సాక్షి,ఖమ్మం వైద్యవిభాగం: ఉదయం లేవగానే వేపపుల్లతో పళ్లు తోముకోవడం అలవాటు ఉన్న ఓ వ్యక్తి శనివారం అలాగే చేస్తుండగా పుల్ల ఒక్కసారిగా ఆయన గొంతులో నుంచి కడుపులోకి వెళ్లింది. దీంతో వైద్యులు ఎండోస్కోపీ ద్వారా బయటకు తీశారు. వివరాల్లోకి వెళ్తే... ముదిగొండ మండలం కమలాపురానికి చెందిన గీత కార్మికుడు పర్సగాని ఆదినారాయణ శనివారం ఉదయం పళ్లు శుభ్రం చేసుకుంటుండగా వేపపుల్ల గొంతులోకి వెళ్లి మెల్ల గా కడుపులోకి చేరింది.
వెంటనే కుటుంబ సభ్యులు నగరంలోని ఎపెక్స్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకురాగా, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ టి.అరుణ్‌సింగ్ పరీక్షలు నిర్వహించి చిన్నగాటు కూడా పెట్టకుండా ఎండోస్కోపీ మిషన్ ద్వారా కడుపులోని వేపపుల్లను బయటకు తీశారు. ఈ సందర్భంగా చికిత్స వివరాలను ఆస్పత్రి డైరెక్టర్, యూరాలజిస్ట్ కె.కిశోర్‌కుమార్‌రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్‌సింగ్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ కే.వీ.ఎస్ చౌహాన్, కేన్సర్ శస్త్ర చికిత్స నిపుణులు వి.ప్రదీప్ వివరాలు వెల్లడించారు. సమావేశంలో ఆస్పత్రి మార్కెటింగ్ మేనేజర్ కొరిపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment