red wine
-
అక్కడ ఫ్రీగా కావాల్సినంత రెడ్ వైన్ తాగేయొచ్చు..!
ఇటలీ దేశంలో డోరా సర్చెస్ అనే ద్రాక్షతోట యజమానులు ఫ్రీ రెడ్ వైన్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. ఈ ఫౌంటెన్ వద్ద రెడ్ వైన్ 365 రోజులు ఉచితంగా లభిస్తుంది. వాస్తవానికి ఇటలీ దేశంలో ఉచితంగా వైన్ అందించడం కొత్తకాదు. మారినో అనే పట్టణంలో ప్రతి ఏడాది గ్రేప్ ఫెస్టివల్ జరుగుతుంది. ఒక గంట పాటు ప్రజల కోసం పబ్లిక్ వాటర్ ఫౌంటెన్ ట్యాప్ లలో వైట్ వైన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ప్రతిరోజు రెడ్ వైన్ అందుబాటులో ఉండటం విశేషం. ఇటలీ దేశంలో ఉన్న ఈ రెడ్ వైన్ ఉచితంగా అందించే మొదటి ఫౌంటెన్ గా ఇది గుర్తింపు పొందింది.ఎందుకిలా అంటే..ఇటలీ దేశంలో విభిన్నమైన సేవలు అందించాలని ఇక్కడి ద్రాక్ష యజమానులు అప్పట్లో భావించారు. అందులో భాగంగానే ఫ్రీ వైన్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత రోమ్ నగరం నుంచి ఒర్టోనా వరకు 196 మైళ్ళ దూరం ఉంటుంది. ఇంత దూరం ప్రతి ఏడాది సాంస్కృతిక యాత్ర నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కొన్ని వేల మంది కేథలిక్ లు పాల్గొంటారు. ఈ దారి వెంట ప్రయాణం సాగించే వారి బడలిక తీర్చేందుకు ప్రసిద్ధ కామినో డి షాన్ టోమ్మాసో దగ్గర ఈ వైన్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు.ప్రయాణికులు ట్యాప్ తిప్పి తమకు కావలసిన పరిమాణంలో వైన్ తాగి ముందుకు వెళ్తారు. మరింత కావలసిన వాళ్లు పెద్ద పెద్ద బాటిల్స్ లో నింపుకొని వెళ్తూ ఉంటారు. వాస్తవానికి దాహం వేసినప్పుడు గుక్కెడు నీళ్లు దొరకడమే గగనమైన ఈ రోజుల్లో ఇటలీ దేశంలో ఏకంగా రెడ్ వైన్ అందించడం.. అది కూడా ఉచితంగా ఇవ్వడం గొప్ప విషయమే కదా.. అయితే ద్రాక్ష తోట యజమానులు తమ ఎస్టేట్‌లో పండే పండ్లను ఈ వైన్ తయారీ కోసం వినియోగిస్తారు. వేలాది ఎకరాల్లో తోటలు విస్తరించిన నేపథ్యంలో బాగా పక్వానికి వచ్చిన పండ్లతో వారు ఈ వైన్ తయారు చేస్తున్నారు. ఇందులో ఎటువంటి రసాయనాలు కలపకపోవడం విశేషం.(చదవండి: బిడ్డకు తల్లయినా ఎంతో ఫిట్‌గా ఆలియా.. సీక్రెట్ ఏంటంటే?) -
అక్కడ వరదలా.. వీధుల గుండా "వైన్ ప్రవాహం"..షాక్‌లో ప్రజలు
మందుబాబులకు వైన్‌లాంటి బాటిల్ కనపడితే పండగే. ఎవ్వరైన ఫ్రీగా ఇచ్చినా వారి ఆనందానికి అంతుపొత్తు ఉండదు. అలా కాకుండా వైన్ ఓ నదిలా ఉప్పోంగి వరదాల విరుచుకుపడితే ఎలా ఉంటుంది. ఇళ్లన్నింటిని వైన్ వరద ముంచెత్తింది.ఈ హఠాత్పరిణమానికి ప్రజలంతా షాక్‌కి గురయ్యారు. అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఈ షాకింగ్ ఘటన పోర్చుగల్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోర్చుగల్‌లోని సావో లోరెంకో డిబైరోలో ఆదివారం ఈ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఆ చిన్న పట్టణంలోని వీధులన్నీ వైన్‌తో నిండిపోయాయి. కొన్ని ఇళ్లు ఆ వైన్ప్రవాహానికి నేలమట్టమయ్యాయి. ఏంటి ప్రకృతి విపత్తు అన్నంతగా ఓ నది పొంగి వరదాల బీభత్సం సృష్టించినట్లు వైన్ వరదాల కొట్టుకొచ్చింది. ఈ రహస్యమైన వైన్ నది ఎక్కడది. ఇదెలా సాధ్యం అని సందేహాలు ప్రజల్లో తలెత్తాయి. ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాని గందరగోళానికి గురయ్యారు ప్రజలు. ఒలింపిక్‌లో ఉండే స్మిమ్మింగ్ పూల్‌ని నింపేంత వైన్ కొట్టుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ రహస్యమైన వైన నది టౌన్ డిస్టిలరీ నుంచి ఉద్భవించిందని పేర్కొన్నారు. ఇక్కడ రెండు మిలియన్ లీటర్లకు పైగా రెడ్ వైన్ బారెల్స్‌ను మోసుకెళ్లే ట్యాంకులు ఉన్నాయని, అవి అనుకోకుండా పగిలిపోవడంతో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు అధికారులు. ఈ షాకింగ్ ఘటన గురించి తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై అగ్నిమాపక విభాగాన్ని రంగంలోకి దింపారు. అగ్నిమాపక సిబ్బంది వైన్నదిలా ఉగ్రరూపం దాల్చిన ఈ స్టెరిమా నది ప్రవాహాన్ని దారిమళ్లించి సమీపంలోని పోలాల్లోకి వెళ్లేలా చేశారు. అధికారులు ఈ అనుహ్య ఘటనకు ప్రజలకు క్షమాపణలు తెలిపారు. వైన్ నీటితో బురదమయంగా మారిన భూమిని డ్రైగా చేసి యథాస్థితికి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చింది. ఈ వైన్ వరద కారణంగా జరిగిన నష్టాన్ని, ఏర్పరిచిన బురదను క్లీన్ చేసి మరమత్తులు నిర్వహించడమే గాక ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తామని తెలిపింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. The citizens of Levira, Portugal were in for a shock when 2.2 million liters of red wine came roaring down their streets on Sunday. The liquid originated from the Levira Distillery, also located in the Anadia region, where it had been resting in wine tanks awaiting bottling. pic.twitter.com/lTUNUOPh9B — Boyz Bot (@Boyzbot1) September 12, 2023 (చదవండి: సాఫ్ట్వేర్ చిన్నారి! ఏకంగా వీడియో గేమ్‌లనే రూపొందిస్తోంది!) -
వైన్ తాగుతున్నారా.. అయితే ఇది చదవండి
చాలా తక్కువ మోతాదులో రెడ్‌వైన్ గుండెకు మేలు చేస్తుందని కొందరి దురభిప్రాయం. కానీ పరిమిత మోతాదులో వైన్ తీసుకోవడం వల్ల గుండెజబ్బులు తగ్గుతాయనేది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు శాస్త్రవేత్తలు. కేవలం ఒక గ్లాసు వైన్ తీసుకున్నా అది గుండె జబ్బుల లయ (రిథమ్)ను దెబ్బతీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. మామూలు వ్యక్తులతో పోలిస్తే ఒక గ్లాసు వైన్ తీసుకునేవారిలో హార్ట్ రిథమ్ దెబ్బతినే ముప్పు ఎనిమిది శాతం ఎక్కువ. ఇక మామూలుగా తాగేవారితో పోలిస్తే ఎప్పుడో ఒకసారి తాగితే వచ్చే గుండె లయలో సమస్య వచ్చే అవకాశాలు మరీ ఎక్కువ. ఎప్పుడో ఒకసారి మద్యం తాగుతామని లేదా చాలా అరుదుగా తీసుకుంటామని చెబుతూ మద్యం తీసుకునే వారిలో గుండె లయకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలా ఎప్పుడో ఒకసారి తాగుతామని చెప్పే 65 ఏళ్లు పైబడిన ప్రతి 100 లోనూ ఏడుగురు గుండె లయకు సంబంధించిన సమస్యల బారిన పడుతుంటారనే ఆ అధ్యయన ఫలితాలను అమెరియన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి సంబంధించిన ఒక జర్నల్‌లో ప్రచురించారు. -
ఏరులై పారిన రెడ్‌వైన్..
-
ఏరులై పారిన రెడ్‌వైన్.. మందుబాబులు షాక్
ఈ వార్త చదివిన మందుబాబులు.. తాము ఆ సమయంలో అక్కడ ఎందుకు లేమా అన్న ఫీలింగ్‌తో తెగ బాధపడిపోతారు. ఎందుకంటే డ్యామ్ నుంచి నీళ్లను ఎత్తితే ఎంత వేగంగా పరిగెడుతాయో అచ్చం అలాగే రెడ్‌వైన్ నిల్వ ఉంచిన ట్యాంక్ పగిలిపోవడంతో రెడ్‌వైన్ వరదలా పారింది. ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. రెడ్‌వైన్ ఏరులై పారుతుంటే అక్కడ ఉన్న ఉద్యోగులు చూస్తూ నిలబడ్డారే తప్ప ఏం చేయలేకపోయారు. వరదలా పారుతున్న రెడ్‌వైన్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. (చదవండి : వైరల్: గున్న ఏనుగు చిలిపి స్నానం) ఈ వీడియో చూసి మందుబాబులు గుండెలు బాదుకుంటున్నారు. 'దీనమ్మా జీవితం.. ఒక్క చుక్క వైన్ దొరికినా బాగుండు.. ఆ సమయంలో మేం అక్కడా ఉన్న బాగుండు.. ఒక్క చుక్క రెడ్‌వైన్‌ను వదలకుండా తాగేవాళ్లం.' అంటూ కామెంట్లు పెడుతున్నారు.దాదాపు 49 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రక్తం లాగా కనిపిస్తుండడం చూసి కొందరు భయపడిపోతున్నారు. కాగా 1969 నుంచి ఉన్న ఈ వైనరీలో 1,570 హెక్టార్లకు పైగా ద్రాక్షతోటలు ఉన్నాయి. ఈ వీడియోను రేడియో అల్బాసెట్ తన ట్విటర్లో పంచుకుంది. ఈ వీడియోను ఇప్పటికవరకు 8.4 మిలియన్ల మంది వీక్షించారు. -
రెడ్ వైన్‌తో ఆ వ్యాధులకు చెక్
లండన్ : పరిమితంగా రెడ్ వైన్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని పలు పరిశోధనల్లో వెల్లడవగా తాజాగా రెడ్ వైన్‌లో ఉండే ఓ పదార్ధం కుంగుబాటు, యాంగ్జైటీల నుంచి ఉపశమనం కలిగిస్తుందని తేలింది. రెడ్ వైన్ తయారీలో ఉపయోగించే ద్రాక్షలో ఉండే పదార్ధం ఈ వ్యాధులను నిలువరిస్తుందని ఎలుకలపై చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. కుంగుబాటు, యాంగ్జైటీలను ప్రేరేపించే ఎంజైమ్‌ను రెడ్ వైన్‌లో ఉండే రిస్వరట్రాల్ అడ్డుకుందని పరీక్షల్లో వెలుగుచూసింది. ఈ పరిశోధనలో వెల్లడైన అంశాలు డిప్రెషన్, ఎంగ్జైటీలో నూతన చికిత్సలకు దారితీస్తాయని భావిస్తున్నారు. ఈ రెండు వ్యాధులపై రిస్వరట్రాల్ ప్రభావాన్ని యూనివర్సిటీ ఆఫ్ బఫెలో శాస్త్రవేత్తలు ఎలుకలపై పరీక్షించడం ద్వారా అంచనా వేశారు. క్యాన్సర్, అర్ధరైటిస్, డిమెన్షియా సహా పలు వ్యాధులను ప్రభావవంతంగా ఎదుర్కొనే సామర్ధ్యం రిస్వరట్రాల్‌కు ఉందని చాలా కాలంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వేరుశెనగ పప్పులోనూ ఉండే రిస్వరట్రాల్ శరీరంలో వాపు ప్రక్రియను తగ్గిస్తుందని పలు అథ్యయనాల్లో వెల్లడైంది. హాని చేసే కొవ్వులను నియంత్రించడం, మెదడు పనితీరును మెరుగుపరచడం, బీపీని నియంత్రించడంలోనూ ఇది మెరుగ్గా పనిచేస్తుందని పలు అథ్యయనాల్లో వెలుగుచూసింది. వైన్‌లో తక్కువ పరిమాణంలో ఉండే రిస్వరట్రాల్‌ను సప్లిమెంటరీలుగా అందిచడంపైనా పలు అథ్యనాలు జరుగుతున్నాయి. -
అవి తీసుకున్నా ఎక్కువకాలం బతకొచ్చు..
లండన్ : మితంగా మద్యం తీసుకుంటే మేలని ఇప్పటికే పలు అథ్యయనాలు వెల్లడించగా, బీరు, వైన్, చాక్లెట్లతో అకాల మరణం ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. మద్యంతో పాటు పండ్లు, కూరగాయలను పుష్కలంగా తీసుకుంటేనే వీటి ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉంటాయని వార్సా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. రెడ్ మీట్, శీతల పానీయాలు, ప్రాసెస్డ్ ఆహారం తీసుకునేవారితో పోలిస్తే పండ్లు, కూరగాయలతో పాటు వైన్, బీరు, చాక్లెట్లను పరిమితంగా తీసుకున్నవారిలో అకాల మరణాల ముప్పు 15 నుంచి 20 శాతం తక్కువగా ఉన్నట్టు తమ పరిశోధనలో తేలిందని అథ్యయన రచయిత ప్రొఫెసర్ జొన్నా కలూజా చెప్పారు. పండ్లు, కూరగాయలు, రెడ్ వైన్, బీర్, చాక్లెట్లలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులకు దారితీసే ఇన్ఫ్లమేషన్ (వాపు)ను నివారిస్తాయని ఫలితంగా అకాల మరణం ముప్పు తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు. 45 నుంచి 83 ఏళ్ల సంవత్సరాలున్న 68,273 మందిపై జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారం తీసుకున్న వారిలో అకాల మరణాలు వీటిని తక్కువ మోతాదులో తీసుకున్న వారితో పోలిస్తే 18 శాతం తక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. వీరిలో గుండె జబ్బుల మరణాల ముప్పు 20 శాతం, క్యాన్సర్ మరణాలు 13 శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. -
గ్రీన్ టీ, రెడ్వైన్లతో మేలేమిటో తెలిసింది!
గ్రీన్ టీ, రెడ్ వైన్లలో ఉండే ఒక ప్రత్యేకమైన రసాయన మూలకం శరీరంలో విషతుల్యమైన పదార్థాలు ఏర్పడకుండా అడ్డుకుంటాయని టెల్అవీవ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. పుట్టుకతోనే వచ్చే కొన్ని రకాల వ్యాధులను ఈ మూలకం ద్వారా అడ్డుకోవచ్చునని చెబుతున్నారు. జన్యులోపం ఫలితంగా కీలకమైన ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోయి, జీవక్రియలకు సంబంధించిన కొన్ని సమస్యలు పుట్టుకతోనే వస్తూంటాయని... గ్రీన్ టీ, రెడ్ వైన్లలో ఉండే ఎపిగాల్లో కాటెచిన్ గాలేట్, టానిక్ ఆసిడ్లు ఈ సమస్యను అధిగమించేందుకు ఉపయోగపడతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఎహుద్ గాజిట్ తెలిపారు. ఈ రెండు రసాయనాలను డీఎన్ఏ వంటి వాటితో కలిపి చూసినప్పుడు రెండూ అమైలాయిడ్ వంటి విషాలు తయారుకాకుండా అడ్డుకున్నట్టు గాజిట్ చెప్పారు. కంప్యూటర్ సిములేషన్లను ఉపయోగించినప్పుడు కూడా ఇవే రకమైన ఫలితాలు కనిపించాయని తెలిపారు. వేర్వేరు వ్యాధుల్లో జీవక్రియలను ప్రభావితం చేసే రసాయనాల ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు తమ పరిశోధన సాయపడుతుందని, వైద్యంలో ఇది కొత్త అధ్యాయానికి దారితీస్తుందని గాజిట్ వివరించారు. -
రెడ్ వైన్ తాగుతున్నారా.. ఐతే జాగ్రత్త
రెడ్ వైన్‌ను ఇష్టంగా తాగేవారు.. ఇకపై కాస్త జాగ్రత్తగా ఉండండి.. వీలైతే తాగడం పూర్తిగా మానేయండి.. ఇవి మేము చెప్తున్న మాటలు కాదండోయ్.. పరిశోధనలు చేసి వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలు. అధిక మోతాదులో రెడ్ వైన్ తీసుకోవడం వల్ల క్యాన్సర్, హృద్రోగంతో పాటు డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు వైద్యులు. ఈ మేరకు తన పరిశోధనల్లో పలు విషయాలు వెల్లడయ్యాయంటూ డాక్టర్ మార్క్ మెనోలాసినో ఇక ఆర్టికల్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా శుద్థిచేయని, చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ద్రాక్షరసం తాగటం వల్ల కాలేయం దెబ్బతింటుందని తెలిపారు. ఈ పరిణామాల వల్ల శరీరంలోని చెడు కొవ్వు శాతం పెరుగుతుందని కూడా పేర్కొన్నారు. చర్మవ్యాధులు కూడా.. రెడ్ వైన్ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో పాటు చర్మ సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల మొటిమలు వస్తాయని, చర్మం కళ కోల్పోతుందని డాక్టర్ ఇసాబెల్ షార్కర్ తెలిపారు. కళ్లకింద నల్లటి వలయాలు కూడా ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. మొటిమలు, చర్మంపై గల మృత కణాల వల్ల రంధ్రాలు ఏర్పడతాయి గనుక సాధ్యమైనంత వరకు రెడ్ వైన్‌ను తాగకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. మేము చెప్పాల్సింది చెప్పాం.. సో ఇకపై రెడ్ వైన్ తాగుతారో మానేస్తారో మీ ఇష్టం మరి. -
రెడ్ వైన్‌తో రోగ నిరోధక శక్తి
వాషింగ్టన్: మీకు రోజు టీ, రెడ్ వైన్ వంటి పానియాలను తాగే అలవాటు ఉందా? అయితే వ్యాధికారిక వైరస్లు మీ దరికి చేరే అవకాశం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ పానియాల్లో ఉండే ఓ మిశ్రమం మనుషుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెం చుతుందని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనిషి శరీరంలోని చిన్న పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు కేవలం ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. తీవ్రమైన వైరస్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఈ సూక్ష్మజీవులు ఫ్లావనాయిడ్స్గా పిలిచే కొన్ని మిశ్రమ సమ్మేళాలను విచ్ఛిన్నం చేసి ఈ ‘ఫ్లూ’ల బారి నుంచి కాపాడతాయన్నారు. ఫ్లావనాయిడ్స్ మనం తీసుకునే రోజువారి ఆహారంలో భాగమై ఉంటాయని, అలాగే టీ, రెడ్ వైన్, బ్లూబెర్రిస్లో ఇవి సమృద్ధిగా ఉంటాయన్నారు. -
ఈ మద్యం బాటిల్ రూ.26లక్షలు రాబట్టింది
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఓ ఆరవై ఏళ్ల కిందటి రెడ్ వైన్ మద్యం బాటిల్ భారీ మొత్తాన్ని రాబట్టింది. పెన్‌పోల్డ్స్ కంపెనీకి చెందిన 1951నాటి ఈ బాటిల్ ఆస్ట్రేలియాలో దాదాపు రూ.26,26,905(40,825 డాలర్ల)కు అమ్ముడుపోయింది. దీంతో ఆస్ట్రేలియాలోనే అత్యధిక మొత్తానికి అమ్ముడుపోయిన అలనాటి వైన్ బాటిల్‌గా నిలిచింది. 1844 నుంచి పెన్ఫోల్డ్స్ సంస్థ వైన్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. అయితే, 1951నాటి వైన్ బాటిల్స్‌ను దాచి పెట్టి ఉంచిన ఆ సంస్థ తాజాగా ఒక బాటిల్‌ను వేలానికి పెట్టింది. 1951నాటి పెన్ఫోల్డ్స్ బాటిల్స్ ఒక 20 వరకే ఉన్నాయని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన మద్యం బాటిల్‌గా దీనిని తాము భావిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఆస్ట్రేలియాలో అతి ప్రఖ్యాతిగాంచిన వైన్ కూడా ఇదే. -
ఈ మధ్యం బాటిల్ ఖరీదు తెలుసా?
మెల్బోర్న్: ఏ వస్తువు కొనాలనుకున్నా ముందు ఎక్స్పైర్ డేట్ చూస్తారు.. కానీ మందు బాబులు మాత్రం ఆ మందు బాటిల్ ఎంత పాతదైతే అంత మంచిదని లొట్టలేసుకుంటూ తీసుకెళ్తారు. దాని రెటు కూడా దాని దగ్గట్టే ఉంటుందిలే.. అయితే ఆస్ట్రేలియాలో1951లో తయారైన ఓ వైన్ బాటిల్ ధర ఎంత ఉంటుందనుకుంటున్నారు. దానికి ఓ మధ్యం ప్రియుడు వేలంలో ఏకంగా 52,000 డాలర్లు చెల్లించాడు. 1951లో తయారైన ప్రముఖ వింటేజ్ వైన్ బాటిల్‌ను పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ మద్యం ప్రియుడు వేలంలో 52,000 డాలర్లకు కొనుగోలు చేశాడు. ఈ మద్యాన్ని పెన్ఫోల్డ్స్ గ్రేంజ్ హెర్మిటేజ్ సంస్థ ఎండబ్ల్యు వైన్స్ ద్వారా బుధవారం రాత్రి వేలానికి పెట్టింది. అప్పట్లో ప్రముఖ వైన్ తయారీ సంస్థ మాక్స్ షబర్ట్ వింటేజ్, పెన్ఫోల్డ్స్ను తయారు చేసేది. ఈ రకం మద్యాన్ని బహిరంగ విక్రయానికి మాత్రం అందుబాటులో ఉంచలేదు. సంస్థ తయారు చేసిన 1,800 బాటిళ్లలో ఇప్పటికి 20 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి బాటిలే 2004లో జరిగిన వేలంలో 39,870 డాలర్లకు అమ్ముడుపోయింది. ఎండబ్ల్యు వైన్స్ ఎండీ నిక్ స్టాన్ఫోర్డు మాట్లాడుతూ మాక్స్ షబర్ట్ తయారు చేసిన ఈ వైన్‌ను 1993లో రుచి చూశారని, ఇప్పటికీ అది మంచి స్థితిలో, తాజా పండ్ల వాసనతో ఉన్నట్లు పెన్ఫోల్డ్స్ 2012లో నిర్ధారించారని వివరించారు. -
ఆ మహిళలకు రెడ్‌వైన్ భలే మందట
పోలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) తో బాధపడే మహిళలకు రెడ్ వైన్ దివ్య ఔషధంలా పనిచేస్తుందని తాజా అధ్యయనం తేల్చింది.రెడ్ వైన్, ద్రాక్ష లలో ఉండే ఒక సహజ సమ్మేళనం హార్మోన్ అసమతుల్యత తో ఇబ్బందులుపడే స్త్రీలకు సహాయపడుతుందని తేల్చారు..సాధారణంగా గింజల్లో (నట్స్) కనిపించే, వ్యాధులనుంచి గుండెను కాపాడే యాంటీ ఆక్సిడెంట్... రెస్వెట్రాల్ సప్లిమెంట్ ను రెడ్ వైన్ లో కనుగొన్నట్టు తెలిపారు. ఈ అధ్యయనాన్ని ఎండోక్రైన్ సొసైటీ జర్నల్ 'క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం' లో ప్రచురించింది. వైద్యశాస్త్రం ప్రకారం పురుషుల్లో ఎక్కువగా, మహిళల్లో తక్కువగాను ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిఎక్కువ మోతాదులో మహిళల్లో ఉత్పత్తికావడం మూలంగా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వంధ్యత్వం, బరువు పెరగడం. మొటిమలు, అన్ వాంటెడ్ హెయిర్ గ్రోత్, లాంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు ఈ పునరుత్పత్తి హార్మోను టెస్టోస్టెరాన్ మహిళల్లో మధుమేహ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కాలిఫోర్నియా, శాన్ డియాగో, విశ్వవిద్యాలయ పరిశోధకులు రెడ్ వైన్ లోని (వేరుశెనగ, బ్లాక్ బెర్రీస్ , చాక్లెట్లలో లభించే) రెస్వెట్రాల్ అనే పాలీఫినాల్ తో 30 మంది మహిళలపై మూడు నెలలపాటు పరిశోధించారు. ఈ క్రమంలో వారిలోని హార్మోన్ స్థాయిలు సరి చేయగలిగినట్టు చెప్పారు. దాదాపు 23.1 శాతం టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గినట్టు గుర్తించారు. రెస్వెట్రాల్.. ఇన్సులిన్ నియంత్రణకు , మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందనీ, శరీరం యొక్క సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుందని తమ పరిశోధనలో తేలిందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఎండీ, సీనియర్ రచయిత, అంటోని జె డ్యూలెబా ఎండీ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పీసీఎస్ తో భాధపడుతున్న స్త్రీలలో మెటబాలిజ సమస్యలను తగ్గించేందుకు సహాయం చేస్తుందన్నారు. -
సారమింతేనయా!
సమ్‌థింగ్ స్పెషల్ ఉన్నట్టుండి ఒక పెద్దాయన దారిన పోయే దానయ్యపై రెడ్‌వైన్ చిలకరించవచ్చు. ఒక చిన్నది చిన్నోడిని వైన్ వానలో తడపవచ్చు. పరిచితులే కాదు...అపరిచితులు కూడా ఒకరి మీద మరొకరు హోలి రోజు రంగులు మీద పోసుకున్నట్లుగా మద్యం పోసుకోవచ్చు. మామూలు రోజుల్లో అయితే పిచ్చ కోపం వస్తుందిగానీ, ఆరోజు మాత్రం ఎంత మంది మద్యం చల్లినా ఎవరి మీద ఎవరికీ కోపం రాదు. స్పెయిన్‌లో జరిగే సెయింట్ పీటర్ డేకు ఉన్న ప్రత్యేకత ఇది. ఈ పండగరోజు ఒకరిమీద ఒకరు మద్యం చల్లుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. కొందరు వాటర్ పిస్టోల్‌లో వైన్ నింపుకొని ఒకరితో ఒకరు సరదా సరదాగా యుద్ధం చేసుకుంటారు. ఈ వ్యవహారాన్ని ‘వైన్ ఫైట్’ అని పిలుస్తారు. వైన్ ఒకరి మీద ఒకరు చల్లుకుంటున్నప్పుడు కొన్ని ప్రాంతాలలోనైతే... వినసొంపైన సంగీతం వినిపిస్తుంటారు. మధ్య యుగాల కాలంలో ఒక ఆస్తి సమస్య పరిష్కారమైన నేపథ్యాన్ని పురస్కరించుకొని సరదాగా ఒకరి మీద ఒకరు మద్యం చల్లుకున్నారట. అదే కాలక్రమంలో ఆచారంగా మారింది. అదీ విషయం! -
కాఫీ? యస్, ప్లీజ్!
రోజుకు నాలుగు కప్పుల కాఫీ సేవించడం వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్‌ను తప్పించుకోవచ్చునని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ స్టడీ చెబుతోంది. జ్ఞాపకశక్తిని మెరుగు పర్చుకోవడానికి రోజూ గ్లాస్ రెడ్ వైన్ తీసుకుంటే లేదా గుప్పెడు వేరు శనగలు తింటే మంచిదని ది ఇన్స్టిట్యూవ్ ఫర్ రిజెనరేటివ్ మెడిసిన్(టెక్సాస్, యుయస్) చెబుతోంది. -
ఆహార నియంత్రణ చాలు!
ఆరోగ్యం ఒంట్లో చెడు కొవ్వు పేరుకోకుండా ఉండటానికి రోజూ జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడం కన్నా ఒక సులభతరమైన ప్రత్యామ్నాయ మార్గముందని ప్రకటించారు గ్రీకు అధ్యయనకర్తలు. శారీరక వ్యాయామానికి సమయం లేని వారు ఎంచక్కా ఓ పని చేస్తే హృదయ సంబంధ జబ్బుల ప్రమాదం నుంచి చాలావరకూ బయటపడవచ్చని వారు అంటున్నారు. ఇంతకీ ఏమిటా పని అంటే.. ఆహార నియంత్రణ పాటించడం! వేళకు ఇంత తిని.. ఆ ఆహారంలో తాజా పళ్లు, కాయగూరలు ఉండేటట్లు చూసుకుంటూ, తృణ ధాన్యాలు, విత్తనాలు, బీన్స్, ఆలివ్ ఆయిల్, చేపలు వంటి ఆహారానికి తోడు అప్పుడప్పుడు రెడ్ వైన్ తీసుకుంటుంటే చాలు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 47 శాతం వరకూ తగ్గిపోతాయని అధ్యయనకర్తలు వివరించారు. ఇలాంటి ఆహారాన్ని క్రమపద్ధతిలో తీసుకుంటే వేరే శారీరక కసరత్తు అవసరం లేకపోయినా గుండె జబ్బుల నుంచి బయటపడ్డట్టేనని వారు తెలిపారు. ఏథెన్స్లోని హరొకొపియో వర్సిటీ అధ్యయనకర్తలు ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుత జీవనశైలిలో ఆహార నియంత్రణ పాటించడం కూడా అంత సులభం కాకపోవడ ం వల్లనే కదా.. మానవాళి జబ్బుల పాలవుతున్నది! అదే పాటిస్తే ఇక ఏ ఆరోగ్య సమస్యా ఉండదేమో! -
గ్లాసు రెడ్‌వైన్.. గంటసేపు వ్యాయామం!
ఒక గ్లాసు రెడ్‌వైన్ తాగితే గంట సేపు వ్యాయామం చేసినంత మేలు కలుగుతుందట. ఎర్ర ద్రాక్షలో ఉండే రెస్వెరెట్రాల్ అనే యాంటీఆక్సిడెంట్ పదార్థం ఎక్సర్సైజుల మాదిరిగానే గుండె, కండరాల పనితీరును మెరుగుపరుస్తుందట. అందుకే అనారోగ్యం కారణంగా వ్యాయామం చేయలేని రోగులకు రెస్వెరెట్రాల్ ఉపయోగపడుతుందని కెనడా పరిశోధకులు అంటున్నారు. ప్రయోగశాలలో జంతువులకు రెస్వెరెట్రాల్ ఇచ్చి ప్రయోగాలు జరపగా.. వాటి శారీరక పనితీరు మెరుగుపడిందని యూనివర్సిటీ ఆఫ్ ఆల్బెర్టా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా, రెస్వెరెట్రాల్ జ్ఞాపకశక్తి మెరుగుదలకు, కేన్సర్ ముప్పును తగ్గించేందుకు కూడా తోడ్పడుతుందని గతంలో జరిగిన పరిశోధనల్లో తేలింది. -
ఇక దీర్ఘకాల యవ్వనం!
న్యూయార్క్: మన చర్మం ముడుతలు పడకుండా వయసు పెరిగినా యవ్వనంలోనే ఉన్నట్లు నిగనిగలాడుతుంటే చాలా బాగుంటుంది కదూ. ఇది భవిష్యత్తులో సాధ్యం కానుంది. చర్మం ముడుతలు పడకుండా దానిని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడే ఓ యాంటీఆక్సిడెంట్ రసాయనాన్ని తాము కనుగొన్నామని న్యూక్యాజిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ‘టిరాన్’ అనే ఈ యాంటీఆక్సిడెంట్ రసాయనం సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి వంద శాతం రక్షణ కల్పిస్తుందని, చర్మాన్ని దీర్ఘకాలం యవ్వనంగా ఉంచేందుకు తోడ్పడుతుందని వారు తెలిపారు. ఇలాంటి వాటిని ఆహారం, సౌందర్యసాధనాల్లో చేర్చి ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి రెడ్వైన్లో ఉండే రెస్వెరట్రాల్ 22శాతం, ల్యాబ్‌లలో వాడే నాక్ 20శాతం, పసుపులో ఉండే కుర్కుమిన్ 16శాతం రక్షణ కల్పిస్తుండగా.. టిరాన్ మాత్రం 100 శాతం రక్షిస్తుందని తేలడం విశేషం.