రెడ్ వైన్‌తో రోగ నిరోధక శక్తి
వాషింగ్టన్: మీకు రోజు టీ, రెడ్ వైన్ వంటి పానియాలను తాగే అలవాటు ఉందా? అయితే వ్యాధికారిక వైరస్‌లు మీ దరికి చేరే అవకాశం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ పానియాల్లో ఉండే ఓ మిశ్రమం మనుషుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెం చుతుందని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనిషి శరీరంలోని చిన్న పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు కేవలం ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. తీవ్రమైన వైరస్‌ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని పరిశోధకులు గుర్తించారు.
ఈ సూక్ష్మజీవులు ఫ్లావనాయిడ్స్‌గా పిలిచే కొన్ని మిశ్రమ సమ్మేళాలను విచ్ఛిన్నం చేసి ఈ ‘ఫ్లూ’ల బారి నుంచి కాపాడతాయన్నారు. ఫ్లావనాయిడ్స్ మనం తీసుకునే రోజువారి ఆహారంలో భాగమై ఉంటాయని, అలాగే టీ, రెడ్ వైన్, బ్లూబెర్రిస్‌లో ఇవి సమృద్ధిగా ఉంటాయన్నారు.