మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలి: తనికెళ్ల భరణి | should install clay idols | Sakshi
Sakshi News home page

మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలి: తనికెళ్ల భరణి

Published Sun, Aug 28 2016 8:54 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

should install clay idols

కొరిన కోరికలు తీర్చే గణనాథుడుని విషపూరిత విగ్రహాలతో ఇబ్బంది పెట్టవద్దని, కేవలం బంగారం లేదా మట్టి విగ్రహాలు మాత్రమే ప్రతిష్టించించాలని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. స్పూర్ది సేవా సంఘం ప్రతినిధి పుట్టా రామకృష్ణ ఆద్వర్యంలో ఆదివారం మారుతినగర్‌లోని తనికెళ్ల నివాసంలో ఆయనను కలిసి మట్టి విగ్రహాలను బహూకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రం ప్రకారం కేవలం బంగారం లేదా మట్టి విగ్రహాలు మాత్రమే ప్రతిష్టించాలని అయితే బంగారు విగ్రహాలు పెట్టే స్దోమత చాలామందికి ఉండదు కాబట్టి మట్టి విగ్రహాన్ని పెట్టి పూజించుకోవచ్చన్నారు.తద్వారా పర్యావరణానికి ఎనలేలి మేలు జరుగుతుందన్నారు. తనవంతుగా కాలనిలో మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసేలా తనవంతు ప్రచారం చేస్తానన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement