clay statues
-
మట్టి విగ్రహాలను పూజించండి
-
యువ కళాకారుడి దేశభక్తి
నిర్మల్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భరతమాతకు ఓ యువకుడు వినూత్నంగా నివాళులర్పించారు. తనలోని దేశభక్తిని రంగరించి మట్టిముద్దతో దేశమాతకు రూపునిచ్చాడు. నిర్మల్‌రూరల్ మండలంలోని అనంతపేట్‌కు చెందిన యువకవి, కళాకారుడు పోలీస్ భీమేశ్ బుధవారం 72న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 72 సెంటీమీటర్ల భరతమాత విగ్రహాన్ని మట్టితో తయారుచేశాడు. దేశమాతకు వినూత్నంగా నివాళులర్పించాలన్న తపనకు తన కళను జోడించి ఇలా విగ్రహాన్ని రూపొందించినట్లు భీమేశ్ తెలిపారు. విగ్రహాన్ని తయారు చేసిన యువకుడిని గ్రామస్తులు, పలువురు కవులు, కళాకారులు అభినందించారు. -
వీరప్ప.. తపన
కల్హేర్: మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయడమేకాక, పర్యావరణ పరిరక్షణకు అవుసుల వీరప్ప విశేష కృషి చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతిమలు తయారు చేస్తూ బిజీగా మారుతారు. చంద్రప్ప- రత్నమ్మ దంపతుల ఎకైక సంతానం వీరప్ప. ఓ హోటల్లో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తండ్రి చంద్రప్ప వినాయకుడి విగ్రాహాలు తయారు చేసి గ్రామాస్తులకు సరఫరా చేసేవారు. దాదాపు 30 ఏళ్ల క్రితం తండ్రి మరణించడంతో అప్పటి నుంచి వీరప్ప ఆ బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. -
ఇంటింటికి మట్టి విగ్రహాల పంపిణీ
మెదక్: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పట్టణంలోని 1వ వార్డు హౌసింగ్‌బోర్డు కాలనీలో ఇంటింటికి మట్టి విగ్రహాలను ఆదివారం పంపిణీ చేశారు. స్థానిక కౌన్సిలర్ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా సుమారు 200 మట్టి విగ్రహాలను తయారు చేయించి కాలనీ వాసులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణే థ్యేయంగా గత కొన్నేళ్లపాటు కాలనీలోని సత్యసాయి సేవాసంస్థ అభివృద్ధి, భజన మండలి అభివృద్ధితో పాటు ఇతర అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ఈ విగ్రహాలను తయారు చేయడం జరుగుతుందన్నారు. మట్టి విగ్రహాలనే ప్రజలు పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన కోరారు.కార్యక్రమంలో పలు అభివృద్ధి కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు పెంటయ్య, శంకర్, సుధాకర్, ప్రసన్న, శ్రీనివాస్, నాగేంద్ర, వరప్రసాద్,రాజు, కిషన్ తదితరులు పాల్గొన్నారు. వివిధ రూపాల్లో మట్టి వినాయక విగ్రహాలు మెదక్ పట్టణంలోని సోనాలిబ్యాంగిల్స్ స్టోర్స్‌లో ఈయేడు వివిధ రూపాల్లో తయారు చేసిన మట్టి విగ్రహాలను విక్రయిస్తున్నారు. ఇందులో రూ.70 నుంచి 800 ధర ఉన్న విగ్రహాలను విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు సైతం ప్రజలు ఆసక్తి కనబర్చుతున్నట్లు షాపు యజమాని కృష్ణకుమార్ తెలిపారు. -
వినాయకుడి ప్రతిమ.. బధిరుడి ప్రతిభ
విగ్రహాలకే ప్రాణం.. అద్భుత తయారీ పర్యావరణ పరిరక్షకుడిగా శ్రీకాంత్ మెదక్: పుట్టుకతో మూగ, చెవిటి అయినా ఓ బాలుడు అద్భుతంగా మట్టివిగ్రహాలను తయారు చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. వినాయక చవితికి నెలరోజుల ముందు నుంచే అనేక రకాల వినాయక విగ్రహాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షకుడిగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్నాడురు. మెదక్ పట్టణంలోని వవాబుపేట వీధికి చెందిన చింతకింది బాలవ్వ, సత్తయ్య దంపతులకు ముగ్గురు సంతానం. అందులో చిన్నవాడైన చింతకింది శ్రీకాంత్ పుట్టుకతోనే మూగ, చెవిటి. కాగా స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. చిన్నప్పటి నుంచే బొమ్మలేయటం అంటే ఎంతో ఇష్టం. అతను తయారు చేసిన బొమ్మలు చూస్తే దేవుడి ఆకారం ఇలానే ఉంటుందని పిస్తుంది. అంతటి అద్భుతంగా మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. 5 సంవత్సరాలుగా అనేక రకాలుగా వినాయక విగ్రహాలతో పాటు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇతర దేశనాయకుల విగ్రహాలనుసైతం తయారు చేస్తునాడు. అతని అద్భుత కళారూపాన్ని గమనించిన మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ రెండు సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలకు ఆ బాలుడు తయారు చేసిన విగ్రహాలను కొనుగోలు చేసి మున్సిపల్లో పెట్టి పూజలు చేస్తున్నారు. పట్టణ ప్రజలు కూడా పోటీపడి కొనుగోలు చేసి పూజలు చేస్తున్నారు. మట్టివిగ్రహాలతో పర్యావరణానికి ఎలాంటి హానికలగని విధంగా అందంగా తీర్చి దిద్దుతున్న ఈ బాలుడిని రెండు సంవత్సరాలుగా మున్సిపల్ పాలక వర్గం గనంగా సన్మానిస్తోంది. మట్టిముద్దలకు అద్భుత రూపం ఇస్తూ అందరిని ఆకట్టుకుంటున్న శ్రీకాంత్ కుటుంబం మాత్రం పేదరికంతో నిత్యం పోరాటం చేస్తూనే ఉంది. పర్యావరణ పరిరక్షకుడు శ్రీకాంత్ పుట్టుకతో మూగ, చెవిటి అయిన శ్రీకాంత్ మట్టితో అద్భుతంగా వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా శ్రీకాంత్ తయారు చేసిన విగ్రహాలనే మున్సిపల్లో పెట్టి నవరాత్రి పూజలు చేస్తున్నాం. పట్టణంలోని ప్రజలు కూడా కొనుగోలు చేస్తుంటారు. దీంతో పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి ఆటంకం కలుగదు. - మల్లికార్జున్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ -
మట్టి విగ్రహాలను నెలకొల్పాలి
సూర్యాపేట : వివేకానందుని సూక్తులను స్ఫూర్తిగా తీసుకొని యువకులు నూరు శాతం బంకమట్టి విగ్రహాలను నెలకొల్పాలని మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, ఆర్డీఓ సి.నారాయణరెడ్డి, డీఎస్పీ వి.సునితామోహన్లు అన్నారు. సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బంకమట్టి వినాయక విగ్రహాలపై ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రభుత్వ శాఖల అ«ధికారులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి వారు ముఖ్య అతి«థులుగా హాజరై ప్రసంగించారు. పీఓపీ విగ్రహాలకు బదులుగా బంకమట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను నెలకొల్పేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ నేరేళ్ల లక్ష్మి, కమిషనర్ వడ్డె సురేందర్, మేనేజర్ రాంచందర్‌రావు, తహసీల్దార్ మహమూద్‌అలీ, సీఐ మొగలయ్య, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్ ఎస్ఐ జాఫర్, వివిధ పార్టీల మున్సిపల్ ఫ్లోర్ లీడర్లు ఆకుల లవకుశ, షాహినాబేగం, అనంతుల మల్లీశ్వరి, ఎల్గూరి జ్యోతి, వల్దాస్ దేవేందర్, రంగినేని ఉమా, నాగవెల్లి బ్రహ్మయ్య, మహిళా పొదుపు సంఘాల సభ్యురాళ్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలి: తనికెళ్ల భరణి
కొరిన కోరికలు తీర్చే గణనాథుడుని విషపూరిత విగ్రహాలతో ఇబ్బంది పెట్టవద్దని, కేవలం బంగారం లేదా మట్టి విగ్రహాలు మాత్రమే ప్రతిష్టించించాలని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. స్పూర్ది సేవా సంఘం ప్రతినిధి పుట్టా రామకృష్ణ ఆద్వర్యంలో ఆదివారం మారుతినగర్‌లోని తనికెళ్ల నివాసంలో ఆయనను కలిసి మట్టి విగ్రహాలను బహూకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రం ప్రకారం కేవలం బంగారం లేదా మట్టి విగ్రహాలు మాత్రమే ప్రతిష్టించాలని అయితే బంగారు విగ్రహాలు పెట్టే స్దోమత చాలామందికి ఉండదు కాబట్టి మట్టి విగ్రహాన్ని పెట్టి పూజించుకోవచ్చన్నారు.తద్వారా పర్యావరణానికి ఎనలేలి మేలు జరుగుతుందన్నారు. తనవంతుగా కాలనిలో మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసేలా తనవంతు ప్రచారం చేస్తానన్నారు.