కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరగలేదు | No Train accident to Krishna express at chinthapalli | Sakshi
Sakshi News home page

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరగలేదు

Published Wed, Dec 25 2013 5:21 PM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM

జిల్లాలోని చింతలపల్లి వద్ద కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ఆగిఉన్నప్యాసింజర్ రైలును ఢీకొట్టిన ఘటనలో 20మంది ప్రయాణికులు స్వల్ప గాయాలయినట్టు తెలుస్తోంది.

వరంగల్: జిల్లాలోని సంగెం మండలం చింతలపల్లి రైల్వేస్టేషన్ వద్ద రైలు ప్రమాదం జరిగిందని వచ్చిన వార్తలపై రైల్వే డీఎస్పీ సురేష్ కుమార్ స్పందించారు.  ఆగిఉన్న ట్రాక్ మరమ్మతు మిషన్ను కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టిన ఘటనలో పెద్దగా నష్టం ఏమీ జరగలేదని ఆయన చెప్పారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగిందనేది కేవలం వదంతులు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.  కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ గంట క్రితమే వెళ్లిపోయిందని సురేష్‌ కుమార్‌ తెలిపారు. మరమ్మతులు చేస్తున్న ట్రాక్ మిషన్ కృష్ణా ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టింది. దీంతో రైలు అక్కడ కొద్దిసేపు ఆగినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా,  చింతలపల్లి రైల్వేస్టేషన్ వద్ద జరిగిన  ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడినట్లు వదంతులు వ్యాపించాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement