పోర్చుగల్: దిగ్గజ ఫుట్‌బాలర్, పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఫిఫా ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ చివరి నిమిషంలో రెండు గోల్స్ సాధించి తన జట్టును గెలిపించాడు. ఈ రెండు గోల్స్‌తో రొనాల్డో అంతర్జాతీయ గోల్స్ సంఖ్య 111కు చేరింది. దీంతో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఇరాన్ దిగ్గజ ఆటగాడు అలీ దాయ్ (109)ను దాటి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు.
How is this not a red card for Mr Influencer Ronaldo?pic.twitter.com/jZcvvUME2g
— Edmund 💉 (@EdmundOris) September 1, 2021
ఇదిలా ఉంటే, ఇదే మ్యాచ్‌లో రొనాల్డో చేసిన ఓ పని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఆట ప్రారంభమైన 15వ నిమిషంలో పోర్చుగల్‌కు పెనాల్టీ లభించింది. ఈ పెనాల్టీ కిక్‌ను రొనాల్డో తీసుకున్నాడు. అయితే, బంతిని కిక్ చేయడానికి పొజిషన్‌లో పెట్టుకున్న సమయంలో ఐర్లాండ్ డిఫెండర్ ఓషియా దాన్ని కాలితో తన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన రొనాల్డో అతడి భుజంపై బలంగా కొట్టాడు. రొనాల్డో కొట్టిన దెబ్బకు ఓషియా కాసేపు ఓవరాక్షన్ చేశాడు. రొనాల్డోకు అంపైర్ రెడ్ కార్డ్ వస్తుందని నానా డ్రామా చేశాడు.
అయితే ఈ తతంగాన్ని రిఫరి గమనించకపోవడంతో రొనాల్డో రెడ్ కార్డ్ బారి నుంచి తప్పించుకున్నాడు. ఒకవేళ రొనాల్డోకి రెడ్ కార్డు చూపించి ఉంటే.. అతను మైదానం వీడాల్సి వచ్చేది. అప్పుడు చివర్లో రెండు గోల్స్ కొట్టే అవకాశాం ఉండేది కాదు. కాగా, మైదానంలో ప్రత్యర్ధులపై ఇలా దురుసుగా ప్రవర్తించడం సీఆర్7కు కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగా అతను దాడులకు పాల్పడి మైదానం వీడాడు. రొనాల్డో దాడులు ఆటగాళ్ల వరకే పరిమితం అనుకుంటే పొరబడ్డట్టే. ఈ మాంచెస్టర్ యునైటెడ్ స్టార్ రిఫరీలను కూడా వదిలిపెట్టలేదు. వారిపై కూడా దాడులకు దిగి అప్రతిష్టపాలయ్యాడు.
చదవండి: అన్నీ మాకు సానుకూలాంశాలే, టీమిండియాను కచ్చితంగా ఓడిస్తాం..పాక్ కెప్టెన్ ధీమా
Comments
Please login to add a commentAdd a comment