల్లల ముందు తన స్థాయి అస్సలు గుర్తుకురాదని ఈ వీడియోతో నయనతార మరోసారి నిరూపించారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
ఈ పిల్లాడు.. టీమిండియా నయా సూపర్‌స్టార్? గుర్తుపట్టారా?
-
Celebrities With Their Mom's: మామ్స్తో సెలబ్రిటీలు, రెండు కళ్లూ చాలవు (ఫోటోలు)
-
సూపర్ మామ్: తన క్యూటీస్‌తో నయన తార స్పెషల్ వీడియో వైరల్
మే 12 ఆదివారం మాతృదినోత్సవ వేడుకలను ప్రపంచంమంతా ఉత్సాహంగా జరుపుకున్నారు. సామాన్యుల నుంచి, పలు రంగాలకు చెందిన సెలబ్రిటీల దాకా మదర్స్ డేని ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా లేడీ సూపర్ స్టార్ నయన తార ఒక అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.Happy Mother’s Day👩👦👦to all the Super Moms 😇💝 pic.twitter.com/BxYyOJl0vK— Nayanthara✨ (@NayantharaU) May 12, 2024 సూపర్ మామ్స్ అందరికీ హ్యాపీ మదర్స్‌డే అంటూ నయన్ తన విషెస్ అందించారు. తన కవల పిల్లలిద్దరితో ఆనందంగా గడుపుతున్న వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ సూపర్బ్ అంటూ కమెంట్ చేశారు. ఇంకా స్టార్ హీరోయిన్ అలియా తన ఫ్యామిలీతో గడిపిన ఫోటోను షేర్ చేసింది. భర్త రణబీర్ కపూర్, అత్తగారు నీతూ కపూర్ ,తల్లి సోనీ రజ్దాన్,సోదరి షాహీన్ భట్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసింది.అలాగే కాజల్ అగర్వాల్ కూడా తల్లితో ఉన్న ఒక ఫోటోలు షేర్ చేసి మాతృదినోత్సవ శుభాకాంక్షలు అందించింది. -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో నాగచైతన్య తల్లి!
అక్కినేని హీరోల్లో నాగచైతన్య కాస్త డిఫరెంట్. పెద్దగా బయట కనిపించడు. సినిమా షూటింగ్స్ ఫొటోలు ఏమైనా వైరల్ అయితే తప్ప సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండడు. అలాంటిది మదర్స్ డే సందర్భంగా అమ్మతో ఉన్న ఓ క్యూట్ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అయితే ఇందులో చైతూ తల్లిని చాలామంది తొలుత గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే అంతలా మారిపోయి కనిపించారు.(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్)టాలీవుడ్ దిగ్గజ నిర్మాత రామానాయుడు కూతురు లక్ష్మి. ఈమె హీరో నాగార్జునని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు పుట్టిన సంతానమే నాగచైతన్య. వ్యక్తిగత కారణాలతో నాగార్జున-లక్ష్మి విడాకులు తీసుకున్నారు. కానీ కొడుకు చైతూ మాత్రం తండ్రి నాగార్జున, తల్లి లక్ష్మితో మంచి రిలేషన్ మెంటైన్ చేస్తుంటాడు. అప్పట్లో పూర్తి హెయిర్‌తో కనిపించిన లక్ష్మి.. ఇప్పుడు చైతూ షేర్ చేసిన పిక్‌లో తక్కువ జుత్తులో ఉండేసరికి చాలామంది గుర్తుపట్టలేకపోయారు. ఆమె ఈమె ఒకరేనా అని మాట్లాడుకుంటున్నారు.ఇక చైతూ సినిమాల విషయానికొస్తే.. 'తండేల్' సినిమా చేస్తున్నాడు. నిజ జీవిత కథ ఆధారంగా తీస్తున్న ఈ మూవీలో చైతూ.. జాలారిగా కనిపించబోతున్నాడు. ఇతడి సరసన సాయిపల్లవి హీరోయిన్గా చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. అక్టోబరు రిలీజ్ అంటున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
మదర్స్ డే స్పెషల్: 47 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే మాతృ దినోత్సవం సందర్భంగా ఓ భావోద్వేగమైన పోస్ట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్ 1977 నాటి చిత్రం. ఇందులో ఆనంద్ మహీంద్రా తన తల్లితో ఉండటం చూడవచ్చు. నేను కాలేజీకి వెళ్ళడానికి ముందు అంటూ.. అమ్మ ఎప్పుడూ కెమెరా వైపు కాకుండా దూరంగా చూస్తూ ఉంది. ఇందులో తన బిడ్డ భవిష్యత్తును ఆశించింది. చదువులో విజయం సాధించి తన బిడ్డ సంతోషన్ని పొందాలని ఆమె ఆశించిందని ట్వీట్ చేసారు. అంతే కాకుండా హ్యాప్పీ మదర్స్ డే అమ్మా అంటూ మీ కలలను నెరవేర్చడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటామని అన్నారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. వేలమంది వీక్షించిన ఈ పోస్టును.. లెక్కకు మించిన నెటిజన్లు లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. మదర్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు.Back in 1977. Just before I left for college.My mother wasn’t looking into the camera;As usual she was gazing into the distance…trying to envision her childrens’ future, hoping that a good education would be their passport to success—and happiness.Happy #MothersDay Ma.… pic.twitter.com/nxPZEWzKSD— anand mahindra (@anandmahindra) May 12, 2024 -
న్యూ ఇయర్‌ను మించిన మదర్స్ డే! ఎలాగో చూడండి..
ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎన్ని పండుగలు, దినోత్సవాలు ఉన్నా మాతృ దినోత్సవానికి ఉన్న ప్రత్యేకత వేరు. ఇదిలా ఉంటే జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ మదర్స్ డేకి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు.జొమాటో డెలివరీ ఆర్డర్ వాల్యూమ్ పరంగా మదర్స్ డే కొత్త సంవత్సర వేడుకలను అధిగమించిందని దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. ఈ మేరకు జొమాటో కార్యాలయంలోని సందడిగా ఉన్న కార్యకలాపాల దృశ్యాలను ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశారు. పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి ఉద్యోగులు శ్రద్ధగా పని చేస్తున్న "సర్వీస్ రూమ్"గా దీనిని పేర్కొన్నారు."మొదటిసారిగా మదర్స్ డే, నూతన సంవత్సర వేడుకల కంటే (చాలా) ఎక్కువ వాల్యూమ్ రోజుగా మారుతోంది. ఈరోజు తమ తల్లులకు ట్రీట్ ఇచ్చేవారి కోసం పనిచేస్తున్నాం" అని పోస్టులో రాసుకొచ్చారు. అలాగే ఆఫీస్‌లోని సిబ్బందికి కూడా ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉందని ప్రకటరించారు. ఆహార పంపిణీ సేవలకు మదర్స్ డే ఒక ముఖ్యమైన సందర్భంగా ఉద్భవించడం వినియోగదారుల ప్రవర్తనలో వచ్చిన మార్పును సూచిస్తోంది.Mother's Day, for the first time ever, is turning out to be a (much) higher volume day than New Year's Eve. Full w̸a̸r̸ service room scenes at the office today. Fingers crossed, that we are able to serve everyone treating their moms today.A super cool surprise awaits… pic.twitter.com/3N37D00Udo— Deepinder Goyal (@deepigoyal) May 12, 2024 -
Mother's Day 2024: బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ‘అమ్మ’
నిస్వార్థ ప్రేమకు చిరునామ అమ్మ. తొమ్మిది నెలలు కడుపున మోసి, ప్రాణాలు పోయేంత నొప్పులను భరించి, ప్రాణం పోసిన తర్వాత బిడ్డ కోసం తల్లి చేసే త్యాగాలు అన్ని ఇన్ని కాదు. మన ఎదుగుదలలో అడుగడుగునా తోడుండే ఏకైక వ్యక్తి అమ్మ. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా..విలవిలలాడి పోయేది మొదటి వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మ ప్రేమకు గుర్తుగా ప్రతి ఏడాది మే రెండో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన కొన్ని టాలీవుడ్ సినిమాలపై లుక్కేద్దాం.గుంటూరు కారం(2024)మహేశ్‌బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం చిత్రం మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కినదే. ఇందులో మహేశ్‌కు తల్లిగా రమ్యకృష్ణ నటించింది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్ల చెదురైన ఓ మంచి కుటుంబం.. మళ్లీ ఎలా కలిసింది? దూరమైన తల్లి, కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా క్లైమాక్స్‌లో రమ్యకృష్ణ- మహేశ్‌బాబు మధ్య జరిగే సంభాషణలు హృదయాలను హత్తుకుంటాయి.ఒకే ఒక జీవితం(2022)శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అతని తల్లిగా సీనియర్ హీరోయిన్ అక్కినేని అమల నటించింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌కి మదర్ సెంటిమెంట్‌ని యాడ్ చేసి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకార్తిక్. 20 ఏళ్ల క్రితం తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకి.. తిరిగి అమ్మను చూసే అవకాశం వస్తే..? గతంలో చేసిన తప్పుల్ని సవరించుకునే చాన్స్ లభిస్తే..? ఇది వినడానికే ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంది. అంతే ఆసక్తికరంగా తెరపై చూపించాడు దర్శకుడు శ్రీకార్తీక్. టైమ్ మిషన్ కథని అమ్మ ఎమోషన్ తో ముడి పెట్టి ‘ఒకే ఒక జీవితం’చిత్రాన్ని తెరకెక్కించాడు. జీవితం ఎవరికీ రెండో అవకాశం ఇవ్వదు. ఒకవేళ ఇస్తే... విధి రాతని మార్చగలమా? అనే పాయింట్‌ని ఆసక్తికరంగా చూపించాడు.'బిచ్చగాడు'తమిళ నటుడు విజయ్ ఆంటోని నటించిన చిత్రం బిచ్చగాడు. 2016లో విడుదలైన పిచ్చైకారన్ అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారడం ఈ సినిమా కథాంశం. తెలుగులో మే 13, 2016న విడుదలైంది.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(2012)2012లో విడుదలైన చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అభిజిత్, సుధాకర్, కౌశిక్, షగున్, జరా షా, రష్మీ, కావ్య, నవీన్ పోలిశెట్టి, అమల ప్రధాన పాత్రలో నటించారు. తల్లి పాత్రలో అమల మెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రం హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అమ్మ చెప్పింది2006లో విడుదలైన చిత్రం ‘అమ్మ చెప్పింది’. శర్వానంద్, శ్రియా రెడ్డి, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. గంగరాజు గుణ్ణం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ప్రభాస్ 'ఛత్రపతి'(2005)రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'ఛత్రపతి'. 