నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఎమ్మెల్యే సవాల్‌ | YSRCP MLA Anna Rambabu Fires On Janasena Leaders | Sakshi
Sakshi News home page

జనసేన ఆరోపణలు అవాస్తవం..

Published Sun, Jan 24 2021 5:04 PM | Last Updated on Sun, Jan 24 2021 6:39 PM

YSRCP MLA Anna Rambabu Fires On Janasena Leaders - Sakshi

సాక్షి, తాడేపల్లి: వెంగయ్య మృతికి తాను కారణం కాదని.. జనసేన నేతల ఆరోపణల్లో వాస్తవం లేదని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వెంగయ్య మృతికి విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో వెంగయ్య ఆత్మహత్య చేసుకుంటే.. తనకు ఆపాదిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రోడ్డుపై రాళ్లు అడ్డంగా పెట్టి.. తనని అడ్డుకుని.. బలవంతంగా వాహనం నుంచి దింపే ప్రయత్నం చేశారని అన్నా రాంబాబు గుర్తు చేశారు.
చదవండి: ‘2018లో చంద్రబాబే పారిపోయారు

‘‘సింగరపల్లిలో 95 శాతం సిమెంట్ రోడ్లు వేశాం. చందు అనే వ్యక్తి నన్ను అడ్డుకున్నాడు. ఆ సమయంలో వెంగయ్య అక్కడే ఉన్నాడు. వెంగయ్యకు నాకు వివాదం లేదు.. వాగ్వాదం జరగలేదు. చిన్న వివాదాన్ని ఎడిటింగ్ చేసి దుష్ప్రచారం చేశారు. పవన్‌కల్యాణ్‌లా శవ రాజకీయాలు చేయడం నాకు రాదు.వెంగయ్య మృతికి నేను కారణమని నిరూపిస్తే రాజీనామా చేస్తానని’’ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సవాల్‌ విసిరారు. చదవండి: నిమ్మగడ్డ ఏకపక్ష ధోరణి సరికాదు: సామినేని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement