మట్టి విగ్రహాలను నెలకొల్పాలి
మట్టి విగ్రహాలను నెలకొల్పాలి
Published Mon, Aug 29 2016 8:57 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
సూర్యాపేట : వివేకానందుని సూక్తులను స్ఫూర్తిగా తీసుకొని యువకులు నూరు శాతం బంకమట్టి విగ్రహాలను నెలకొల్పాలని మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, ఆర్డీఓ సి.నారాయణరెడ్డి, డీఎస్పీ వి.సునితామోహన్‌లు అన్నారు. సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బంకమట్టి వినాయక విగ్రహాలపై ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రభుత్వ శాఖల అ«ధికారులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి వారు ముఖ్య అతి«థులుగా హాజరై ప్రసంగించారు. పీఓపీ విగ్రహాలకు బదులుగా బంకమట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను నెలకొల్పేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ నేరేళ్ల లక్ష్మి, కమిషనర్ వడ్డె సురేందర్, మేనేజర్ రాంచందర్‌రావు, తహసీల్దార్ మహమూద్‌అలీ, సీఐ మొగలయ్య, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్ ఎస్‌ఐ జాఫర్, వివిధ పార్టీల మున్సిపల్ ఫ్లోర్ లీడర్లు ఆకుల లవకుశ, షాహినాబేగం, అనంతుల మల్లీశ్వరి, ఎల్గూరి జ్యోతి, వల్దాస్ దేవేందర్, రంగినేని ఉమా, నాగవెల్లి బ్రహ్మయ్య, మహిళా పొదుపు సంఘాల సభ్యురాళ్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement