సాక్షి,మేడ్చల్‌జిల్లా: మేడ్చల్ పట్టణంలో డ్రగ్స్ కలకలం రేపాయి. మేడ్చల్ బస్సుడిపో వద్ద మంగళవారం(డిసెంబర్ 10) భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ మేడ్చల్ బస్సు డిపో వద్ద దిగాడు.
డ్రగ్స్‌తో దిగుతున్నాడని ముందే సమాచారం అందుకున్న నార్కొటిక్స్ బ్యూరో అధికారులు అతని వద్ద నుంచి 600 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి
Comments
Please login to add a commentAdd a comment