సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం రాజధానిలోని బలరామ్ పూర్ ప్రభుత్వాసుత్రి, నిరుపేదల కోసం కొత్తగా నిర్మించిన షెల్టర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిచారు. అంతేకాక ప్రభుత్వ షెల్టర్లలో రాత్రిపూట తలదాచుకుంటున్న నిరుపేదలతో మాట్లాడారు. ప్రభుత్వ షెల్టర్లలోని మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ ఏడు చలి తీవ్రంగా ఉండడంతో పేదల కోసం సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇండ్లులేని, ఇతర పేదల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షెల్టర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చలి నుంచి కాపాడుకునేందుకు అవసరమైన దుస్తులు, దుప్పట్లను ప్రభుత్వం అందించింది.
ప్రభుత్వం అందించిన వసతులు పేదలకు అందుతున్నాయో? లేదో? తెలసుకునేందుకు ఇలా వచ్చానని యోగి చెప్పారు. షెల్టర్లను పరిశీలించాక.. అందులో హీటర్లను ఏర్పాటు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment