రైలు కింద పడి ఓ గిరిజన వివాహిత మృతిచెందింది.
రైలు కింద పడి ఓ గిరిజన వివాహిత మృతిచెందింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని జంగిలిగొండ పంచాయతి పరిధిలోని రోటిబండ తండాకు చెందిన బోక్యా విజయ(35) కుటుంబ సభ్యులు తిరుమలకు వెళ్తున్నారు. ఈక్రమంలో విజయ కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి ప్రయత్నిస్తూ.. ప్రమాదవశాత్తు కాలు జారి పట్టాల మధ్యలో పడి అక్కడికక్కడే మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.