మట్టి విగ్రహాలు అందజేత
మెదక్: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పట్టణంలోని 1వ వార్డు హౌసింగ్‌బోర్డు కాలనీలో ఇంటింటికి మట్టి విగ్రహాలను ఆదివారం పంపిణీ చేశారు. స్థానిక కౌన్సిలర్ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా సుమారు 200 మట్టి విగ్రహాలను తయారు చేయించి కాలనీ వాసులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణే థ్యేయంగా గత కొన్నేళ్లపాటు కాలనీలోని సత్యసాయి సేవాసంస్థ అభివృద్ధి, భజన మండలి అభివృద్ధితో పాటు ఇతర అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ఈ విగ్రహాలను తయారు చేయడం జరుగుతుందన్నారు. మట్టి విగ్రహాలనే ప్రజలు పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన కోరారు.కార్యక్రమంలో పలు అభివృద్ధి కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు పెంటయ్య, శంకర్, సుధాకర్, ప్రసన్న, శ్రీనివాస్, నాగేంద్ర, వరప్రసాద్,రాజు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
వివిధ రూపాల్లో మట్టి వినాయక విగ్రహాలు
మెదక్ పట్టణంలోని సోనాలిబ్యాంగిల్స్ స్టోర్స్‌లో ఈయేడు వివిధ రూపాల్లో తయారు చేసిన మట్టి విగ్రహాలను విక్రయిస్తున్నారు. ఇందులో రూ.70 నుంచి 800 ధర ఉన్న విగ్రహాలను విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు సైతం ప్రజలు ఆసక్తి కనబర్చుతున్నట్లు షాపు యజమాని కృష్ణకుమార్ తెలిపారు.