ఇటలీ దేశంలో డోరా సర్చెస్ అనే ద్రాక్షతోట యజమానులు ఫ్రీ రెడ్ వైన్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. ఈ ఫౌంటెన్ వద్ద రెడ్ వైన్ 365 రోజులు ఉచితంగా లభిస్తుంది. వాస్తవానికి ఇటలీ దేశంలో ఉచితంగా వైన్ అందించడం కొత్తకాదు. మారినో అనే పట్టణంలో ప్రతి ఏడాది గ్రేప్ ఫెస్టివల్ జరుగుతుంది. ఒక గంట పాటు ప్రజల కోసం పబ్లిక్ వాటర్ ఫౌంటెన్ ట్యాప్ లలో వైట్ వైన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ప్రతిరోజు రెడ్ వైన్ అందుబాటులో ఉండటం విశేషం. ఇటలీ దేశంలో ఉన్న ఈ రెడ్ వైన్ ఉచితంగా అందించే మొదటి ఫౌంటెన్ గా ఇది గుర్తింపు పొందింది.
ఎందుకిలా అంటే..
ఇటలీ దేశంలో విభిన్నమైన సేవలు అందించాలని ఇక్కడి ద్రాక్ష యజమానులు అప్పట్లో భావించారు. అందులో భాగంగానే ఫ్రీ వైన్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత రోమ్ నగరం నుంచి ఒర్టోనా వరకు 196 మైళ్ళ దూరం ఉంటుంది. ఇంత దూరం ప్రతి ఏడాది సాంస్కృతిక యాత్ర నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కొన్ని వేల మంది కేథలిక్ లు పాల్గొంటారు. ఈ దారి వెంట ప్రయాణం సాగించే వారి బడలిక తీర్చేందుకు ప్రసిద్ధ కామినో డి షాన్ టోమ్మాసో దగ్గర ఈ వైన్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు.
ప్రయాణికులు ట్యాప్ తిప్పి తమకు కావలసిన పరిమాణంలో వైన్ తాగి ముందుకు వెళ్తారు. మరింత కావలసిన వాళ్లు పెద్ద పెద్ద బాటిల్స్ లో నింపుకొని వెళ్తూ ఉంటారు. వాస్తవానికి దాహం వేసినప్పుడు గుక్కెడు నీళ్లు దొరకడమే గగనమైన ఈ రోజుల్లో ఇటలీ దేశంలో ఏకంగా రెడ్ వైన్ అందించడం.. అది కూడా ఉచితంగా ఇవ్వడం గొప్ప విషయమే కదా.. అయితే ద్రాక్ష తోట యజమానులు తమ ఎస్టేట్లో పండే పండ్లను ఈ వైన్ తయారీ కోసం వినియోగిస్తారు. వేలాది ఎకరాల్లో తోటలు విస్తరించిన నేపథ్యంలో బాగా పక్వానికి వచ్చిన పండ్లతో వారు ఈ వైన్ తయారు చేస్తున్నారు. ఇందులో ఎటువంటి రసాయనాలు కలపకపోవడం విశేషం.
(చదవండి: బిడ్డకు తల్లయినా ఎంతో ఫిట్‌గా ఆలియా.. సీక్రెట్ ఏంటంటే?)
Comments
Please login to add a commentAdd a comment