mother role
-
తల్లి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్..
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శబరి’. ఈ మూవీతో అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ కొడైకెనాల్లో ముగిసింది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రెండు వారాలుగా కొడైకెనాల్లో జరుగుతున్న ‘శబరి’ షూటింగ్ సోమవారంతో ముగిసింది. చదవండి: జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘ఆది’ రీరిలీజ్! ఎప్పుడంటే.. ఈ చిత్రం షూటింగ్ త్వరగా పూర్తి చేసి, మీ ముందుకు సినిమాని ఎప్పుడు తీసుకువద్దామా? అని ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ‘‘ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. తర్వాతి షెడ్యూల్‌ని వైజాగ్‌లో ప్రారంభిస్తాం’’ అన్నారు మహేంద్రనాథ్ కూండ్ల. ‘‘కూతుర్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించే తల్లిగా వరలక్ష్మి నటిస్తున్నారు’’ అన్నారు అనిల్ కాట్జ్. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. -
తల్లిగా కనిపించేందుకు రెడీ అయిన కాజల్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత దూకుడు పెంచింది. వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్‌ను కూడా పక్కా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తుంది ఈ భామ. గతేడాది గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తోంది. ప్రయోగాలు చేసేందుకు కూడా సై అంటుంది. ఇప్పటిదాకా గ్లామర్ పాత్రలే చేసిన కాజల్ రిస్క్ తీసుకోడానికి రెడీ అవుతోంది. ఓ తమిళ చిత్రంలో తల్లి పాత్రలో డీ గ్లామరస్‌గా నటించేందుకు కాజల్ ఓకే చెప్పిందట. సినిమా మొత్తం తల్లీకూతుళ్ల సెంటిమెంట్ పైనే నడుస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి 'రౌడీ బేబీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, కమల్ హాసన్ ‘ఇండియన్-2’లో నటిస్తుంది. వీటితో పాటు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. -
తల్లి పాత్రలకు మరో హీరోయిన్ రెడీ
ముంబై: ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు వెలిగిన చాలామంది హీరోయిన్లు నాలుగుపదుల వయసు వచ్చాక తల్లిపాత్రలు చేశారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లో మెరిసిన పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి కూడా తల్లిపాత్రల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాను నిజజీవితంలో తల్లినని, తల్లిపాత్రలో నటించేందుకు తనకు అభ్యంతరంలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా 41 ఏళ్ల శిల్పాశెట్టి చెప్పింది. వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను వివాహం చేసుకున్న తర్వాత శిల్పా భర్తకు తోడుగా వ్యాపారాలు చూసుకుంటోంది. ఆమె చివరిసారి 2008 దోస్తానా సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించింది. ఆ తర్వాత బిగ్ స్క్రీన్‌పై కనిపించలేదు. కాగా ప్రస్తుతం ఓ టీవీ డాన్స్ రియాల్టీ షో చేస్తోంది. వివాహం అయిన తర్వాత కూడా చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు నటించారని, కరీనా కపూర్ గర్భవతిగా ఉన్న సినిమాలో నటిస్తోందని చెప్పింది. నిన్నటితరం నటి షర్మిలా ఠాగూర్ పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా నటించి విజయవంతమయ్యారని, పెళ్లయిన హీరోయిన్లు నటనను కొనసాగించడం కొత్త ట్రెండ్ ఏమీకాదని తెలిపింది. -
పెళ్లి కళ వచ్చేసిందా బాలా.!
పెళ్లి కూతురు గెటప్‌లో శ్రీయ పలు చిత్రాల్లో దర్శనమిచ్చారు. గడచిన రెండేళ్లల్లో ఆమె ఈ గెటప్‌లో కనిపించిన చిత్రం అంటే అది ‘మనం’. ఆ చిత్రంలో 1920ల నాటి పెళ్లి కూతురిగా కనిపించారు. ఆ తర్వాత 2013కి చెందిన అంజలిగా కూడా అగుపించి, ఆకట్టుకున్నారు. ఇప్పుడు కూడా శ్రీయ ఇలా రెండు రకాల పాత్రలు చేస్తున్నారు. అది తమిళ చిత్రం ‘అన్బానవన్.. అసరాదవన్.. అడంగాదవన్’. ఇందులో శింబుకి తల్లిగా, ప్రేయసిగా నటిస్తున్నారామె. తల్లి పాత్ర 1980లకి చెందినది. ప్రస్తుతం ఈ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. శ్రీయ, శింబూలపై పెళ్లి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫొటో ఆ సన్నివేశానికి సంబంధించినదే. 1980లకి చెందిన పెళ్లి కూతురిగా శ్రీయ డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు కదూ. ఈ ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు శ్రీయ. ‘‘2016లో 1980లో ఉన్నట్లుగా కనిపించడం ఎగ్జైటింగ్‌గా ఉంది. ఇలా డిఫరెంట్‌గా కనిపించే అవకాశం ఇస్తున్న నా జాబ్ అంటే నాకు చాలా ప్రేమ’’ అని శ్రీయ పేర్కొన్నారు. ‘శివాజి’ చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన శ్రీయ అక్కడ చాలా సినిమాలే చేశారు. కానీ, ఈ మధ్యే కొంచెం గ్యాప్ వచ్చింది. దాదాపు మూడు నాలుగేళ్ల తర్వాత శ్రీయ తమిళంలో కథానాయికగా నటిస్తున్న చిత్రం ఇది. తెలుగులో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లోనూ, హిందీలో ‘తడ్కా’లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారామె. ఇదిలా ఉంటే.. రీల్‌పై పలు సార్లు పెళ్లి కూతురిగా కనిపించిన శ్రీయ రియల్‌గా ఎప్పుడు పెళ్లి కూతురు అవుతారో కాలమే చెప్పాలి. థర్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్నారు కాబట్టి.. పెళ్లి కళ దగ్గర్లోనే ఉండే అవకాశం ఉందని ఊహించవచ్చు. -
ఆ హీరోకి తల్లిగా!
నటి శ్రీయను అదృష్టం, దురదృష్టం రెండూ వెంటాడాయని చెప్పాలి. కోలీవుడ్‌లో తొలి దశలోనే సూపర్‌స్టార్‌కు జంటగా శివాజీ చిత్రంలో రొమాన్స్ చేసే అవకాశాన్ని అందుకున్న అదృష్ట నటి శ్రీయ. ఆ తరువాత హాస్యనటుడు వడివేలుతో సింగిల్ సాంగ్‌లో ఆడడం ఆమె దురదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆ తరువాత అజిత్ తదితర ప్రముఖ హీరోల సరసన నటించే అవకాశాలను శ్రీయ కోల్పోయారు. ఇక తాజా విషయానికొస్తే శ్రీయ ప్రతిభావంతురాలైన నటి అని ఇప్పడు కొత్తగా సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే అవకాశాలు తగ్గాయన్నది వాస్తవం. అందులోనూ హీరోయిన్ అవకాశాలు దాదాపు అడుగంటాయని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీయ సంచలన నటుడు శింబుకు అమ్మగా నటించడానికి సమ్మతించినట్లు కోలీవుడ్ వర్గాల బోగట్టా. శింబు తాజాగా అన్బానవన్ అసరాదవన్ అదంగాదవన్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన ఆధిక్ రవిచందర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో శింబు త్రిపాత్రాభినయం చేయనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లు ఎవరన్న విషయాన్ని చిత్ర యూనిట్ బహిర్గతం చేయలేదు. కానీ, శింబు పోషించే మూడు పాత్రల్లో ఒకటి నడి వయసు పాత్ర అని సమాచారం. బహుశా ఈ పాత్ర ఇతర రెండు పాత్రలకు తండ్రి కావచ్చు. ఈ పాత్రకు జోడీగా మొదట చెన్నై చిన్నది త్రిషను సంప్రదించగా ఆ బ్యూటీ నో అన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. తాజాగా ఆ పాత్రను చేయడానికి ఉత్తరాది భామ శ్రీయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రానికి సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా ఇప్పటికే సంగీత బాణీలు కట్టే పనిలో నిమగ్నమయ్యారన్నది గమనార్హం. -
అవార్డుల కోసం కాదు
తాను అవార్డుల కోసం చిత్రాలు నిర్మించడం లేదు అని అన్నారు ప్రముఖ నటుడు ధనుష్.ఈయన నటుడుగా ఉన్నత స్థాయిలో పయనిస్తూనే తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై చక్కని కథా చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాక్కాముట్టై,విచారణై వంటి ప్రేక్షకుల ఆదరణతో పాటు జాతీయ అవార్డులను గెలుచుకున్న చిత్రాలు వండర్‌బార్ సంస్థ నుంచి వచ్చినవే. తాజాగా అమ్మాకణక్కు అనే చిత్రాన్ని ధనుష్ నిర్మించారు. ఇది హిందీలో మంచి విజయాన్ని సాధించిన నిల్ బట్టా సనాట్టా చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. హిందీ చిత్రాన్ని తెరకెక్కించిన మహిళా దర్శకురాలు అశ్వినీ అయ్యర్ తివారినే ఈ అమ్మా కణక్కు చిత్రానికి దర్శకత్వం వహించారు. అమలాపాల్, రేవతి, బేబీ యువ, సముద్రకణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత బాణీలు అందించారు. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్ర వివరాలను వివరించడానికి చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ నిల్ బట్టా సనాట్టా చిత్ర ట్రైలర్ చూసి ఆ చిత్ర నిర్మాత ఆనంద్.ఎల్ రాయ్‌ని తమిళ రీమేక్ హక్కులు అడిగి పొందానన్నారు.ఆ చిత్ర ట్రైలరే తనను అంతగా ప్రభావితం చేసిందన్నారు. పూర్తి చిత్రం చూసిన తరువాత తాను ఫుల్ హ్యాపీ అన్నారు. ఈ చిత్రం ద్వారా సమాజానికి ఒక మంచి సందేశం అందించనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా విద్య అవశ్యకతను ఆవిష్కరించే కథా చిత్రం అమ్మా కణక్కు అని తెలిపారు. అమ్మ పాత్రకు అమలాపాలే కరెక్ట్ ఇందులో అమ్మ పాత్రకు అమలాపాల్ చక్కగా నప్పుతారని భావించి ఆమెకు ఫోన్ చేసి అడిగానన్నారు. అమ్మ పాత్ర అనగానే అమలాపాల్ సంకోచించినా ఆ తరువాత నటించడానికి ముందుకొచ్చారని చెప్పారు. ఇందులో అమలాపాల్ ప్లస్‌టూ చదివే అమ్మాయికి అమ్మగా నటించారని, ఆ పాత్రకు తనే కరెక్ట్ అని, వేరొకరిని అందులో ఊహించలేమని అన్నారు. ఇందులో నటించిన అమలాపాల్‌కు, బేబీ యువకు జాతీయ అవార్డు వస్తుందని అన్నారు. జాతీయ అవార్డు కోసమే చిత్రాలు నిర్మిస్తున్నారా?అన్న విలేకరుల ప్రశ్నకు తాను అవార్డులు దృష్టిలో పెట్టుకుని చిత్రాలు నిర్మించనని, అయినా తన చిత్రాలకు అవార్డులు వస్తున్నాయని, ఇది దైవకృప అని బదులిచ్చారు.అమ్మాకణక్కు తనకు చాలా ప్రత్యేకమైన చిత్రం అని నటి అమలాపాల్ అన్నారు. దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారి, బేబీ యువ పాల్గొన్నారు. చివరగా చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. -
శ్రీశాంత్‌కు అమ్మగా రమ్యక్రిష్ణ
పడయప్పా (తెలుగులో నరసింహా) చిత్రానికి ముందు రమ్యక్రిష్ణ వేరు ఆ తరువాత రమ్యక్రిష్ణ వేరు. ఇంకా చెప్పాలంటే అంతకు ముందు రమ్యక్రిష్ణ ఒక గ్లామర్ డాల్. పడయప్పా చిత్రంతో రమ్యక్రిష్ణ అభినేత్రిగానే కొనియాడబడ్డారని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రస్తుతం సెలక్టీవ్ చిత్రాలనే చేస్తున్న రమ్యక్రిష్ణ బాహుబలి చిత్రంలో శివకామి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. అలాంటి ఆ నట శిఖామణి తాజాగా అమ్మగా మరోసారి జీవించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. అదీ సంచలన క్రికెట్ క్రీడాకారుడు శ్రీశాంత్‌కు స్ఫూర్తిదాయకమైన అమ్మగా నటించనున్నారట. ఆ మధ్య వివాదాలకు గురై జైలు జీవితాన్ని కూడా అనుభవించి ఇటీవల నిర్దోషిగా బయట కొచ్చిన క్రికెట్ క్రీడాకారుడు శ్రీశాంత్ సినీ రంగప్రవేశం గురించి కొద్దికాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆయన దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ రూపొందనున్న చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారట. దీనికి సానాయాది రెడ్డి దర్శకత్వం వహించనున్నారట. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రైటర్ పని చేస్తున్న ప్రకాశ్ వివరాలను తెలుపుతూ ఇది క్రికెట్ క్రీడా నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కనున్నట్లు చెప్పారు. ఇందులో శ్రీశాంత్‌కు అమ్మగా రమ్యక్రిష్ణ పాత్ర చాలా వైవిధ్యభరితంగా ఉంటుందన్నారు. -
ఓ పసిపాపకు తల్లి
ఆశ్చర్యంగా ఉంది కదూ! నయనతార ఏమిటి? పసిపాపకు తల్లి ఏంటని అనుకుంటున్నారా? నిజమే. తమిళంలో రూపొందిన ‘మాయ’ చిత్రంలో ఆమె ఓ పసిపాపకు తల్లిగా కనిపించనున్నారు. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘మయూరి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు సీనియర్ నిర్మాత సి. కల్యాణ్. ఆగస్టు మూడో వారంలో ఈ చిత్రం విడుదల కానుంది. సి.కల్యాణ్ మాట్లాడుతూ -‘‘సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌గా తెరెకె క్కిన ఈ చిత్రం నయనతార కెరీర్లో ఓ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుంది. గ్రాఫిక్స్, రీ-రికార్డింగ్ ఈ చిత్రానికి హైలైట్స్. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం:సత్యన్ సూర్యన్. -
తల్లి పాత్రలు చాలా సులభం: శ్రియ
వెండితెర మీద తల్లి పాత్రలు పోషించడం పెద్ద కష్టం ఏమీ కాదని హీరోయిన్ శ్రియాశరణ్ చెప్పింది. 'దృశ్యం' సినిమా హిందీ రీమేక్‌లో అజయ్ దేవ్‌గణ్ సరసన శ్రియ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు అక్కడ నిశికాంత్ కామత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇద్దరు కూతుళ్లకు తల్లిగా తెలుగులో మీనా పోషించిన పాత్రను హిందీలో శ్రియ పోషిస్తోంది. తల్లి పాత్ర పోషించడం పెద్ద కష్టమేమీ కాదని, అది చాలా ఆసక్తికరమైన పాత్ర అని తెలిపింది. ఈ సినిమాతో ఎవరైనా కనెక్ట్ అయిపోతారని, ఇందులోని పాత్రలు, సందర్భాలు.. అన్నీ చాలా బాగుంటాయని శ్రియ చెప్పింది. హిందీ దృశ్యం ట్రైలర్ విడుదల సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. అజయ్ దేవ్‌గణ్‌కు తాను పెద్ద అభిమానినని, ఆయనను ఆరాధించానని తెలిపింది. ఆయనతో నటించడం చాలా సులభంగా ఉంటుందని, ఇక టబు అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. హిందీ దృశ్యం సినిమా ఈనెల 31న విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. -
అక్షయ్‌కి అమ్మగా...
‘ఏక్ దూజే కేలియే’తో ఆనాటి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కథానాయిక రతీ అగ్నిహోత్రి. భర్త అనిల్ విర్వాణితో మనస్పర్థలొచ్చి, 30 ఏళ్ల వైవాహిక బంధం అర్ధంతరంగా ముగించి ఈ మధ్య వార్తల్లోకెక్కారామె. ఇది ఇలా ఉండగా ఆమెకు ఇప్పుడో మంచి అవకాశం వచ్చింది. ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ నటిస్తున్న ‘సింగ్ ఈజ్ బ్లింగ్’లో అక్షయ్‌కి తల్లిగా ఆమె నటించనున్నారు. -
తల్లి అయిన నయనతార
నయనతార అమ్మ అయిందట. ఇదేంటి ప్రేమలు కూడా అన్నీ పెటాకులవుతుంటే, నయనతార పెళ్లి ఎప్పుడు చేసుకుంది. తల్లి ఎప్పుడు అయిందనుకుంటున్నారా? అవును నయనతార తల్లి అయింది వాస్తవమే కానీ నిజ జీవితంలో కాదు సినిమాలో. ఈ మధ్య అనామిక చిత్రంలో కూడా గర్భిణీగా నటించాల్సి వస్తే అందుకు నిరాకరించి ఆ చిత్ర దర్శకుడితో వాస్తవ కథనే మార్పించినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు గర్భిణీగా కాదు ఏకంగా అమ్మగానే నటించేసింది ఈ సంచలన తార. ప్రస్తుతం నయన్ నటిస్తున్న చిత్రం నైట్ఫో. హారర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయన్ తల్లిగా నటిస్తున్నారు. ఆది హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పాటలే ఉండవట. అయితే చిత్ర ప్రచారం కోసం శ్వేతామీనన్‌తో ఒక పాట మాత్రం పాడించారట. చిత్ర షూటింగ్ పూర్తి అయిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రంతో పాటు నయనతార, మాజీ ప్రేమికుడు శింబు సరసన ఇదు నమ్మ ఆళు, ఉదయనిధి స్టాలిన్‌తో నన్భేండా, జయంరవికి జంటగా తనీ ఒరువన్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. -
తల్లిపాత్ర పోషిస్తున్న నిత్యామీనన్
చిన్న వయసులో తల్లిపాత్ర పోషించాలంటే హీరోయిన్లు ససేమిరా అంటారు. కానీ, నిత్యామీనన్ మాత్రం తాను ఆ పాత్రను చేయడానికి సిద్ధం అంటూ ముందుకొచ్చింది. త్వరలో ఆమె చేయబోతున్న ఓ తెలుగు సినిమాలో తల్లి పాత్ర పోషించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తనుంది. ఇప్పటికే దాదాపు అన్ని దక్షిణభారత భాషల్లోను నటించి, తెలుగులో కూడా మంచి హిట్లు సాధించిన ఈ మళయాళ కుట్టి.. 'ఓనమాలు' దర్శకుడు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రాబోతున్న ఓ సినిమాలో తల్లి పాత్ర పోషించబోతోంది. ఐస్ క్రీం సినిమాలో నటించిన తేజస్వి ఈ సినిమాలో నిత్య కూతురిగా నటిస్తుందట. సినిమా స్క్రిప్టు వినగానే నిత్యామీనన్ చాలా ఆనందంగా, ఆసక్తిగా స్పందించిందని, ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి తానెప్పుడూ సిద్ధమేనని చెప్పిందని చిత్రం యూనిట్ వర్గాలు తెలిపాయి. ఏదో మూసపాత్రలు చేసుకుంటూ గ్లామర్ ఒలికించడం కాకుండా.. విభిన్నమైన పాత్రలు చేయడం తనకు ఇష్టమని, ఇలాంటి అవకాశాలు ఎప్పుడో వస్తాయంటూ వెంటనే ప్రాజెక్టు ఆమోదించిందని అన్నారు. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా చేస్తున్నాడు. వీళ్లిద్దరూ ఇంతకుముందు ఏమిటో ఈ మాయ సినిమాలో చేశారు. ఇప్పుడు రెండోసారి ఇద్దరూ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో శర్వా ఓ క్రీడాకారుడి పాత్ర పోషిస్తాడట. -
తల్లిపాత్రే అన్నింటికంటే టాప్: శిల్పాశెట్టి
రెండు దశాబ్దాల పాటు ఆమె వెండితెరమీద ఓ వెలుగు వెలిగింది. లెక్కలేనన్ని పాత్రలు చేసింది. కానీ అన్నింటికంటే తల్లిపాత్రలో ఒదిగిపోవడమే తనకు బాగా నచ్చిందని చెబుతోంది శిల్పాశెట్టి. ఏడాదిన్నర వయసున్న తన కొడుకు వియాన్‌తో ఉంటే అసలు ప్రపంచమే పట్టడంలేదని అంటోందీ పొడుగుకాళ్ల సుందరి. ప్రస్తుతం ఓ టీవీ చానల్లో దర్శకుడు సాజిద్ ఖాన్, కొరియోగ్రాఫర్ టెరెన్స్ లూయిస్‌తో కలిసి 'నచ్ బలియే 6' రియాల్టీ షోకు హోస్ట్‌గా శిల్పాశెట్టి వ్యవహరిస్తోంది. షూటింగులో ఉన్నా కూడా తనకెప్పుడూ కొడుకు ధ్యాసే ఉంటోందని ఆమె చెబుతోంది. 2009లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లాడిన తర్వాత ఆమె చేస్తున్న ఈ రియాల్టీ షో దాదాపు ముగింపు దశకు వచ్చింది. ఇప్పుడు తనకు వియన్తో చేతినిండా పని ఉంటోందని, ఈ షో పూర్తయ్యాక ఇక వాడికే సమయం మొత్తం అంకితం చేస్తానని అంటోంది. బాజీగర్, రిష్తే లాంటి హిందీ సినిమాలతో పాటు.. మోహన్ బాబుతో వీడెవడండీ బాబూ, వెంకటేష్‌తో సాహసవీరుడు సాగరకన్య, నాగార్జునతో ఆజాద్ లాంటి తెలుగు సినిమాల్లో కూడా శిల్పాశెట్టి మెరిసింది. ప్రేక్షకుల గుండెల్లో తనకెప్పుడూ సుస్థిరమైన స్థానం ఉంటుందని ఆమె అంటోంది. మొత్తానికి తల్లిపాత్రను పూర్తిస్థాయిలో పోషించడమే అన్నింటికంటే ