
తాను తయారు చేసిన విగ్రహానికి మెరుగులు దిద్దుతున్న భీమేశ్
నిర్మల్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భరతమాతకు ఓ యువకుడు వినూత్నంగా నివాళులర్పించారు. తనలోని దేశభక్తిని రంగరించి మట్టిముద్దతో దేశమాతకు రూపునిచ్చాడు. నిర్మల్‌రూరల్ మండలంలోని అనంతపేట్‌కు చెందిన యువకవి, కళాకారుడు పోలీస్ భీమేశ్ బుధవారం 72న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 72 సెంటీమీటర్ల భరతమాత విగ్రహాన్ని మట్టితో తయారుచేశాడు. దేశమాతకు వినూత్నంగా నివాళులర్పించాలన్న తపనకు తన కళను జోడించి ఇలా విగ్రహాన్ని రూపొందించినట్లు భీమేశ్ తెలిపారు. విగ్రహాన్ని తయారు చేసిన యువకుడిని గ్రామస్తులు, పలువురు కవులు, కళాకారులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment