సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒక కిలో మెపిడ్రైన్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ ముఠా నాయకుడు అల్లు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం.. మేడ్చలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మేడ్చల్ పోలీసులతో నార్కోటిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా ఒక విలో మెపిడ్రైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఏడు సంవత్సరాలుగా డ్రగ్స్ తయారు చేస్తున్న అల్లు సత్యనారాయణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సత్యనారాయణ యాదగిరిగుట్టలోని ఒక మూతపడిన ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, డ్రగ్స్ ముఠాలో ఉన్న మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment