దంతాలు మూడుసార్లు తోముకుంటేనే.. | Brush Your Teeth Not Twice, But Thrice A Day | Sakshi
Sakshi News home page

దంతాలు మూడుసార్లు తోముకుంటేనే..

Published Mon, Dec 2 2019 8:00 PM | Last Updated on Mon, Dec 2 2019 8:38 PM

Brush Your Teeth Not Twice, But Thrice A Day - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రోజుకు మూడు సార్లు పరిశుభ్రంగా దంతాలు తోముకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం కనీసం పది శాతం దక్కుతుందని దక్షిణా​ కొరియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారు 1,61,000 మందిపై జరిపిన అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పన్ల మధ్య చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియా రక్త నాళాల ద్వారా గుండెలోకి వెళ్లడం వల్ల గుండె కొట్టుకోవడం లయ తప్పుతుందని, తద్వారా గుండె పోటు వచ్చే ఆస్కారం ఉందని వారు అభిప్రాయపడ్డారు. రోజుకు మూడు సార్లు పన్లు తోమడం ద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం తమ అధ్యయనంలో తేలిందని సియోల్‌లోని యెవా విమెన్స్‌ యూనివర్శిటీ డాక్టర్‌ తే జిన్‌ సాంగ్‌ చెప్పారు. 

గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నా 40 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్కులపై ఈ అధ్యయనం జరిపామని, వయస్సు, స్త్రీలా, పురుషులా, పేద వారా, ధనవంతులా, మద్యం తాగుతారా లేదా, వ్యాయామం చేస్తారా, లేదా అన్న అంశాలతో సంబంధం లేకుండా రోజుకు మూడుసార్లు పన్లు తోముతున్న వారిలో గుండె జబ్బుల అవకాశం పది నుంచి 12 శాతం వరకు తగ్గుతుందని ఆయన తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement