మత్స్యకారుల సంక్షేమానికి కృషి
మత్స్యకారుల సంక్షేమానికి కృషి
Published Sat, Oct 8 2016 11:18 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
సూర్యాపేట : చెరువులపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. శనివారం పట్టణంలోని చౌదరి చెరువులో మున్సిపల్ చైర్‌పర్సన్ చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెరువుల్లో చేపల పెంపకం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందన్నారు. వరుణిడి కరుణతో చెరువులు నిండి కళకళలాడుతున్నాయన్నారు. మత్స్యకారులు, ముదిరాజ్, గంగపుత్రులతోపాటు ఇతర కులాలకు చెందిన మత్స్య కార్మిక సంఘాల ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. వలస పాలనలో నిర్లక్ష్యానికి గురైన మత్స్య పారిశ్రామిక రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. సూర్యాపేట పట్టణంలోని చౌదరి, పుల్లారెడ్డి, నల్లచెరువు తండాల్లో ఈ చేపల పెంపకం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ రాధారోహిణి, ఎఫ్‌డీఓ ఎస్‌కె.రెహమాన్, వై.వెంకటేశ్వర్లు, గండూరి ప్రకాష్, ఆకుల లవకుశ, వర్థెల్లి శ్రీహరి, షాహినాబేగం, వెలుగు వెంకన్న, షఫీఉల్లా, నెమ్మాది భిక్షం, బైరబోయిన శ్రీను, తండు శ్రీను, బత్తుల ఝాన్సీలక్ష్మి, అంగిరేకుల రాజశ్రీ, గోదల భారతమ్మ, పెదపంగు స్వరూపారాణి, గుడిపూడి వెంకటేశ్వర్‌రావు, దేవేందర్, ఈఈ విద్యాసాగర్‌రావు, డీఈ వెంకటేశ్వర్‌రావు, ఏఈ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement