
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ........
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
ఆత్మకూర్, : పట్టణంలోని నాగార్జున హైస్కూల్‌లో విద్యార్థులు శనివారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. డీఈఓగా రాఘవేంద్ర, ప్రిన్సిపాల్‌గా శ్రీవాణి, కరస్పాండెంట్‌గా రవి, ఉపాధ్యాయులుగా శ్రీనివాస్, శ్రీకాంత్, మౌనిక, మం జుల, మాసూం, రేష్మ, నాగరాజు, మహిపాల్‌రెడ్డి ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వెంటకేశ్వర్‌రెడ్డి, డెరైక్టర్లు సురేష్, గోపాల్, రాంసాగర్, ఆంజనేయులు, మల్లికార్జున్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బాలికల పాఠశాలలో..
అమరచింత : పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. డీఈఓగా నిషాబేగం, హెచ్‌ఎంగా ఝా న్సీరాణి, డిప్యూటీ ఈఓగా లక్ష్మీదేవి, పీఈటీగా కృష్ణవేణి, అటెండర్‌గా రామేశ్వరీ, ఉపాధ్యాయులుగా చౌతన్య, మౌనిక, సిందూజా, రేవతి, శ్రవంతి, తులసి, మమత, రేష్మ చక్కగా విధులు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేసినట్లు ఆ పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం మణెమ్మ తెలిపారు. కార్యక్రమంలో సుశీల, కల్పన, వైడూర్య, అనిత, చంద్రిక పాల్గొన్నారు.
గుడెబల్లూర్‌లో..
మాగనూర్ : మండలంలోని గుడెబల్లూర్ గ్రామ ఉన్నత పాఠశాలలో స్వయంపరిపాలన సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. కలెక్టర్‌గా సుకన్య, డీఈఓగా బస్వరాజ్, డిప్యూటీ ఈఓగా సునిల్‌కుమార్, ఎంఈఓగా సంగీత, హెచ్‌ఎంగా లక్ష్మి వ్యవహరించారు. ప్రతిభ కనిబర్చిన విద్యార్థులకు ఎంఈఓ వెంకటవరలక్ష్మి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటయ్య, గణేష్‌సింగ్, సరిత, స్వాతి, శశికళ, రవి తదితరులు ఉన్నారు.