నైటౌటా..? ఎక్కువ నిద్రపోండి!
టొరంటో: రాత్రంతా మెలుకువగా ఉండి చేయాల్సిన పనులేమైనా మీకు ఉన్నాయా? అయితే అంతకుముందు రోజు కాస్త ఎక్కువ నిద్రపోండి. ఇక మరుసటి రాత్రికి మీ మెదడు పనితీరు మెరుగుపడటంతోపాటు, పనులు కూడా మరింత కచ్చితత్వంతో చేయగలరట. కెనడాలోని కల్గరీ విశ్వవిద్యాలయం వారు పరిశోధన చేసి ఈ విషయం చెబుతున్నారు.
పరిశోధనకు వారు 12 మంది పూర్తి ఆరోగ్యవంతులైన, యుక్త వయసులో ఉన్న పురుషులను ఎంపిక చేసుకున్నారు. రెండు వారాల పాటు పరిశోధన చేసి పురుషులు ఎక్కువ సేపు నిద్ర మేల్కొని ఉన్నపుడు వారి మెదడు పనితీరు, అలసట స్థాయిలను పరిశీలించి ఈ విషయం తేల్చారు.