
గ్లాసు రెడ్‌వైన్.. గంటసేపు వ్యాయామం!
ఒక గ్లాసు రెడ్‌వైన్ తాగితే గంట సేపు వ్యాయామం చేసినంత మేలు కలుగుతుందట. ఎర్ర ద్రాక్షలో ఉండే రెస్‌వెరెట్రాల్ అనే యాంటీఆక్సిడెంట్ పదార్థం ఎక్సర్‌సైజుల మాదిరిగానే గుండె, కండరాల పనితీరును మెరుగుపరుస్తుందట. అందుకే అనారోగ్యం కారణంగా వ్యాయామం చేయలేని రోగులకు రెస్‌వెరెట్రాల్ ఉపయోగపడుతుందని కెనడా పరిశోధకులు అంటున్నారు. ప్రయోగశాలలో జంతువులకు రెస్‌వెరెట్రాల్ ఇచ్చి ప్రయోగాలు జరపగా.. వాటి శారీరక పనితీరు మెరుగుపడిందని యూనివర్సిటీ ఆఫ్ ఆల్బెర్టా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా, రెస్‌వెరెట్రాల్ జ్ఞాపకశక్తి మెరుగుదలకు, కేన్సర్ ముప్పును తగ్గించేందుకు కూడా తోడ్పడుతుందని గతంలో జరిగిన పరిశోధనల్లో తేలింది.