ఎవరైనాసరే రోజంతా ఏవో ఒక వ్యాపకాలలో మునిగిపోయాక, రాత్రయ్యాక ఇంటికి చేరుకుని నిద్రిస్తారు. అయితే వాతావరణం మారినప్పుడు ఆ ప్రభావం నిద్రపై ఉంటుందనే సంగతి మీకు తెలుసా? ఈ అంశంపై నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఎవరికైనా సరే వేసవిలో అంత సులభంగా నిద్రరాదని, చలికాలంలో నిద్ర త్వరగా వస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది.
ఇంతకూ వాతావరణానికి, నిద్రకు మధ్యగల సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికన్ అకాడమి ఆఫ్ న్యూరాలజీకి చెందిన పరిశోధకులు సంవత్సరంలోని వివిధ కాలాల్లో మనిషి నిద్రపై అధ్యయనం చేశారు. ఈ వివరాలను ‘న్యూరాలజీ’ జర్నల్‌లో ప్రచురించారు. చలికాలం ముగిసిన వెంటనే వేసవి కాలం వస్తుంది. ఈ తరుణంలో రాత్రి సమయం తగ్గి, పగటి సమయం పెరిగినట్లు అనిపిస్తుంది. దీనిని డే- లైట్ సేవింగ్ టైమ్ అని అంటారు. విపరీతమై చలికాలం ఉన్న సమయంలో రాత్రి సమయం పెరిగి, పగటి సమయం తగ్గుతుంది. దీనిని స్టాండర్డ్ టైమ్ అని అంటారు. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం డే-లైట్ సేవింగ్ టైమ్ నుంచి స్టాండర్డ్ టైమ్‌కు మారే సమయంలో చాలామందికి స్లీపింగ్ డిజార్డర్ సమస్య తలెత్తుతుంది.
అయితే స్టాండర్డ్ టైమ్ నుంచి డే-లైట్ సేవింగ్ టైమ్‌నకు మారేటప్పుడు ఎటువంటి సమస్య తలెత్తదు. దీనిగురించి అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెంబర్ రాన్ బీ పోస్టుమ్ మాట్లాడుతూ కాలాల మార్పు కారణంగా నిద్ర రావడంలో చాలా రోజుల పాటు మార్పులు రావు. ఇటువంటి మార్పు కేవలం 14 రోజులు మాత్రమే ఉంటుందన్నారు. ఈ పరిశోధనలో 45 నుంచి 85 ఏళ్ల మధ్య వయసు కలిగిన 30,097 మంది పాల్గొన్నారు. అధ్యయనంలో భాగంగా నిద్రకు సంబంధించిన ప్రశ్నలను వీరిని అడిగారు. మీరు ఎంత సేపు నిద్రపోతారు? మీకు నిద్ర ఎంతసేపటిలో పడుతుంది? ఎంత ఘాడమైన నిద్ర వస్తుందనే ప్రశ్నలను వారిపై సంధించారు.
వీటితో పాటు గడచిన నెలలో ఎన్నిసార్లు నిద్రపట్టేందుకు 30 నిముషాల కన్నా అధికసమయం పట్టిందని కూడా ప్రశ్నించారు. అలాగే ఎన్నిసార్లు నిద్ర మధ్యలో లేచారు? అటువంటప్పుడు ఉదయం నిద్రపోయారా అనే ప్రశ్నలు వేశారు. ఈ పరిశోధనలో ఎవరైతే ఒకవారం వ్యవధిలో మూడు లేదా అంతకన్నా ఎక్కువసార్లు నిద్రపట్టేందుకు 30 నిముషాల కన్నా అధికసమయం పట్టిందో లేదా వారి నిద్ర చెదిరిపోయిందో లేదా ఉదయం త్వరగా మెలకువ వచ్చేస్తోందో వారంతా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని తేలింది. పరిశోధకులు కాలాల మార్పు కారణంగానూ నిద్రలో వచ్చే మార్పులపై అధ్యయనం చేశారు. వేసవిలో చక్కగా నిద్రపోయవారు 6.76 గంటలు నిద్రపోతారని, చలికాలంలో దీనికన్నా 5 నిముషాలు అధికంగా అంటే 6.84 నిముషాలు నిద్రపోతారని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment