రొనాల్డో గోల్‌ కొట్టలేదని ఏడ్చేసింది.. హత్తుకొని జెర్సీ గిఫ్ట్‌గా | Irish Girl Cry Not Make Goal By Ronaldo In Match Gave Jersey As Gift | Sakshi
Sakshi News home page

Cristiano Ronaldo: గోల్‌ కొట్టలేదని ఏడ్చేసింది.. హత్తుకొని జెర్సీ గిఫ్ట్‌గా

Published Sat, Nov 13 2021 11:57 AM | Last Updated on Sat, Nov 13 2021 12:10 PM

Irish Girl Cry Not Make Goal By Ronaldo In Match Gave Jersey As Gift - Sakshi

Ronaldo Given Jersey As Gift To Irish Girl.. పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో క్రేజ్‌ ఎంతలా ఉంటుందో ప్రత్యేంగా చెప్పనవసరం లేదు. తాజాగా రొనాల్డో గోల్‌ కొట్టలేదని ఏడ్చిన చిన్నారిని హత్తుకొని జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చి అభిమానుల మనసు కొల్లగొట్టాడు. విషయంలోకి వెళితే.. ఫిపా వరల్డ్‌కప్‌ క్వాలిఫయింగ్‌ పోటీల్లో భాగంగా శుక్రవారం పోర్చుగల్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌ ఆధ్యంతం పోటాపోటీగా సాగడంతో నిర్ణీత సమయంలో ఇరుజట్లు ఒక్క గోల్‌ కూడా కొట్టలేకపోయాయి.

చదవండి: FIFA 2022: ప్రపంచకప్‌కు బ్రెజిల్‌ అర్హత.. తొలి దక్షిణ అమెరికా జట్టుగా

కాగా ఈ మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ఐర్లాండ్‌ అమ్మాయి రొనాల్డోకు వీరాభిమాని. అయితే మ్యాచ్‌లో పోర్చుగల్‌ కెప్టెన్‌ ఒక్క గోల్‌ కూడా కొట్టలేకపోయాడు. దీంతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత గ్రౌండ్‌లోకి పరిగెత్తుకొచ్చిన ఆమె రొనాల్డొను పట్టుకొని ఏడ్చింది. రొనాల్డో ఆమెను హత్తుకొని ఓదార్చి తన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చి సంతోషపరిచాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పోర్చుగల్‌ తన తర్వాతి మ్యాచ్‌ను సెర్బియాతో ఆడనుంది.

చదవండి: Wrestrler Nisha Dahiya: 'నేను చనిపోలేదు.. అది ఫేక్‌ న్యూస్‌'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement