సాక్షి, తిరుపతి: తిరుపతి- ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు(17405) ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం ఉదయం పొగలు వచ్చాయి. వెంకటగిరి రైల్వేస్టేషన్ సమీపంలో ఏసీ కోచ్‌లో పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు.అనంతం రైల్వే కోపైలట్, సిబ్బంది ఏసీ బోగీ వద్దకు వచ్చి పరిశీలించారు.
బ్రేకులు పట్టేయడంతో పొగలు వచ్చినట్లు వారు తెలిపారు. ఈ ఘటనతో దాదాపు 20 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. అనంతరం మరమ్మతులు చేపట్టడంతో కృష్ణా ఎక్స్‌ప్రెస్ యథావిధిగా బయల్దేరింది. సరైన సమయంలో ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణికులు చైన్ లాగడంతో ప్రమాదం తప్పింది.
Comments
Please login to add a commentAdd a comment