Brushing
-
పిల్లలకు బ్రషింగ్ నేర్పడం ఇలా..
పెరిగే పిల్లల పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే, వాళ్లకు పళ్లు రంధ్రాలు పడటం, పుచ్చుపళ్లు రావడం వంటివి నివారించాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు బ్రషింగ్ ప్రక్రియనూ నేర్పాలి..పళ్లపై ఏర్పడే గార తొలగిపోడానికి, అది ఏర్పడకుండా ఉండటానికి పేస్ట్‌తో రోజూ రెండుసార్లు బ్రష్ చేయడం నేర్పాలి.పళ్ల మీద గుండ్రంగా తిప్పుతున్నట్లుగా బ్రష్‌ను ఉపయోగించేలా చిన్నప్పటినుంచి అలవాటు చేయాలి.దానికి వాళ్లు అలా అలవడిపోయి, జీవితాంతం కరెక్ట్‌గా బ్రషింగ్ చేస్తారు.బ్రష్ మీద బఠాణీ గింజ అంత పేస్ట్ వేస్తే.. దానిని వారు మింగకుండా ఉంటారు.నాలుగేళ్లు దాటాక కూడా వేలు చప్పరించే పిల్లల పళ్లు వంకర టింకరగా రావడం లేదా ఒకేచోట గుంపుగా రావడం జరగవచ్చు. అందుకే ఈ అలవాటు త్వరగా మానేలా జాగ్రత్త తీసుకోవాలి.ఇవి చదవండి: Fashion: స్కర్టే.. సూపర్ స్టయిల్! -
దంతాలు మూడుసార్లు తోముకుంటేనే..
సాక్షి, న్యూఢిల్లీ : రోజుకు మూడు సార్లు పరిశుభ్రంగా దంతాలు తోముకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం కనీసం పది శాతం దక్కుతుందని దక్షిణా కొరియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారు 1,61,000 మందిపై జరిపిన అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పన్ల మధ్య చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియా రక్త నాళాల ద్వారా గుండెలోకి వెళ్లడం వల్ల గుండె కొట్టుకోవడం లయ తప్పుతుందని, తద్వారా గుండె పోటు వచ్చే ఆస్కారం ఉందని వారు అభిప్రాయపడ్డారు. రోజుకు మూడు సార్లు పన్లు తోమడం ద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం తమ అధ్యయనంలో తేలిందని సియోల్‌లోని యెవా విమెన్స్ యూనివర్శిటీ డాక్టర్ తే జిన్ సాంగ్ చెప్పారు. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నా 40 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్కులపై ఈ అధ్యయనం జరిపామని, వయస్సు, స్త్రీలా, పురుషులా, పేద వారా, ధనవంతులా, మద్యం తాగుతారా లేదా, వ్యాయామం చేస్తారా, లేదా అన్న అంశాలతో సంబంధం లేకుండా రోజుకు మూడుసార్లు పన్లు తోముతున్న వారిలో గుండె జబ్బుల అవకాశం పది నుంచి 12 శాతం వరకు తగ్గుతుందని ఆయన తెలిపారు. -
ఈ బ్రష్ ధర రూ.12 వేలు
పళ్లు తోముకోవడానికి మీరు ఎంతసేపు సమయం కేటాయిస్తారు? ఓ పదో పదిహేను నిమిషాలో అద్దం ముందు బ్రష్‌తో గడుపుతారు. ఇక నుంచి దానికి అంత సమయం కేటాయించవలసిన అవసరం లేదు. కేవలం 10 సెకన్లలో బ్రషింగ్ని పూర్తి చేసే సరికొత్త ఎలక్ట్రానిక్ బ్రష్ ని అమెరికాకు చెందిన కంపెనీ తయారు చేసింది. 10 సెకండ్లలో బ్రష్ చేసుకోవడమా? అని ఆశ్చర్య పడకండి. ఈ బ్రష్ గురించి వింటే ఔరా! అనక మానరు. ఈ బ్రష్‌లో అతి చిన్న కెమెరాలు అమర్చారు. బ్రష్ నోటిలోకి వెళ్లగానే మన పంటి లోపల భాగాలను ఈ కెమెరా ఫొటోలు తీస్తుంది. దానికి సంబంధించిన చిత్రాలను మన దగ్గరుండే స్మార్ట్‌ఫోన్‌కు పంపిస్తుంది. దీనికి మన దగ్గరున్న స్మార్ట్‌ఫోన్‌ను కెమెరాకు అనుసంధానిస్తే సరిపోతుంది. ఈ బ్రష్‌ను ప్రస్తుతం ట్రయల్ రన్లో ఉంచారు. ఇంతకీ ఈ బ్రష్ పేరు చెప్పలేదు కదూ.. దీని పేరు ‘గ్లేర్ స్మైల్ ’. దీని ధర రూ.12వేలు కాగా భారత్‌లో దీన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామని కంపెనీ ప్రకటించింది. -
వారంలోనే మెరుపు!
పళ్లు తెల్లగా మెరవాలంటే రోజూ బ్రషింగ్ అయ్యాక ఓ చిన్న చిట్కా పాటిస్తే చాలు. ఒక గిన్నెలో తాజా నిమ్మకాయను పిండి రసాన్ని తీయాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి బ్రషింగ్ అయ్యాక ఆ రసాన్ని రెండు సార్లు నోట్లో పోసుకొని ఓ రెండు నిమిషాల పాటు పుక్కిలించి ఊసేయాలి. ఇలా ఒక వారం పాటు చేస్తే పళ్లు తళతళా మెరవడం ఖాయం. జుట్టుకు రకరకాల కండీషనర్లు వాడి, రసాయనాలతో విసిగిపోయారా? అయితే ఇంట్లో ఉండే కండీషనర్‌తో ఇటు ఆరోగ్యంగానూ అటు ఆర్థికంగానూ లాభం పొందండి. కుంకుడు రసంతో కానీ షాంపూతో కానీ తల స్నానం చేశాక తేనెను జుట్టుకు పట్టించండి. ఓ 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో జుట్టును కడిగేసుకోండి. అంతే నిగనిగలాడే కండీషన్డ్ హెయిర్ మీ సొంతం. ముఖంపై మొటిమలతో బాధపడే వారు ఒక్క గుడ్డుతో వాటిని మాయం చేసుకోవచ్చు. ఒక చిన్న పాత్రలో గుడ్డును పగలగొట్టి తెల్ల సొనను వేయండి. చిన్న బ్రష్ సాయంతో మొటిమలపై ఆ సొనను రాసుకొని కాసేపు కునుకు తీయండి. లేచిన వెంటనే ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. గుడ్డు తెల్ల సొన మొటిమలపై ఎంతసేపు ఉన్నా ఎలాంటి నష్టం ఉండదు. ఈ చిట్కా తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది.