గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో నాగచైతన్య తల్లి! | Naga Chaitanya MotherS Day Post And Lakshmi Photo Latest | Sakshi
Sakshi News home page

Naga Chaitanya Mother: మదర్స్ డే సందర్భంగా చైతూ క్యూట్ పిక్.. సడన్‌గా చూసి షాక్

Published Sun, May 12 2024 9:50 PM | Last Updated on Sun, May 12 2024 9:50 PM

Naga Chaitanya MotherS Day Post And Lakshmi Photo Latest

అక్కినేని హీరోల్లో నాగచైతన్య కాస్త డిఫరెంట్. పెద్దగా బయట కనిపించడు. సినిమా షూటింగ్స్ ఫొటోలు ఏమైనా వైరల్ అయితే తప్ప సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండడు. అలాంటిది మదర్స్ డే సందర్భంగా అమ్మతో ఉన్న ఓ క్యూట్ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అయితే ఇందులో చైతూ తల్లిని చాలామంది తొలుత గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే అంతలా మారిపోయి కనిపించారు.

(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్)

టాలీవుడ్ దిగ్గజ నిర్మాత రామానాయుడు కూతురు లక్ష‍్మి. ఈమె హీరో నాగార్జునని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు పుట్టిన సంతానమే నాగచైతన్య. వ్యక్తిగత కారణాలతో నాగార్జున-లక్ష‍్మి విడాకులు తీసుకున్నారు. కానీ కొడుకు చైతూ మాత్రం తండ్రి నాగార్జున, తల్లి లక్ష‍్మితో మంచి రిలేషన్ మెంటైన్ చేస్తుంటాడు. అప్పట్లో పూర్తి హెయిర్‌తో కనిపించిన లక్ష‍్మి.. ఇప్పుడు చైతూ షేర్ చేసిన పిక్‌లో తక్కువ జుత్తులో ఉండేసరికి చాలామంది గుర్తుపట్టలేకపోయారు. ఆమె ఈమె ఒకరేనా అని మాట్లాడుకుంటున్నారు.

ఇక చైతూ సినిమాల విషయానికొస్తే.. 'తండేల్' సినిమా చేస్తున్నాడు. నిజ జీవిత కథ ఆధారంగా తీస్తున్న ఈ మూవీలో చైతూ.. జాలారిగా కనిపించబోతున్నాడు. ఇతడి సరసన సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. అక్టోబరు రిలీజ్ అంటున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement