Published
Tue, Aug 9 2016 5:54 PM
| Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతా
మున్సిపాలిటీ : సూర్యాపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సుందరవనంగా తీర్చిదిద్దుతానని మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. మంగళవారం పట్టణంలోని 27వ వార్డులోని ప్రియాంక కాలనీలో మెటల్ రోడ్డు పనులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు వచ్చినప్పుడు పట్టణ ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి అందివ్వాలన్నారు. అనంతరం కాలనీలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, కౌన్సిలర్ బైరు దుర్గయ్యగౌడ్, గండూరి ప్రకాష్, శనగాని రాంబాబుగౌడ్, బూర బాలసైదులుగౌడ్, టైసన్ శ్రీను, దేశగాని శ్రీనివాస్, డీఈ వెంకటేశ్వర్‌రావు, కాంట్రాక్టర్లు వెంకటరాజు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.