మందుబాబులకు వైన్‌లాంటి బాటిల్ కనపడితే పండగే. ఎవ్వరైన ఫ్రీగా ఇచ్చినా వారి ఆనందానికి అంతుపొత్తు ఉండదు. అలా కాకుండా వైన్ ఓ నదిలా ఉప్పోంగి వరదాల విరుచుకుపడితే ఎలా ఉంటుంది. ఇళ్లన్నింటిని వైన్ వరద ముంచెత్తింది.ఈ హఠాత్పరిణమానికి ప్రజలంతా షాక్‌కి గురయ్యారు. అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఈ షాకింగ్ ఘటన పోర్చుగల్ పట్టణంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..పోర్చుగల్‌లోని సావో లోరెంకో డిబైరోలో ఆదివారం ఈ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఆ చిన్న పట్టణంలోని వీధులన్నీ వైన్‌తో నిండిపోయాయి. కొన్ని ఇళ్లు ఆ వైన్‌ప్రవాహానికి నేలమట్టమయ్యాయి. ఏంటి ప్రకృతి విపత్తు అన్నంతగా ఓ నది పొంగి వరదాల బీభత్సం సృష్టించినట్లు వైన్ వరదాల కొట్టుకొచ్చింది. ఈ రహస్యమైన వైన్ నది ఎక్కడది. ఇదెలా సాధ్యం అని సందేహాలు ప్రజల్లో తలెత్తాయి. ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాని గందరగోళానికి గురయ్యారు ప్రజలు.
ఒలింపిక్‌లో ఉండే స్మిమ్మింగ్ పూల్‌ని నింపేంత వైన్ కొట్టుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ రహస్యమైన వైన నది టౌన్ డిస్టిలరీ నుంచి ఉద్భవించిందని పేర్కొన్నారు. ఇక్కడ రెండు మిలియన్ లీటర్లకు పైగా రెడ్ వైన్ బారెల్స్‌ను మోసుకెళ్‌లే ట్యాంకులు ఉన్నాయని, అవి అనుకోకుండా పగిలిపోవడంతో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు అధికారులు. ఈ షాకింగ్ ఘటన గురించి తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై అగ్నిమాపక విభాగాన్ని రంగంలోకి దింపారు.
అగ్నిమాపక సిబ్బంది వైన్‌నదిలా ఉగ్రరూపం దాల్చిన ఈ స్టెరిమా నది ప్రవాహాన్ని దారిమళ్లించి సమీపంలోని పోలాల్లోకి వెళ్లేలా చేశారు. అధికారులు ఈ అనుహ్య ఘటనకు ప్రజలకు క్షమాపణలు తెలిపారు. వైన్ నీటితో బురదమయంగా మారిన భూమిని డ్రైగా చేసి యథాస్థితికి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చింది. ఈ వైన్ వరద కారణంగా జరిగిన నష్టాన్ని, ఏర్పరిచిన బురదను క్లీన్ చేసి మరమత్తులు నిర్వహించడమే గాక ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తామని తెలిపింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
The citizens of Levira, Portugal were in for a shock when 2.2 million liters of red wine came roaring down their streets on Sunday. The liquid originated from the Levira Distillery, also located in the Anadia region, where it had been resting in wine tanks awaiting bottling. pic.twitter.com/lTUNUOPh9B
— Boyz Bot (@Boyzbot1) September 12, 2023
(చదవండి: సాఫ్ట్‌వేర్ చిన్నారి! ఏకంగా వీడియో గేమ్‌లనే రూపొందిస్తోంది!)
Comments
Please login to add a commentAdd a comment