mother beats girl
-
అమ్మా.. నీకిది తగునా..!
పాలకొండ రూరల్: అల్లారు ముద్దుగా లాలించాల్సిన నాలుగేళ్ల చిన్నారిపై ఓ తల్లి కర్కశత్వాన్ని ప్రదర్శించింది. చెప్పినమాట వినలేదన్న కోపంతో చేతులు, కాళ్లను తాళ్లతో కట్టి తన విధులకు వెళ్లిపోయింది. చిన్నారి పరిస్థితిని గమనించిన స్థానికులు తండ్రికి సమాచారం ఇవ్వడంతో కట్లబంధం నుంచి విముక్తి కలిగింది. వివరాల్లోకి వెళ్తే... పాలకొండ ఇందిరానగర్ నివసిస్తున్న కెల్ల శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రోజులాగానే భర్త హోటల్ çపనులు చేసేందుకు వెళ్లిపోయాడు. భార్య లక్ష్మి కూడా ఓ వసతి గృహంలో తాత్కాలిక సహాయకురాలిగా పనిచేస్తోంది. ప్రతిరోజు తన నాలుగేళ్ల పెద్దకుమార్తె పూరి్ణమను అంగన్వాడీ కేంద్రానికి పంపించి చిన్నకుమార్తెను తీసుకుని విధులకు హాజరయ్యేది. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లనని పూర్ణిమ శుక్రవారం మారాం చేసింది. ఎంత చెప్పిన వినకపోవడంతో సహనం కోల్పోయిన తల్లి... పూర్ణిమ కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి తమ ఇంటికి ఎదురుగా ఉన్న ఓ ఇంటి వద్ద కూర్చోబెట్టి చిన్నకుమార్తెను తీసుకుని విధులకు వెళ్లిపోయింది. తల్లితండ్రులు ఇద్దరూ ఇంటి వద్ద లేకపోడం, కదిలేందుకు వీలులేకుండా ఉన్న కట్లబంధనంలో చిన్నారి కన్నీరు కార్చుతూ ఉండిపోయింది. దీనిని గమనించిన స్థానికులు విషయాన్ని తండ్రి శ్రీనివాసరావుకు తెలియజేశారు. ఆయన వెంటనే వచ్చి కుమార్తె కట్లు విప్పాడు. భార్య చేసిన పనికి కోపంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తనపై కోపంతో తరచూ ఇటువంటి చర్యలకు పూనుకుంటోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్ఐ బి.శివప్రసాద్ చిన్నారి తల్లితండ్రులిద్దరినీ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఏ దేశమయితేనేం, ఆమె ఓ తల్లేనా!?
న్యూఢిల్లీ : ‘ఇంటి ముందు అరుగు మీద అమాయకంగా కూర్చున్న నాలుగేళ్ల పాప వద్దకు పంజాబీ కుర్తా, పైజామా ధరించి బలిష్టంగా ఉన్న తల్లి వచ్చి, అమాంతంగా ఆ పాప జుట్టు పట్టుకుని అరచేతితో వీపు మీద దబా దబా బాదడం, ఆ తర్వాత ఆ తల్లి కాసేపు దమ్ము పీల్చుకొని వద్దు, వద్దంటూ రెండు చేతులతో వేడుకుంటున్న ఆ పాపను నిర్దాక్షిణ్యంగా చెంప మీద లాగి కొట్టడం, కింద పడిపోయిన ఆ పాపను అలాగే జుట్టు పట్టుకొని వీపు మీద మళ్లీ కొట్టడం, కొట్టీ కొట్టీ చేతులు మంట పుట్టాయి కాబోలు... పక్కన గోడ మీదున్న స్లిప్పరు తీసుకొచ్చి మళ్లీ ఆ పాప జుట్టు పట్టుకొని వీపులో దబా దబా బాదడం’ దృశ్యాలను వీడియోలో చూసిన నెటిజన్లు నిజంగా కన్నీరు మున్నీరవుతున్నారు. పాకిస్తాన్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఆ రక్కసి తల్లిని గుర్తించి పోలీసులకు పట్టించే వరకు ఈ వీడియోను షేర్ చేయమంటూ సలహాలు, సూచనలతో గత రెండు రోజులుగా తెగ షేర్ చేస్తున్నారు. పాకిస్తాన్లోని పంజాబీ కుటుంబాల్లో తల్లులు, పిల్లలను ఇలా బాదడం సర్వ సాధారణమంటూ మరి కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కాలమిస్ట్, రచయిత తరేక్ ఫతా కూడా ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోలో ఆ తల్లి, పాపను కొట్టడాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆమెలో కోపం, అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ పాపను అంతగా కొట్టేంత ఆక్రోశం మాత్రం కనిపించదు. ఆ పాపకు తాకరాని చోట దెబ్బలు తాకకుండా జాగ్రత్తగా వీపును వంచి గట్టిగా కొడుతోంది. జుట్టు పట్టుకొని పైకి లాగినప్పుడు కూడా జట్టూడినంత నొప్పి పెట్టకుండా జట్టును సరిచేసి మరీ పట్టుకుంటుంది. లోతుగా ఆలోచిస్తే ఆమె పాప మీద కాదు, మరెవరి మీదనో కోపం, ఆక్రోశం ఉందనిపిస్తుంది. అసలు ఆ సంఘటననే పాకిస్తాన్లో జరగలేదు. జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లాలో, నగరి ప్రాంతంలో జరిగింది. స్థానిక జేకే మీడియా, స్థానిక జర్నలిస్ట్ ఆశిష్ కోహ్లీ ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ వీడియాను రహస్యంగా రికార్డు చేసిందీ మరెవరో కాదు, ఆ దుర్మార్గురాలి భర్త, ఆ పాపకు స్వయాన తండ్రి. భర్త మీద కోపంతో ఆ భార్య అలా కన్నకూతురు మీద కసి తీర్చుకుంది. శిశు సంక్షేమ శాఖ ఫిర్యాదు మేరకు జమ్మూ పోలీసులు ఆ తల్లిదండ్రులిద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
తల్లి క్షణికావేశంలో ఎంత పని చేసింది!
వాషింగ్టన్: నాలుగేళ్ల కూతురు బ్రష్ చేసుకుండా మారాం చేస్తుందని ఓ తల్లి ఆవేశంతో చేసిన పని పసి ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ ఘటన అమెరికాలోని మేరీ ల్యాండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మొదట తన కూతురు బ్రష్ చేసుకోవడానికి బాత్రూమ్కు వెళ్లిందని, బటయకు రావడం లేదని ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేసింది. చివరగా వారు టెస్టులు చేయడంతో తల్లి దాడి కొట్టడం వల్లే చిన్నారి చనిపోయిందని తేలింది. మేరీలాండ్ కు చెందిన ఐరిస్ హెర్నాండేజ్ రివాస్ అనే మహిళకు నాలుగేళ్ల కూతురు నోహేలీ అలెగ్జాండ్రో మార్టినెజ్ హెర్నాండేజ్ ఉంది. బ్రష్ చేసుకోమని తల్లి ఎంత చెప్పినా.. చిన్నారి నోహేలీ మాట వినకపోవడంతో ఆవేశానికి లోనైంది. చిన్నారి కడుపు, తల భాగాల్లో తీవ్రంగా కొట్టి, బాత్రూమ్లోకి నెట్టి గడియపెట్టింది. ఎంతసేపయినా కూతురు బయటకు రాలేదని గమనించి ఎమర్జెన్సీ నెంబర్కు కాల్ చేసింది. చిన్నారికి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత వాషింగ్టన్ డీసీలోని చిల్డ్రన్స్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అసలే తలకు సంబంధించిన ఓ సమస్యతో ఉన్న చిన్నారి తల్లి దెబ్బలకు తీవ్ర అనారోగ్యానికి గురై అక్కడే చనిపోయింది. బెల్టుతో కూడా కొట్టినట్లు పోలీసుల వద్ద అంగీకరించింది. ఆమెకు శిక్ష ఇంకా ఖరారు చేయలేదు.