
సాక్షి, విజయవాడ : పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు పక్క రాష్ట్రంలో కూర్చొని లేఖలు రాస్తూ కాలయాపన చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి పురిఘళ్ల రఘురాం మండిపడ్డారు. 40 ఏళ్ల అనుభవముందని చెప్పుకునే చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలకు సలహాలు ఇవ్వకుండా విమర్శలకు పరిమితం కావడం బాధాకరమన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ చంద్రబాబు తన ఎమ్మెల్యేలను 12 గంటలు దీక్షలు చేయమన్నారు. ( ప్రముఖ నటుడి తండ్రి మృతి )
కానీ, పేద ప్రజలను ఆదుకోమని చెప్పకపోవడం బాధాకరం. కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో యనమల దిక్కుమాలిన విమర్శలు చేయడం వారిపై అసహ్యం వచ్చేలా చేస్తున్నాయి. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 24 గంటలు పని చేస్తున్నాయ’’ని అన్నారు. ( కపిల్ దేవ్ గుండు.. ఆమే కారణం! )
Comments
Please login to add a commentAdd a comment