2005లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో భానుప్రియ ప్రభాస్‌కు తల్లిగా నటించింది. తల్లి, కుమారుల మధ్య అనుబంధం ఈ సినిమాలో చూపించారు. శ్రియ శరణ్ హీరోయిన్ పాత్ర పోషించింగి.యోగి: ఒక చిన్న గ్రామానికి చెందిన తల్లి తన కొడుకు కోసం నగరంలో వెతికే కథాచిత్రమే 'యోగి'. ఈ చిత్రంలో 'యే నోము నోచింది.. ఏ పూజ చేసింది' అనే పాట ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. తల్లి, కుమారుల ప్రేమను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ప్రభఆస్ హీరోగా నటించిన చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించారు.అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి(2003)2003లో దర్శకుడు పూరీ జగన్నాధ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన చిత్రం అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఒక తల్లి తన కొడుకు కోసం తన భర్తతో సహా సర్వస్వం త్యాగం చేస్తుంది. ఈ సినిమాలో రవితేజ, ఆసిన్, జయసుధ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.నిజంకొడుకు సాయంతో భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకునే తల్లి కథే నిజం. ఈ సినిమాను తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు, రక్షిత, రామేశ్వరి, గోపీచంద్, రంగన్నాధ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం 2003లో విడుదలైంది. ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, సహాయ నటిగా రామేశ్వరి నంది అవార్డులను గెలుచుకున్నారు. ఈ సినిమా ప్రస్తుతం జియో సినిమా, సన్ నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది. వీటితో పాటు అమ్మ, యమలీల, మాతృదేవోభవ, లోఫర్, చిరుత, అమ్మ రాజీనామా, సింహరాశి, పెదబాబు లాంటి సినిమాలు కూడా మదర్ సెంటిమెంట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. -
అమ్మ ప్రేమను వర్ణించే మధురమైన పాటలు
ఈ సృష్టి మీదకు వచ్చిన ప్రతిఒక్కరూ పుట్టుకతోనే రుణపడి ఉండేది ఒక తల్లికి మాత్రమే! నవ మాసాలు మోసి.. పురిటినొప్పులు భరించిన ఆ తల్లికి ఏమిచ్చినా తక్కువే! బిడ్డ క్షేమారోగ్యాలే తన సిరిసంపదలుగా భావించే ఆ మాతృమూర్తి గొప్పదనాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవు. అందుకే కళాకారులు పాటల రూపంలో తనను పొగిడారు. పాటల రూపంలో తన స్వభావాన్ని, త్యాగాన్ని వర్ణించారు. నేడు (మే 12న) మదర్స్ డే సందర్భంగా కమ్మనైన అమ్మ పాటలను కొన్నింటిని కింద ఇచ్చాం.. విని ఆనందించండి..1. నాలో నిను చూసుకోగా.. 2. వంద దేవుళ్లే కలిసొచ్చినా.. 3. అమ్మా.. అమ్మా.. నే పసివాణ్నమ్మా.. 4. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా.. 5. సువ్వి సువ్వాలమ్మా.. 6. ఎదగరా.. ఎదగరా.. 7. అమ్మా అని కొత్తగా.. 8. అమ్మ 9. అమ్మనే అయ్యానురా.. 10. అమ్మా.. అమ్మా.. నీ వెన్నెల.. 11.. అమ్మా.. వినమ్మా.. 12. అమ్మా.. నన్ను మళ్లీ పెంచవా.. ఇవే కాకుండా ఇంకా ఎన్నో సినిమా పాటలు అమ్మ ప్రేమను కమ్మగా వినిపించాయి. సినీ సాంగ్సే కాకుండా.. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ.. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో.. ఇలా ఎన్నో జానపద పాటలు సైతం తల్లి మమకార మాధుర్యాన్ని గుర్తు చేశాయి. -
మదర్స్ డే వెనకాల మనసును కదిలించే కథ!
అవతార మూర్తి అయిన అమ్మ ప్రేమకు దాసోహం అన్నాడు. కనిపించే ప్రత్యక్ష దైవం అమ్మ అని పురాణాలు సైతం చెబుతున్నాయి. అలాంటి అపురూపమైన అమ్మ ప్రేమ, సేవలను తలుచుకుని గౌరవించడం కోసం ప్రత్యేకంగా ఓ రోజు ఏర్పాటు చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మే నెల రెండో ఆదివారం మదర్స్ డేని వేడుకగా జరుపుకుంటున్నాం. అయితే ఈ మదర్స్ డే ఎలా ప్రాచుర్యంలోకి వచ్చి ఎలా ఏర్పడిందో వింటే మనసు భావోద్వేగానికి గురవ్వుతుంది. అమ్మ అనే రెండు అక్షరాలు ఎంతటి బాధనైనా పోగొట్టేస్తుందనడానికి ఈ గాదే ఉదహారణ.అమెరికా అంతర్యుద్ధం...1861-65 కాలం అమెరికాలో భయంకరంగా అంతర్యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో అప్పటిదాక ఒకటిగా ఉన్న ప్రజలు ప్రాంతాల వారీగా విడిపోయారు యూనియన్ కాన్ఫడరేంట్ అంటూ రెండు వర్గాలుగా చీలిపోయారు అలాంటి సమయంలో వర్జినియాలో శత్రువులకు సంబంధించిన సైనికుడు చనిపోయారు. అతన్ని చూడటానికి ఎవరూ ముందుకు రాలేదు. మూపైళ్లు కూడా లేని ఓ మహిళ మాత్రం అతనని సాటి మనిషిగా భావించింది. అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దించింది.ఆమె పేరు యాన్ జార్వీస్. కేవలం ప్రార్దనలతో సరిపెట్టలేదు. తను స్దాపించిన మదర్స్ డే వర్క్స్ క్లబ్‌తో ప్రజల్లో ద్వేషాన్ని తగ్గించే యత్నం చేశారు. దేశంలో ప్రతిఒక్కరూ ఎవరోఒకరి పక్షాన ఉండితీర్సాలిన ఆ పరిస్దితిలో కూడా తమ క్లబ్ యుద్ధానికి వ్యతిరేకమని ఏ పక్షంవైపు ఉండబోమని స్పష్టం చేశారు. ఆ క్లబ్ ఏ సైనికుడు అవసరంలో ఉన్నా.. తిండి, బట్టలు అందించారు. సైనిక శిబిరంలో టైఫాయిడ్ లాంటి మహమ్మారి విజృంభిస్తుంటే సపర్యలు చేశారు.ఇంతకీ ఈ యాన్ ఎవరంటే..1832లో వర్జీనియాలోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు యాన్. తన జీవితం సాఫీగా సాగిపోతుండేది. నచ్చిన వ్యక్తితో పెళ్లి ఆ తర్వాత పిల్లలు. అక్కడ నుంచే తనని కలిచి వేసే సంఘటనలు సందర్భాలు ఎదురు పడ్డాయి. అప్పట్లో పసిపిల్లలు చనిపోవడం ఎక్కువగా ఉండేది. అలానే యాన్‌కి పుట్టిన 13 మంది పిల్లల్లో నలుగురు మాత్రమే ఉన్నారని చెబుతారు. టైఫాయిడ్, డిప్తీరియా వంటి వ్యాధుల వల్ల ప్రతీ ఇంట్లో ఇలాంటి పరిస్దితే ఉండేది. యాన్ తన పిల్లలను ఎలాగో కోల్పోయింది. కానీ ఈ సమస్యకు తనవంతుగా పరిష్కారం కనుక్కోవాలనుకుంది. వ్యాధుల పట్ల అవగాహన లేకపోవడం, సమయానికి మందులు వాడకపోవడం శుభ్రత లేకపోవడం వంటివే శిశు మరణాలకు కారణమని తెలుసుకుంది. దాంతో మదర్స్‌డే వర్క్ క్లబ్స్‌ని ఏర్పాటు చేసింది. అయితే చాలామంది దీనిలో చేరి సేవలందించేందుకు ముందుకు వచ్చారు. వాళ్లంతా ఇంటిఇంటికి వెళ్తూ పసిపిల్లలకు వచ్చే వ్యాధులు గురించి అవగాహన కల్పిస్తూ..మందులు ఇస్తూ సేవలు చేశారు. అలా పసిపిల్లల మరణాలను చాలా వరకు తగ్గించగలిగారు. అదుగో అలాంటి సమయంలో అమెరికన్ అంతర్యుద్ధం రావడంతో శాంతిని నెలకొల్పేందుకు మదర్స డే వర్స్ క్లబ్స్ మరో అడుగు వేశాయి. అవి ఎంతలా విజయం సాధించాయంటే..యుద్ధం పూర్తి అయిన తర్వాత ప్రజలందరిని ఒకటి చేసేందుకు అధికారులు యాన్ని సంప్రదించారు. దాంతో యాన్ 'మదర్స్ ఫ్రెండ్ షిప్ డే' పేరుతో రెండు వర్గాలకు చెందిన సైనికుల కుటుంబాలని ఒకటి చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ పనిచేస్తే ఊరుకునేది లేదంటూ అధికారులు సీరియస్ అయ్యారు. వాళ్లు ఎన్ని హెచ్చరికలు చేసినా వెనక్కి తగ్గకుండా ఇరు సైనికుల కుటుంబాలను సమావేశ పరిచి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసి పూర్తి స్దాయిలో సఫలం అయ్యింది యాన్. తల్లి ప్రేమతో ఎలాంటి సమస్యనైనా పరిష్కిరించొచ్చని చాటిచెప్పింది.తన తల్లిలాంటి వాళ్ల కోసం..అలా ఆమె తన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఏదో ఒక స్వచ్ఛంద సేవలో పాల్గొంటూనే ఉన్నారు యాన్. 1905లో యాన్ చనిపోయారు. యాన్ కూతురైన అన్నాకు తల్లి అంటే ఆరాధనగా ఉండేది. ఆమె కెరీర్లో ఎన్నో విజయాలు సాధించినా..తల్లి ఆశయాలు వాటి కోసం ఆమె చేసిన కృషి చూసి గర్వపడేది. అందుకే తల్లి చనిపోయాక తన తల్లిలాంటి వాళ్లని తలుచుకునేందుకు ప్రత్యేకంగా ఓ రోజు ఉండాలని, మదర్స్ డే ఏర్పాటు చేసి, దాన్ని పాటించాలనే ఉద్యమం మొదలు పెట్టింది. నిజానికి ఏడాదిలో ఒకరోజును ప్రత్యేకించి అమ్మకోసం కేటాయించడం అనేది అప్పట్లో కొత్తేమి కాదు. ఈస్టర్కి ముందు ఒక నలభై రోజుల పాటు సాగే లెంట్ అనే సంప్రదాయంలో భాగంగా దూరంగా ఉన్న పిల్లలు తల్లిదగ్గరకు వచ్చే ఆచారం ఒకటి ఉంది. ఈజిప్టు నుంచి రష్యా వరకు మదర్స్ డే వంటి సంప్రదాయాలను పాటిస్తారు. కాకపోతే యాన్ కూతురు మొదలు పెట్టిన మదర్స్ డే కాస్త వ్యక్తిగతంగా, ఆధునికంగా కనిపిస్తుంది. అందుకే త్వరలోనే ప్రచారంలోకి వచ్చేసింది. మదర్స్‌డేకి వ్యతిరేకంగా పోరాటం..క్రమంగా మదర్స్ డే ప్రతి ఇంటికి చేరుకుంది. కానీ దాని మొదలు పెట్టిన అన్నా మాత్రం సంతోషంగా ఉండేది కాదు. తల్లిని తలుచుకుని తనతో మనసులోని మాటను పంచుకోవాల్సిన సమయాన్ని ఇలా గ్రీటింగ్ కార్డుల తంతుగా మారడం చూసి బాధపడేది. ఒక తెల్లటి పువ్వుని ధరించి తల్లిని గుర్తు చేసుకోవాలనే 'మదర్స్ డే; సంప్రదాయం పూల వ్యాపారంగా మారడం చేసి అన్నా మనసు విరిగిపోయింది. అందుకే తను మొదలు పెట్టిన మదర్స్‌డే ని రద్దు చేయాలంటూ మరో ఉద్యమాన్ని మొదలు పెట్టింది. చివరి రోజుల వరకు మదర్స్‌డేకి వ్యతిరేకంగా పోరాడింది. ఇక ఓపిక లేని దశలో ఓ శానిటోరియంలో చేరి దయనీయమైన స్దితిలో చనిపోయింది. మదర్స్ డే మొదలై ఇప్పటికీ నూరేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ దాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు రెండు భిన్నమైన మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఫార్మాల్టిగా అమ్మను తలుచుకోవడమా!..లేకపోతే ప్రేమకు, సహనానికి మారురూపం అయిన అమ్మ పట్ల అభిమానాన్ని చాటుకోవడమా! చాయిస్ ఈజ్ అవర్స్..!.(చదవండి: మే నెలలో రెండో ఆదివారం మదర్స్ డే : కానీ అక్కడ మాత్రం రెండు సార్లు) -
Famous Celebrities Mothers Photos: భారతీయులు గర్వించదగ్గ ప్రభావవంతమైన తల్లులు