ఈ వార్త చదివిన మందుబాబులు.. తాము ఆ సమయంలో అక్కడ ఎందుకు లేమా అన్న ఫీలింగ్‌తో తెగ బాధపడిపోతారు. ఎందుకంటే డ్యామ్ నుంచి నీళ్లను ఎత్తితే ఎంత వేగంగా పరిగెడుతాయో అచ్చం అలాగే రెడ్‌వైన్ నిల్వ ఉంచిన ట్యాంక్ పగిలిపోవడంతో రెడ్‌వైన్ వరదలా పారింది. ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. రెడ్‌వైన్ ఏరులై పారుతుంటే అక్కడ ఉన్న ఉద్యోగులు చూస్తూ నిలబడ్డారే తప్ప ఏం చేయలేకపోయారు. వరదలా పారుతున్న రెడ్‌వైన్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. (చదవండి : వైరల్: గున్న ఏనుగు చిలిపి స్నానం)
ఈ వీడియో చూసి మందుబాబులు గుండెలు బాదుకుంటున్నారు. 'దీనమ్మా జీవితం.. ఒక్క చుక్క వైన్ దొరికినా బాగుండు.. ఆ సమయంలో మేం అక్కడా ఉన్న బాగుండు.. ఒక్క చుక్క రెడ్‌వైన్‌ను వదలకుండా తాగేవాళ్లం.' అంటూ కామెంట్లు పెడుతున్నారు.దాదాపు 49 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రక్తం లాగా కనిపిస్తుండడం చూసి కొందరు భయపడిపోతున్నారు. కాగా 1969 నుంచి ఉన్న ఈ వైనరీలో 1,570 హెక్టార్లకు పైగా ద్రాక్షతోటలు ఉన్నాయి. ఈ వీడియోను రేడియో అల్బాసెట్ తన ట్విటర్‌లో పంచుకుంది. ఈ వీడియోను ఇప్పటికవరకు 8.4 మిలియన్ల మంది వీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment