ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎన్ని పండుగలు, దినోత్సవాలు ఉన్నా మాతృ దినోత్సవానికి ఉన్న ప్రత్యేకత వేరు. ఇదిలా ఉంటే జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ మదర్స్ డేకి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు.
జొమాటో డెలివరీ ఆర్డర్ వాల్యూమ్ పరంగా మదర్స్ డే కొత్త సంవత్సర వేడుకలను అధిగమించిందని దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. ఈ మేరకు జొమాటో కార్యాలయంలోని సందడిగా ఉన్న కార్యకలాపాల దృశ్యాలను ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశారు. పెరిగిన డిమాండ్‌ను తీర్చడానికి ఉద్యోగులు శ్రద్ధగా పని చేస్తున్న "సర్వీస్ రూమ్"గా దీనిని పేర్కొన్నారు.
"మొదటిసారిగా మదర్స్ డే, నూతన సంవత్సర వేడుకల కంటే (చాలా) ఎక్కువ వాల్యూమ్ రోజుగా మారుతోంది. ఈరోజు తమ తల్లులకు ట్రీట్ ఇచ్చేవారి కోసం పనిచేస్తున్నాం" అని పోస్టులో రాసుకొచ్చారు. అలాగే ఆఫీస్‌లోని సిబ్బందికి కూడా ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ఉందని ప్రకటరించారు. ఆహార పంపిణీ సేవలకు మదర్స్ డే ఒక ముఖ్యమైన సందర్భంగా ఉద్భవించడం వినియోగదారుల ప్రవర్తనలో వచ్చిన మార్పును సూచిస్తోంది.
Mother's Day, for the first time ever, is turning out to be a (much) higher volume day than New Year's Eve.
Full w̸a̸r̸ service room scenes at the office today. Fingers crossed, that we are able to serve everyone treating their moms today.
A super cool surprise awaits… pic.twitter.com/3N37D00Udo— Deepinder Goyal (@deepigoyal) May 12, 2024
Comments
Please login to add a commentAdd a comment