ఒక్కోసారి చిన్నపిల్లలు చేసే పనులు మనకు నవ్వు పుట్టిస్తే, మరోసారి మాత్రం ఒళ్లు జలదరించేలా చేస్తాయి. తాజాగా ఒక నాలుగేళ్ల పిల్లాడు నాలుగు అంతస్తుల ఎత్తులో ఉన్న సన్నని గోడపై బాల్కనీ కారిడార్ వరకు నడిచి మళ్లీ వెనక్కి వస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఆ వీడియోను మీరు గమనిస్తే మాత్రం నిజంగా షాక్‌కు గురవుతారు. ఎందుకంటే ఆ పిల్లాడు బెడ్‌రూం కిటికీ దగ్గర నుంచి బాల్కనీ వరకు ఎటువంటి ఆధారం లేకుండా నడిచాడు. దేవుడి దయ వల్ల పిల్లాడికేం కాలేదనుకోండి.. కానీ తను నడిచేటప్పుడు ఏ మాత్రం తేడా జరిగినా పరిస్థితి మరోలా ఉండేది.
ఈ ఘటన గత శనివారం స్పెయిన్‌లోని టెనెరిఫే నగరంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉండగా నాలుగంతస్తులో ఎత్తులో ఉన్న బెడ్‌రూం కిటికీ నుంచి పిల్లాడు బయటికి వచ్చాడు. అక్కడినుంచి నేరుగా బాల్కనీ వరకు ఉన్న చిన్న వంతెనపై వేగంగా నడుచుకుంటూ వెళ్లాడు. బాల్కనీలో ఉన్న కుర్చీ మీద కొన్ని సెకన్లు ఆగి మళ్లీ అంతే వేగంతో యధాతథంగా వెనక్కి వచ్చి కిటికీలోంచి ఇంట్లోకి వెళ్లిపోయాడు. అయితే పిల్లాడు సన్నని వంతెనపై నడుస్తున్నంత సేపు కింద పడతానేమో అనే భయం కనిపించకపోవడం వీడియోలో కనిపిస్తుంది. అయితే ఈ వీడియోనూ ఒక పర్యాటకుడి కూతురు తీసినట్లు తెలిసింది. దీనిని కాస్తా ఆమె ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది. షేర్ చేసిన కాసేపటికే 3.4 మిలియన్ వ్యూస్‌తో పాటు 25వేల కామెంట్లు వచ్చాయి. ' పిల్లాడికి ఎంత దైర్యం. కింద పడతాననే భయం కూడా లేకుండా నడుస్తున్నాడంటూ' ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. ' ఆ పిల్లాడు నడుస్తున్నంత సేపు నాకు భయంతో కడుపులో దేవేసినట్లు అయిందని' మరొకరు అభిప్రాయపడ్డారు. మరికొంత మంది మాత్రం పిల్లాడిని అలా గాలికొదిలేసి నిర్లక్ష్యం వహించిన తల్లిదండ్రులను తప్పు బడుతూ కామెంట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment