తల్లి అయిన నయనతార | Nayantara To Play Mother Role in 'Night Show' | Sakshi
Sakshi News home page

తల్లి అయిన నయనతార

Published Fri, Oct 10 2014 12:00 AM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM

తల్లి అయిన నయనతార - Sakshi

తల్లి అయిన నయనతార

నయనతార అమ్మ అయిందట. ఇదేంటి ప్రేమలు కూడా అన్నీ పెటాకులవుతుంటే, నయనతార పెళ్లి ఎప్పుడు చేసుకుంది. తల్లి ఎప్పుడు అయిందనుకుంటున్నారా? అవును నయనతార తల్లి అయింది వాస్తవమే కానీ నిజ జీవితంలో కాదు సినిమాలో. ఈ మధ్య అనామిక చిత్రంలో కూడా గర్భిణీగా నటించాల్సి వస్తే అందుకు నిరాకరించి ఆ చిత్ర దర్శకుడితో వాస్తవ కథనే మార్పించినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు గర్భిణీగా కాదు ఏకంగా అమ్మగానే నటించేసింది ఈ సంచలన తార. ప్రస్తుతం నయన్ నటిస్తున్న చిత్రం నైట్‌ఫో. హారర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయన్ తల్లిగా నటిస్తున్నారు. ఆది హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పాటలే ఉండవట. అయితే చిత్ర ప్రచారం కోసం శ్వేతామీనన్‌తో ఒక పాట మాత్రం పాడించారట. చిత్ర షూటింగ్ పూర్తి అయిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రంతో పాటు నయనతార, మాజీ ప్రేమికుడు శింబు సరసన ఇదు నమ్మ ఆళు, ఉదయనిధి స్టాలిన్‌తో నన్భేండా, జయంరవికి జంటగా తనీ ఒరువన్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement