రాజసం చాటిన గిత్తలు
నెల్లూరు(అగ్రికల్చర్): ఒంగోలు జాతి పశువుల ప్రద్శనలో భాగంగా గిత్తలు తమ రాజసం చాటారుు. నెల్లూరు సమీపంలోని కనుపర్తిపాడు లో ఉన్న పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మైదానంలో చివరి రోజైన ఆదివారం గిత్తల ప్రదర్శన కోలాహలంగా సాగింది. ఫైనల్‌గా పూం డ్ల వెంకురెడ్డి గోశాలకు చెందిన ఆవు, గిత్తల విభాగంలో కర్నూలు జిల్లా కాటం మురళీధర్‌కు చెందిన గిత్త ఛాంపియన్లుగా నిలిచారుు.
గిత్తకు కిలో వెండి, ఆవుకు అరకిలో వెండి బహూకరించారు. ప్రదర్శనను నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆసక్తిగా తిలకించారు. పశువుల యజమానులతో ముచ్చటించడటంతో పాటు ఒంగోలు జాతి పశుసంపద వృద్ధిలో వారి కృషిని అభినందించారు. ప్రదర్శనను తిలకించిన ప్రముఖుల్లో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, కార్పొరేటర్ ఆనం రంగమయూర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
గోసంపదను రక్షించుకోవాలి:
మేకపాటి రాజమోహన్‌రెడ్డి
గోసంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎంపీ రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఒక ఆవు సాయంతో 30 ఎకరాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేయవచ్చన్నారు. ఆర్గానిక్ వ్యవసాయంతో రసాయనాల్లేని ఆరోగ్యకరమైన ఉత్పత్తులను పొందవచ్చన్నారు. పశుసంపదను కాపాడుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగుచర్యలు తీసుకోవాలన్నారు. పూండ్ల వెంకురెడ్డిచారిటబుల్ట్రస్ట్ నిర్వహిం చిన ఒంగోలు జాతి అందాల పశువుల ప్రదర్శనతో నెల్లూరుకు ఎనలేని గుర్తింపు వచ్చిందని వెంకురెడ్డి అభినందనీయులని పేర్కొన్నారు.
ఒంగోలుజాతిని రక్షించుకోవాలి:
మేకపాటి చంద్రశేఖరరెడ్డి
ఒంగోలు జాతి పశువులను పరిరక్షించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. బహుమతి ప్రదానోత్సవానికి ఆ యన ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. సింధు నాగరికత కాలం నుంచి పశువులు వ్యవసాయానికి ఆసరాగా ఉండేవని పేర్కొన్నారు. ఒంగోలు, గుండ్లకమ్మ పరిసర ప్రాంతాల్లోని పశుగ్రాసంలో కాల్షియం,భాస్వరం ఎక్కువగా ఉండడంతోఒంగోలు జాతి పశువులు అభివృ ద్ధి చెందాయని వివరించారు. కార్యక్రమంలో పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వెంకురెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్ సతీష్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, మేనేజర్ సుబ్బారెడ్డి, డా క్టర్ వెంకటేశ్వరరావు, శ్రీనివాసులురెడ్డి, సీతారామిరెడ్డి, వెంకటస్వామిరెడ్డి పాల్గొన్నారు.
ఆసక్తిగా సాగిన గిత్తల పోటీలు
చివరి రోజు ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శన ఆ సక్తికరంగా సాగింది. పాలపళ్ల విభాగంలో నె ల్లూరు ఫత్తేఖాన్పేటకు చెందిన పిండి సురేష్‌బాబు, వైఎస్సార్ కడప జిల్లా నెల్లూరు కొట్టాలకు చెందిన చిలంకూరి కిరణ్‌కుమార్‌రెడ్డి, అ దే జిల్లా కేతవరానికి చెందిన గవిరెడ్డి సావి త్రమ్మ గిత్తలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారుు. కన్సోలేషన్ బహుమతి చిలంకూరి కిరణ్‌కుమార్‌రెడ్డికి చెందిన గిత్త దక్కించుకుంది.
ఒక జత పళ్ల గిత్తల విభాగంలో గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన శ్రీరాందుర్గాప్రసాద్, నాదెండ్లకు చెందిన నల్లబోరుుల శ్రీరాములు మెమోరియల్ ట్రస్టు, నెల్లూరుకు చెందిన పిండి సురేష్‌బాబు గిత్తలు వరుసగా మొదటి మూడు స్థానాలను సొంతం చేసుకున్నారుు.
రెండు జతల పళ్ల గిత్తల విభాగంలో పూండ్ల వెంకురెడ్డి ట్రస్టుకు చెందిన గిత్తలు ప్రథమ, ద్వితీయ, పిండి సురేష్‌బాబు గిత్త తృతీయ స్థానాల్లో నిలిచారుు.
మూడు జతల పళ్ల గిత్తల విభాగంలో ప్రకాశం జిల్లా పొట్టెపాడుకు చెందిన బనిగల నరసింహరావు, అదే జిల్లా వంకాయలపాడుకు చెందిన భవనం వెంకటరత్నారెడ్డి, గుంటూరుజిల్లా కొర్రపాడుకు చెందిన ఎరువ హనిమిరెడ్డికి చెందిన గిత్తలకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించారుు.
పూర్తిస్థాయి గిత్తల విభాగంలో కర్నూలు జిల్లాకు చెందిన కాటంమురళీధర్రెడ్డి గిత్తకు ప్రథమస్ధానం, గుంటూరు జిల్లా పాత ఎల్లాయపాళేనికి చెందిన కాసు అయ్యప్పరెడ్డి గిత్తకు ద్వితీయస్థానం, ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన కల్యాణ్ ఆక్వా ప్లాంట్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ వారి గిత్తకు తృతీయ స్థానం దక్కింది. ప్రకాశం జిల్లాకు చెందిన అట్ల సత్యనారాయణ, నలుబోలు కోటయ్యల గిత్తలు కన్సోలేషన్ బహుమతులు దక్కించుకున్నారుు.