కొమరోలు: చూడ్డానికి ఒకే ఊరిలా ఉంటుంది.. కానీ మూడు గ్రామాలు కలిసిన ఊరది. ఆ ఊర్లో రెండు పంచాయతీలున్నాయి. అక్కడి ఓటర్లు ఇద ్దరు సర్పంచ్‌లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ మూడు ఊర్లు రెండు మండలాలుగా విభజిం చడంతో ఈ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని ఓ ఊరు, గిద్దలూరు మండల పరిధిలోని రెండు ఊర్ల కలయికగా పొదలకొండపల్లె గ్రామం ఏర్పడింది.
మూడు గ్రామాల కలయికతో విస్తీర్ణం పెద్దదిగా ఉంటుంది. గిద్దలూరు మండల పరిధిలో క్రిష్ణం రాజుపల్లె, పొదలకొండపల్లె గ్రామాలు భౌగోళికంగా కలిసి ఉండగా, కొమరోలు మండల పరిధిలో పొట్టిరెడ్డిపల్లె గ్రామం కూడా ఆ గ్రామాల్లోనే మిళితమై ఉంది. ఈ గ్రామాలను తంబళ్లపల్లె గ్రామానికి వెళ్లే రహదారి రెండు మండలాలుగా వేరు చేస్తుంది. పొట్టిరెడ్డిపల్లె గ్రామంలోని 311 మంది ఓటర్లు, కొమరోలు మండలంలోని 3 కి.మీ దూరంలో ఉన్న ద్వారకచర్ల పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేస్తారు. క్రిష్ణంరాజుపల్లె్ల, పొదలకొండపల్లె గ్రామాల్లోని 1,950 మంది పొదలకొండపల్లె గ్రామంలో ఓటేస్తారు.
(చదవండి: గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి!)
ఎన్టీఆర్ అత్తగారి ఊళ్లో టీడీపీ ఓటమి
Comments
Please login to add a commentAdd a comment