Residents Trapped As Flash Floods Hit Spain Zaragoza After Heavy Rainfall, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Spain Floods 2023 Videos: వరద బీభత్సం.. ప్రాణాల కోసం కార్లపైకి ఎక్కి.. 

Published Sat, Jul 8 2023 5:37 PM | Last Updated on Sat, Jul 8 2023 6:02 PM

Residents Trapped Flash Floods Hit Spain Zaragoza Video Viral - Sakshi

మ్యాడ్రిడ్‌: ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు మనుషులైనా, జంతువులైనా విలవిలాడాసిందే. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసిన సమయంలో మానవాళికి పెను ప్రమాదం ఏర్పడుతుంది. తాజాగా యూరప్‌ దేశం స్పెయిన్‌లో ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. స్పెయిన్‌లో వానలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవించాయి. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

వివరాల ప్రకారం.. స్పెయిన్ ఈశాన్య ప్రాంతంలోని జరాగోజా నగరంలో వరద బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా వరద పోటెత్తడంతో వాహనదారులు తమ వాహనాల్లోనే చిక్కుకుపోయారు. ఎటూ కదల్లేక నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయారు. వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. కొందరు కార్లు దిగి వాటిపైకెక్కి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే వరద ధాటికి కొందరు కార్లతో సహా కొట్టుకుపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో స్పెయిన్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా.. రానున్న రోజుల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇది కూడా చదవండి: డచ్‌ రాజకీయ మలుపు: మిత్ర పక్షాలకు నచ్చని నిర్ణయం ప్రధాని ఎందుకు తీసుకున్నట్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement