ఈ మధ్యం బాటిల్ ఖరీదు తెలుసా?
Published Fri, Jul 21 2017 2:37 PM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM
మెల్‌బోర్న్: ఏ వస్తువు కొనాలనుకున్నా ముందు ఎక్స్‌పైర్ డేట్ చూస్తారు.. కానీ మందు బాబులు మాత్రం ఆ మందు బాటిల్ ఎంత పాతదైతే అంత మంచిదని లొట్టలేసుకుంటూ తీసుకెళ్తారు. దాని రెటు కూడా దాని దగ్గట్టే ఉంటుందిలే.. అయితే ఆస్ట్రేలియాలో1951లో తయారైన ఓ వైన్ బాటిల్ ధర ఎంత ఉంటుందనుకుంటున్నారు. దానికి ఓ మధ్యం ప్రియుడు వేలంలో ఏకంగా 52,000 డాలర్లు చెల్లించాడు.
1951లో తయారైన ప్రముఖ వింటేజ్ వైన్ బాటిల్‌ను పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ మద్యం ప్రియుడు వేలంలో 52,000 డాలర్లకు కొనుగోలు చేశాడు. ఈ మద్యాన్ని పెన్‌ఫోల్డ్స్ గ్రేంజ్ హెర్మిటేజ్ సంస్థ ఎండబ్ల్యు వైన్స్ ద్వారా బుధవారం రాత్రి వేలానికి పెట్టింది. అప్పట్లో ప్రముఖ వైన్ తయారీ సంస్థ మాక్స్ షబర్ట్ వింటేజ్, పెన్‌ఫోల్డ్స్‌ను తయారు చేసేది. ఈ రకం మద్యాన్ని బహిరంగ విక్రయానికి మాత్రం అందుబాటులో ఉంచలేదు. సంస్థ తయారు చేసిన 1,800 బాటిళ్లలో ఇప్పటికి 20 మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఇలాంటి బాటిలే 2004లో జరిగిన వేలంలో 39,870 డాలర్లకు అమ్ముడుపోయింది. ఎండబ్ల్యు వైన్స్ ఎండీ నిక్ స్టాన్‌ఫోర్డు మాట్లాడుతూ మాక్స్ షబర్ట్ తయారు చేసిన ఈ వైన్‌ను 1993లో రుచి చూశారని, ఇప్పటికీ అది మంచి స్థితిలో, తాజా పండ్ల వాసనతో ఉన్నట్లు పెన్‌ఫోల్డ్స్ 2012లో నిర్ధారించారని వివరించారు.
Advertisement