
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో రెండేళ్ల తర్వాత తన ప్రొఫెషనల్ కెరీర్‌లో మరో ట్రోఫీని అందుకున్నాడు. తొలిసారి ఆసియాకు చెందిన అల్ నాసర్ క్లబ్ (సౌదీ అరేబియా) తరఫున బరిలోకి దిగిన రొనాల్డో తన జట్టును అరబ్ క్లబ్ చాంపియన్స్ కప్‌లో విజేతగా నిలిపాడు. అల్ హిలాల్ క్లబ్‌తో జరిగిన ఫైనల్లో రొనాల్డో కెప్టెన్సీ లోని అల్ నాసర్ జట్టు 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. రొనాల్డో రెండు గోల్స్ (74వ, 98వ ని.లో) చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment