Krishna Express
-
Krishna Express: కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గర రైలు పట్టా విరిగి పెద్ద శబ్ధం రావడంతో వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో, ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు యాదాద్రి జిల్లా ఆలేరు స్టేషన్ దాటుతున్న సమయంలో భారీశబ్దం వినిపించింది. దీంతో హడలిపోయిన ప్రయాణికులు రైలు సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు రైలును నిలిపివేశారు. అనంతరం పట్టాలను పరిశీలించగా రైలు పట్టా విరిగినట్టు గుర్తించారు. దీంతో, వెంటనే మరమ్మతులు చేశారు. అనంతరం రైలు బయలుదేరింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. -
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
సాక్షి, తిరుపతి: తిరుపతి- ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు(17405) ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం ఉదయం పొగలు వచ్చాయి. వెంకటగిరి రైల్వేస్టేషన్ సమీపంలో ఏసీ కోచ్‌లో పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు.అనంతం రైల్వే కోపైలట్, సిబ్బంది ఏసీ బోగీ వద్దకు వచ్చి పరిశీలించారు. బ్రేకులు పట్టేయడంతో పొగలు వచ్చినట్లు వారు తెలిపారు. ఈ ఘటనతో దాదాపు 20 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. అనంతరం మరమ్మతులు చేపట్టడంతో కృష్ణా ఎక్స్‌ప్రెస్ యథావిధిగా బయల్దేరింది. సరైన సమయంలో ప్రమాదాన్ని గుర్తించిన ప్రయాణికులు చైన్ లాగడంతో ప్రమాదం తప్పింది. -
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు
సికింద్రాబాద్: తిరుపతి నుంచి సికింద్రాబాద్ మీదుగా ఆదిలాబాద్ వెళ్లాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ రూట్లో బాంబు ఉందని ఓ యువకుడు చేసిన ఆకతాయి ఫోన్ సందేశం శుక్రవారం రాత్రి కలకలం సృష్టించింది. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు ఉందని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాక అది పేలుతుందని ఆకతాయి పంపిన మెసేజ్‌తో ఇటు జీఆర్పీ, అటు ఆర్పీఎఫ్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు రాత్రి 8.45 గంటలకు చేరుకోవాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు గంట ఆలస్యంగా నడుస్తుంది. 8 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి రాచకొండ పోలీసులకు ఫోన్ చేసి బాంబు ఉన్నట్లు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పటికే మౌలాలి రైల్వేస్టేషన్‌కు చేరుకున్న రైలును అదే స్టేషన్లో నిలిపి సోదాలు నిర్వహించారు. అదే సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న బాంబ్ స్వా్వడ్ బృందాలు తనిఖీల అనంతరం ఆకతాయి పనిగా నిర్థారించారు. రెండు గంటలు ఆలస్యంగా కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఆ మీదట ఆదిలాబాద్‌కు బయలుదేరి వెళ్లింది. రైలులో ప్రయాణిస్తూనే .. మహబూబాబాద్‌కు చెందిన కిరణ్‌కుమార్ అనే యువకుడు అదే రైలులో ప్రయాణిస్తూ పోలీసులకు సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్ చేశాడు. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో అరాచక శక్తులు ప్రయాణిస్తున్నాయని వారు రైలును పేల్చే ప్రయత్నం చేస్తున్నారని మెసేజ్‌లో పేర్కొన్నాడు. ఒక వైపు తనిఖీలు చేస్తూనే మరోవైపు మెస్సేజ్ అందిన ఫోన్ నెంబర్ సిగ్నల్ ఆధారంగా సందేశం పంపిన వ్యక్తి అదే రైలులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ పరీక్షకు హాజరై సెలక్ట్ కాలేదన్న ఆక్రోశంతో మెసేజ్ చేసినట్లే నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
సరిలేరు మాకెవ్వరు
వించిపేట(విజయవాడ పశ్చిమ): పురుషులకు దీటుగా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ సరిలేరు మాకెవ్వరు అంటూ నిరూపిస్తున్నారు విజయవాడ రైల్వే డివిజన్లోని మహిళా ఉద్యోగులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్లో ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విజయవాడ డివిజన్లో తొలిసారిగా పూర్తిగా మహిళా ఉద్యోగులతోనే ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ (17406) రైలును నడిపారు. శుక్రవారం విజయవాడలో సిబ్బంది విధులు మారారు. లోకో పైలట్, గార్డు, టీటీఈ, స్క్వాడ్, ఆర్పీఎఫ్ సిబ్బంది, పాయింట్ ఉమెన్, స్టేషన్ మాస్టర్ తదితర విభాగాల్లో పూర్తిగా మహిళా ఉద్యోగులే విధులు నిర్వర్తించారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో లోకో పైలెట్ కె.శాంతి ఈ రైలులో విధుల్లో పాల్గొన్న లోకో పైలెట్ కె.శాంతి, గార్డు ఎల్.రాధ, ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుళ్లు పి.శ్యామల, ఎస్.శివకుమారి, ధనకుమారి, సీటీఐలు కె.కృష్ణవేణి, ఉమామహేశ్వరి, అరుణకుమారి, నాగలక్ష్మి, చందురాధిక, కె.ఎల్. ప్రసన్న తదితరులను డీఆర్ఎం పి.శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. విజయవాడ డివిజన్లో తొలిసారిగా ఈ అరుదైన ఘనత సాధించడం తమకు గర్వకారణమని ఆయన అన్నారు. మహిళా ఉద్యోగులు పురుషులతో సమానంగా విధుల్లో ప్రతిభ చాటుతున్నారని ప్రశంసించారు. విజయవాడ రైల్వే పీఆర్ఓ నస్రత్ ఎం మండ్రూప్కర్, ఎస్ఎం సునైనా, పాయింట్స్ ఉమెన్ నజ్మా విజయవాడలో జెండా ఊపి, కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. గార్డుగా విధుల్లో రాధ -
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
బిట్రగుంట : నెల్లూరు జిల్లాలో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. బిట్రగుంట రైల్వే స్టేషన్లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు బ్రిటగుంట స్టేషన్లో ఆగి ఉండగా బోగీ నుంచి పొగలు వచ్చాయి. గమనించిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు పొగలు వస్తున్న బోగిని పరిశీలించారు. సాంకేతిక కారణాల వల్లే పొగలు వచ్చాయని నిర్ధారించారు. సమస్యను పరిష్కరించిన తర్వాత రైలు యధావిధిగా బయలుదేరింది. -
మిర్యాలగూడలో నిలిచిపోయిన కృష్ణా ఎక్స్‌ప్రెస్
నల్గొండ : గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం రైల్వే అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్నటి వరకు హైదరాబాద్‌ను వణికించిన వర్షాలు ఇప్పుడు గుంటూరు జిల్లాపై పడ్డాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నరసరావుపేట శివార్లలో రెండు బస్సులు వాగులో చిక్కుకుపోయాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమను రక్షించాలంటూ బస్సులోంచి కేకలు పెట్టారు. దాంతో స్థానికులు జాగ్రత్తగా ప్రయాణికులందరినీ ఒడ్డుకు చేర్చారు. అయితే వారి సామాన్లు అన్నీ బస్సులోనే ఉండిపోయాయి. బస్సు కూడా వాగునీటిలో ఒరిగిపోయింది. మరోవైపు రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో రైల్వే ట్రాక్ మీదకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో పలు రైళ్లను రైల్వే అధికారులు ఎక్కడికక్కడే నిలిపి వేశారు. మాచర్ల ప్యాసింజర్ పిడుగురాళ్లలోను, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రెడ్డిగూడెంలోను, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ బెల్లంకొండలోను ఆగిపోయాయి. -
రైలు కిందపడి గిరిజన మహిళ మృతి
రైలు కింద పడి ఓ గిరిజన వివాహిత మృతిచెందింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని జంగిలిగొండ పంచాయతి పరిధిలోని రోటిబండ తండాకు చెందిన బోక్యా విజయ(35) కుటుంబ సభ్యులు తిరుమలకు వెళ్తున్నారు. ఈక్రమంలో విజయ కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి ప్రయత్నిస్తూ.. ప్రమాదవశాత్తు కాలు జారి పట్టాల మధ్యలో పడి అక్కడికక్కడే మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం
బాపట్ల స్టేషన్లో దిగిపోయిన ప్రయాణికులు బాపట్ల: తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందనే వదంతి గురువారం కలకలం సృష్టించింది. రైలు చీరాల స్టేషన్ దాటాక డి-5 బోగీలో నుంచి పొగలు రావడాన్ని గమనించిన కొందరు ప్రయాణికులు రైలులో బాంబు ఉందని భయపడ్డారు. ఆ విషయం కాస్తా రైలంతా వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు బాపట్ల స్టేషన్‌కు చేరుకోగానే రైలులోని సుమారు 2 వేల మంది ప్రయాణికులు ఒక్కసారిగా ప్లాట్‌ఫామ్‌పైకి దూకడం మొదలెట్టారు. దీన్ని గమనించిన రైల్వే అధికారులు వారిని ప్రశ్నించగా.. రైలులో బాంబు ఉందని జవాబిచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు డి-5 బోగీని పరిశీలించారు. బ్రేక్ స్లిప్ అయ్యి పొగలు వస్తున్నాయని, ప్రమాదమేమీ లేదని ప్రయాణికులకు నచ్చజెప్పేందుకు అధికారులు ప్రయత్నించారు. అయినా ప్రయాణికులందరూ రైలు ఎక్కేందుకు నిరాకరించడంతో గూడూరు నుంచి విజయవాడ వెళ్తున్న ప్యాసింజర్‌లో కొంతమందిని, అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో మరికొంతమందిని ఎక్కించి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
బాపట్ల: కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గుంటూరు జిల్లాలోని బాపట్ల స్టేషన్ లో రైలును నిలిపివేశారు. తిరుపతి నుంచి ఆదిలాబాద్ కు బయలుదేరిన కృష్ణా ఎక్స్ ప్రెస్ డీ-5 బోగి బ్రేకులు ఫెయిల్ కావడంతో బాపట్ల వద్ద మంటలు అలుముకున్నాయి. దీంతో బోగీలో నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించిన సిబ్బంది వెంటనే రైలు నిలిపివేశారు. హుటాహూటిన బోగీని చేరుకున్న రైల్వే సాంకేతిక శాఖకు చెందిన అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు. బ్రేకులను పునరుద్దరణ అనంతరం రైలు బయలుదేరుతుందని స్టేషన్ మాస్టర్ తెలిపారు. -
నిలిచిన కృష్ణా ఎక్స్‌ప్రెస్
మట్టెవాడ: అదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ సాంకేతిక లోపంతో వరంగల్ రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. స్టేషన్‌కు సమీపంలోకి రాగానే ఇంజన్ ఫెయిల్ కావడంతో.. డ్రైవర్ స్టేషన్లో ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ప్రస్తుతం కాజిపేట నుంచి ప్రత్యేక ఇంజన్ తెప్పించి ఎక్స్‌ప్రెస్‌కు జతచేసే ప్రయత్నంలో రైల్వే అధికారులు ఉన్నారు. -
రెలైక్కబోతూ జారిపడి ఒకరి దుర్మరణం
అత్త దశదిశన కర్మకు హాజరై వెళుతుండగా ప్రమాదం ప్రసాద్‌కు భార్య,ఇద్దరు కుమారులు మహబూబాబాద్ రూరల్ : అత్త దశదినకర్మలకు హాజరైన ఓ యువకుడు తిరుగుప్రయాణంలో రైలు ఎక్కబోయి జారిపడి దుర్మరణం పాలైన సంఘటన మానుకోట రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, జీఆర్పీ డోర్నకల్ ఎస్సై పెండ్యాల దేవేందర్ కథనం ప్రకారం... హన్మకొండ కలెక్టరేట్ సమీపంలో నివాసముండే ఏలియా కుమారుడు ల్యాదెళ్ల ప్రసాద్(27) మానుకోటలో చిన్ననీటిపారుదల శాఖలో పనిచేస్తున్నాడు. తన అత్త నెల్లి ఎల్లబాయి కర్మలకు హాజరయ్యేందుకు శుక్రవారం కుటుంబ సభ్యులతో మానుకోటకు వచ్చాడు. కార్యక్రమాలు ముగించుకుని తిరిగి వరంగల్ వెళ్లేందుకు మానుకోట రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ రాగానే బంధువులు, కుటుంబ సభ్యులను ఎక్కించాడు. ఇంతలోనే రైలు కదలడంతో రన్నింగ్‌లోనే ఎక్కేందుకు ప్రయత్నించగా కాలు జారి రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో పడ్డాడు. రైలు అలాగే ముందుకు కదలడంతో ప్రసాద్ కాళ్లు, ఎడమ చేయి విరిగిపోయాయి. తలకు బలమైన గాయమైంది. గుర్తించిన జీఆర్పీ పోలీసులు, ప్రయాణికులు రైలును నిలిపివేసి ప్రసాద్‌ను ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో ప్రసాద్ మృతిచెందాడు.మృతుడికి భార్య రేణుక, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏడాది వయసున్న చిన్నకుమారుడితో వచ్చిన ప్రసాద్ భార్య విలపించిన తీరు అక్కడివారిని కలచివేసింది. బంధువుల రోదనలతో ఆస్పత్రి దద్దరల్లింది. -
రైళ్లకు బ్రేకులు... ప్రయాణికుల పాట్లు
నల్లగొండ జిల్లా: ఖాజీపేట-సికింద్రాబాద్ రైల్వే మార్గంలో బీబీనగర్-ఘట్కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య సోమవారం ఓ గూడ్స్ రైలు సాంకేతిక లోపంతో మార్గం మధ్యలో నిలిచిపోవడంతో... పలు ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఫలితంగా ఆయా రైళ్లలోని ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఆలేరులో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను సుమారు గంట 25 నిమిషాల పాటు నిలిపివేశారు. అలాగే వంగపల్లిలో ఫలక్ నుమా, పెంబర్తి రైల్వేస్టేషన్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. వీటితో పాటు ఇంకా పలు చోట్ల రైళ్లను ఆపివేయాల్సి వచ్చింది. కొందరు ప్రయాణికులు రైలు దిగి బస్సులను, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. (ఆలేరు) -
కృష్ణా ఎక్స్‌ప్రెస్ లో షార్ట్‌సర్క్యూట్
ప్రకాశం : ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. తిరుపతి వైపు వెళ్తూ ఇంజిన్ బ్రేక్ వైర్లు షార్ట్‌సర్క్యూట్‌తో కాలిపోవటంతో టంగుటూరు పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో రైలును నిలిపివేశారు. మరో ఇంజిన్‌తో రైలును ముందుకు నడిపేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. (టంగుటూరు) -
రైళ్లలో నేరాలపై ప్రత్యేక దృష్టి
ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: వేసవిలో రైళ్లలో నేరాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు రైల్వే ఎస్పీ సిహెచ్.చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రైల్వే ఎస్పీగా విధులు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారిగా గురువారం ఖమ్మం రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ముందుగా, రెండోనంబర్ ప్లాట్‌ఫామ్ పరిశీలించారు. అనంతరం, జీఆర్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. గత ఏడాది వేసవిలో జరిగిన నేరాలను దృష్టిలో ఉంచుకుని రైళ్లలో రక్షణ సిబ్బందిని అదనంగా నియమిస్తామన్నారు. గతంలో నేరాలు జరిగిన పాపటపల్లి, మోటమర్రి వద్ద ఆర్పీఎఫ్, జీఆర్ పోలీసులతో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. మాహబూబాబాద్ నుంచి విజయవాడకు కృష్ణా ఎక్స్‌ప్రెస్ సాధారణ బోగీల్లో బెల్లం, సారా, గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్టుగా సమాచారం ఉందన్నారు. దీనిని అరికట్టేందుకు ప్రత్యేకంగా అదనపు సిబ్బందిని కూడా నియమిస్తున్నామన్నారు. ప్రత్యేక అలవెన్స్ ఉండదు.. ‘జిల్లాలోని పోలీసులందరికీ 15 శాతం అల వెన్స్ ఇస్తామని ఎస్పీ చెప్పారు. ఇది, జీఆర్ పోలీసులకు వర్తిస్తుందా..?’ అని, కొందరు విలేకరులు ప్రశ్నించారు. ఇది తమకు వర్తించదని రైల్వే ఎస్పీ సమాధానమిచ్చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలీసులకు ప్రత్యేక అలవెన్సును కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని, పట్టణాలు.. నగరాలలోని సిబ్బందికి ఇవ్వడం లేదని అన్నారు. ‘ఒకవేళ జిల్లాలో ఇచ్చినప్పటికీ.. కొంతకాలం తరువాత ప్రభుత్వం సదరు సిబ్బంది వేతనం నుంచి రికవరీ చేస్తుంది. గతంలో వరంగల్, కరీంనగర్ జిల్లాలోని పోలీసులకు అక్కడి ఎస్పీలు 15 శాతం అలవెన్స్ ఇచ్చారు. ఆ తరువాత, వాటిని సదరు సిబ్బంది వేతనం నుంచి ప్రభుత్వం రికవరీ చేసింది’ అని చెప్పారు. ఇటీవల విశాఖపట్నం లో జరిగిన 47వ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్ జూడో పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచిన టి.ఇందిరను రైల్వే ఎస్పీ అభినందించారు. సమావేశంలో రైల్వే డీఎస్పీ ఎస్.శ్రీనివాసరావు, సీఐ బి.రాజ్‌గోపాల్, ఎస్ఐ రవిరాజు, హెడ్ కానిస్టేబుల్ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక లోపంతో నిలిచిన కృష్ణా ఎక్స్‌ప్రెస్
మానుకోట రైల్వేస్టేషన్లో మొరాయించిన ఇంజిన్ మరో ఇంజిన్ జోడించిన సిబ్బంది మహబూబాబాద్, న్యూస్‌లైన్ : ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు మానుకోట రైల్వేస్టేషన్లో ఆదివారం ఉదయం గంట పదిహేను నిమిషాలపాటు నిలిచిపోయింది. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ మానుకోట రైల్వేస్టేషన్‌కు డౌన్‌లైన్‌లో 10.16 నిమిషాలకు చేరుకుంది. తర్వాత డ్రైవర్ స్టార్ట్ చేయబోగా ఇంజన్ మెరాయించింది. దీంతో సిబ్బంది అప్రమత్తమై డోర్నకల్ రైల్వేస్టేషన్ నుంచి మరో ఇంజన్‌ను మానుకోట రైల్వేస్టేషన్‌కు తెప్పించారు. ఆ ఇంజన్‌ను కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు జోడించి ఇంటర్సిటీ రైలును పంపిన తర్వాత కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలును పంపించారు. సాంకేతిక లోపంతో రైలు గంటకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వేస్టేషన్లో క్యాంటీన్ కూడా లేకపోవడంతో తినుబండారాల కోసం స్టేషన్ పరిసర ప్రాంతంలో దుకాణాలకు వెళ్లి వాటర్ బాటిళ్లు, ఇతరాత్ర తినుబండారాలు కొనుగోలు చేశారు. -
సాంకేతికలోపంతో నిలిచిన 'కృష్ణా ఎక్స్‌ప్రెస్'
ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్లో ఆదివారం సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో వరంగల్ జిల్లా మహబూబాద్ స్టేషన్లో దాదాపు గంటకు పైగా నిలిచిపోయింది. రైల్వే అధికారులు సాంకేతిక లోపాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
కృష్ణా ఎక్స్‌ప్రెస్ బోగీలో పొగలు
కేసముద్రం, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ వరంగల్ జిల్లా ఇంటికన్నె రైల్వేస్టేషన్ దాటాక మధ్య బోగీ కింద నుంచి పొగలు లోపలికి వస్తుండడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో రైలును కేసముద్రం రైల్వేస్టేషన్లో అధికారులు నిలిపివేశారు. బ్రేక్‌లైనర్లు పట్టేయడం వల్లే పొగలు వ్యాపించినట్లు తెలిపారు. ఉదయం 9.25 గంటలకు వచ్చిన రైలు 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. రైల్వేసిబ్బంది మరమ్మతులు చేసి రైలును పంపించారు. -
‘కృష్ణా’ ఘటనపై విచారణ
కాజీపేటరూరల్/సంగెం/మట్టెవాడ,న్యూస్‌లైన్ : చింతలపల్లి రైల్వే స్టేషన్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ ను యూటీవీ టీటీ మిషన్(యుటిలిటీ ట్రాక్ వెహికిల్ ట్రాక్ ట్యాంపరింగ్ మిషన్) ఢీకొన్న సంఘటనపై సికింద్రాబాద్ రైల్వే ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం ప్రాథమిక విచారణ చేపట్టారు. రైల్వే మేనేజర్ పర్యవేక్షణలో విచారణ జరుగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదంలో దెబ్బతిన్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌ను లోకో ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో కాజీపేట జంక్షన్‌కు తీసుకొచ్చారు. అనంతరం స్టేషన్ మేనేజర్ ఓదెలు, చీఫ్ క్రూ కంట్రోలర్ సీవీ.రమణ, సీడబ్ల్యూఎస్ సాంబశివరావు, ఆర్పీఎఫ్ సీఐ నర్సింహ సమక్షంలో మెకానిక్ సిబ్బంది ఇంజిన్‌ను తొలగించారు. దెబ్బతిన్న ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ లోకోషెడ్‌కు మరమ్మతు కోసం పంపించారు. దీంతో కాజీపేటలో 20 నిమిషాలపాటు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశా రు. అనంతరం మరో ఇంజిన్‌ను అమర్చి రైలు ను ఆదిలాబాద్‌కు పంపించారు. మ్యానువల్ బ్రేక్ సిస్టం వల్లే ప్రమాదం మ్యానువల్ బ్రేక్ సిస్టం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ మెయిన్ డౌన్ లైన్లో సిగ్నల్ కోసం చింతలపల్లి రైల్వేస్టేషన్లో ఆగింది. అదే సమయంలో అప్ లైన్లో రైలు పట్టాలను తీసుకెళ్తు న్న యూటీవీ టీటీ మిషన్ రైలు సిగ్నల్ పాయిం ట్ వద్దకు వచ్చి షెడ్ సిగ్నల్ కోసం వేచి ఉంది. అయితే సిగ్నల్ ఇచ్చే క్రమంలో టీటీ మిషన్ బ్రేకులు కంట్రోల్ కాక ఫెయిల్యూర్ అయి సిగ్న ల్ దాటి కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌ను ఢీకొట్టింద ని రైల్వే ఇంజినీరింగ్ అధికారులు చెప్పారు. టీటీ మిషన్‌కు ఎయిర్ బ్రేక్ సిస్టం ఉంటే సిగ్నల్ దాటి ముందుకు పోయేది కాదని, కేవలం మ్యానువల్ బ్రేక్ ఉండటం వల్లే ఇలా జరిగింద ని వారు తెలిపారు. ఈ ఘటనలో టీటీ మిష న్ ఆపరేటర్ ఎస్కే.ఖాద్రి, చంద్రయ్య, సారయ్యతోపాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాల య్యా యి. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వరంగల్ జీఆర్పీ సీఐ రవికుమార్ జరిగిన సంఘటనపై రైలు డ్రైవర్ ఏకే.స్వరూప్‌తోపాటు ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. చింతలపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లి అక్కడ వివరాలు సేకరించారు. చిన్న ప్రమాదం కాబట్టి బతికిపోయాం.. : ప్రయాణికులు రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంగా సిగ్నల్ ఇచ్చి ట్రాక్ చేంజ్ చేయకపోవడం వల్లనే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను స్క్రాప్ ఇంజిన్ ఢీకొట్టిందని, ఇది చిన్న ప్రమా దం కాబట్టి బతికిపోయూమని పలువురు ప్ర యాణికులు భయంతో వణికిపోతూ వివరిం చారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండక పోవడం తోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయ ని, ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యతీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలును ఎలాంటి సౌకర్యాలు లేని చింతలపల్లిలో సుమారు 50 నిమిషాల పాటు నిలిపివేయడంతో ప్రయూణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రమాదం జరగడంతో బెంబేలెత్తి న పలువురు రైలు దిగి బస్సులు, ఆటోల ద్వారా వరంగల్ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి పోయారు. మిగిలిన వారు మంచినీరు, ఆహా రం దొరకక తల్లడిల్లిపోయారు. సంఘటన గురించి బంధువులకు సెల్పోన్ల ద్వారా క్షేమసమాచారం అందించారు. ఒక్కసారిగా కిందపడిపోయా.. నెక్కొండ నుంచి వరంగల్‌కు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తున్నాను. చింతలపల్లి వద్ద రైలు ఆగింది. హఠాత్తుగా కొద్ది శబ్ధంతో రైలును టీటీ మిషన్ తాకడంతో కిందపడి పోయాను. నా నుదురుకు దెబ్బతాకింది. ఇంకా బెర్తులపై పడుకున్నవారు, నిలబడ్డవారు కిందపడిపోయారు. పెద్దగా ఎవరికీ దెబ్బలు తాకలేదు. -సోంద్మియా, నెక్కొండ, ప్రయాణికుడు -
ప్యాసెంజర్ రైలును ఢీకొన్న కృష్ణా ఎక్స్‌ప్రెస్
-
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరగలేదు
వరంగల్: జిల్లాలోని సంగెం మండలం చింతలపల్లి రైల్వేస్టేషన్ వద్ద రైలు ప్రమాదం జరిగిందని వచ్చిన వార్తలపై రైల్వే డీఎస్పీ సురేష్ కుమార్ స్పందించారు. ఆగిఉన్న ట్రాక్ మరమ్మతు మిషన్‌ను కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో పెద్దగా నష్టం ఏమీ జరగలేదని ఆయన చెప్పారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగిందనేది కేవలం వదంతులు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్ గంట క్రితమే వెళ్లిపోయిందని సురేష్ కుమార్ తెలిపారు. మరమ్మతులు చేస్తున్న ట్రాక్ మిషన్ కృష్ణా ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టింది. దీంతో రైలు అక్కడ కొద్దిసేపు ఆగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, చింతలపల్లి రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడినట్లు వదంతులు వ్యాపించాయి. -
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
-
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
ఆలేరు : ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న కృష్ణ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా ఆలేరు వద్ద ఇంజన్ నుంచి రెండు బోగీలు విడిపోయి.... రైల్వే బ్రిడ్జిపై నిలిచిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనలకు గురి అయ్యారు. కప్లింగ్ ఊడిపోవటం వల్లే ఈ సంఘటన జరిగినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. కాగా ఆలేరు రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరిన కొద్ది నిమిషాల్లోనే ఈ సంఘటన జరగటంతో పెను ప్రమాదం తప్పింది. రైలు నెమ్మదిగా వెళ్లుతుండటంతో బోగీలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు విషయాన్ని గుర్తించి రైలును వెనక్కి రప్పించారు. విడిపోయిన బోగీలను ఇంజన్‌కు కలిపేందుకు రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ సంఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. -
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం
స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు ఉందనే సమాచారంతో స్థానిక రైల్వేస్టేషన్లో శనివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉదయం 8 గంటలకు స్టేషన్‌ఘన్‌పూర్‌కు రావాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ దాదాపు గంట నలభై అయిదు నిమిషాల ఆలస్యంగా 9.45కు ఘన్‌పూర్‌కు చేరుకుంది. ఆగేం దుకు వేగం తగ్గిస్తున్న క్రమంలో రైలులో బాంబు ఉందని రైలు చివర గార్డు బోగీ పక్కన బోగీల్లోని ప్రయాణికులు పెద్దఎత్తున కేకలు వేస్తూ రైలు నుంచి దూకారు. గమనించిన ఇతర బోగీల్లోని ప్రయాణికులు బాంబు భయంతో తమకు చెందిన సామాన్లను రైలులోనే వదిలేసి ఒకరినొకరు తోసుకుంటూ రెండువైపులా దూ కారు. ప్లాట్‌ఫాం కిక్కిరిసిపోగా పలువురు ప్రయాణికులు బయటకు వెళ్లేమార్గం లేక స్టేషన్ ప్రహరీ ఎక్కి దూకారు. ముళ్ల చెట్లు ఉన్నా లెక్కచేయకుండా బాంబు ఉందనే భయంతో చంటిపిల్లలు ఉన్న తల్లులు కూడా పిల్లలతో సహా గోడలు దూకారు. వృద్దులు, పిల్లలు, మహిళలు, చంటిపిల్లల తల్లులు తలోవైపున ఉరుకులు, పరుగులు పెడుతుండగా భయానక వాతావారణం నెలకొంది. డాగ్, బాంబు స్క్వాడ్ల తనిఖీలు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం సమాచారం తెలుసుకున్న స్థానిక సీఐ వెంకటేశ్వరరెడ్డి, ఎస్సై శ్రీనివాస్ హుటాహుటిన సిబ్బందితో స్టేషన్‌కు చేరుకున్నారు. కాజీపేట జీఆర్పీ సీఐ రాజగోపాల్, ఎస్సై కరీముల్లా, ఆర్పీఎఫ్ ఎస్సై నర్సింహ, బాంబుస్క్వాడ్, డాగ్‌స్క్వాడ్ సిబ్బంది, ఘన్పూర్ తహసీల్దార్ హరికృష్ణ, ఆర్ఐ శ్రీనివాస్ స్టేషన్‌కు చేరుకుని రైలు బోగీలను తనిఖీలు చేశారు. దాదాపు గంటన్నర పాటు తనిఖీలు చేపట్టారు. కలకలం రేపిన టిఫిన్... రైలులోని ఒక బోగీలో టిఫిన్ బాక్సు బాంబు స్క్వాడ్‌కు దొరకగా, అది ఎవరిదని పోలీసులు విచారించగా టిఫిన్‌కు సంబంధించిన వారు ఎవ్వరూ లేకపోవడంతో దాదాపు 20 నిమిషాలు అందులో బాంబు ఉందని కలకలం రేగింది. ప్రయాణికులను కాస్త దూరంగా జరిపి ప్లాట్‌ఫారంపై దాన్ని ఉంచి బాంబ్‌స్క్వాడ్ పరిశీలించారు. బాంబు కాదని గుర్తించిన వారు టిఫిన్ తెరిచి చూడగా అన్నం, కూరలు ఉండడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తిస్థాయిలో రైలును తనిఖీ చేసిన పోలీసులు ఎట్టకేలకు 11.15కు కాజీపేట వైపు పంపించారు. అయితే దాదాపు గంటన్నరపాటు బాంబుకలకలంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురికాగా, రైల్వేస్టేషన్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాంబు బూచీ ఘటనపై కేసు నమోదు కాజీపేట రూరల్ : కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు బెదిరింపు ఘటనపై కాజీపేట జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకతాయిలను పట్టుకోవడానికి పోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాంబు బెదిరింపు ఘటనపై కాజీపేట జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 182, 505, 507 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శనివారం రాత్రి కాజీపేట జీఆర్పీ సీఐ రాజ్‌గోపాల్ తెలిపారు. చాలా భయపడ్డాం బాంబు కలకలంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యాం. బాబుతో సహా మమ్మీ, డాడీతో సికింద్రాబాద్ నుంచి పొన్నూరుకు వెళుతున్నాం. మేం ఏసీ కోచ్‌లో ఉండటంతో రైలు ఆగేవరకు సమాచారం లేదు. పెద్దఎత్తున అరుపులు వినిపించడంతోపాటు రైలు గార్డు వచ్చి బాంబు సమాచారం చెప్పారు. బయటికి చూసేసరికి బాంబు బాంబు అంటూ పరుగెడుతున్న వారిని చూసి మేము కూడా బయటికి దూకాం. - రమ్య, ప్రయాణికురాలు ఆకతాయిల పనై ఉంటుంది బాంబు వదంతులు ఆకతాయిల పనై ఉంటుంది. ఇలాంటి వదంతులతో ప్రయాణికులను ఇబ్బందిపెట్టడంతోపాటు పోలీసుల సమయాన్ని వృధా చేయడం సరి కాదు. విచారణ చేపట్టి ఆకతాయిలపై చర్యలు తీసుకుంటాం. - వెంకటేశ్వరరెడ్డి, సీఐ, స్టేషన్‌ఘన్‌పూర్ -
కృష్ణా ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో బాంబు ఉందని సమాచారం