తల్లి క్షణికావేశంలో ఎంత పని చేసింది! | 4 year old child died with suffering injuries while mother beats her | Sakshi
Sakshi News home page

తల్లి క్షణికావేశంలో ఎంత పని చేసింది!

Published Sun, Feb 5 2017 10:32 PM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

తల్లి క్షణికావేశంలో ఎంత పని చేసింది!

తల్లి క్షణికావేశంలో ఎంత పని చేసింది!

వాషింగ్టన్: నాలుగేళ్ల కూతురు బ్రష్ చేసుకుండా మారాం చేస్తుందని ఓ తల్లి ఆవేశంతో చేసిన పని పసి ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ ఘటన అమెరికాలోని మేరీ ల్యాండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మొదట తన కూతురు బ్రష్ చేసుకోవడానికి బాత్రూమ్‌కు వెళ్లిందని, బటయకు రావడం లేదని ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేసింది. చివరగా వారు టెస్టులు చేయడంతో తల్లి దాడి కొట్టడం వల్లే చిన్నారి చనిపోయిందని తేలింది.

మేరీలాండ్‌ కు చెందిన ఐరిస్ హెర్నాండేజ్ రివాస్ అనే మహిళకు నాలుగేళ్ల కూతురు నోహేలీ అలెగ్జాండ్రో మార్టినెజ్ హెర్నాండేజ్ ఉంది. బ్రష్ చేసుకోమని తల్లి ఎంత చెప్పినా.. చిన్నారి నోహేలీ మాట వినకపోవడంతో ఆవేశానికి లోనైంది. చిన్నారి కడుపు, తల భాగాల్లో తీవ్రంగా కొట్టి, బాత్రూమ్‌లోకి నెట్టి గడియపెట్టింది. ఎంతసేపయినా కూతురు బయటకు రాలేదని గమనించి ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసింది. చిన్నారికి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత వాషింగ్టన్ డీసీలోని చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అయినా ప్రయోజనం లేకపోయింది.

అసలే తలకు సంబంధించిన ఓ సమస్యతో ఉన్న చిన్నారి తల్లి దెబ్బలకు తీవ్ర అనారోగ్యానికి గురై అక్కడే చనిపోయింది. బెల్టుతో కూడా కొట్టినట్లు పోలీసుల వద్ద అంగీకరించింది. ఆమెకు శిక్ష ఇంకా ఖరారు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement