ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం చెందాడు. తల్లాడ మండలం వెంకటగిరికి చెందిన మంగయ్య (45) శనివారం తెల్లవారు జామున ట్రాక్టర్ నడుపుకుంటూ ఖమ్మం నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు... ఆ క్రమంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ట్రాక్టర్ను ఢీకొట్టి వెళ్లి పోయింది.
డ్రైవర్ మంగయ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. ట్రాక్టర్‌పై ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.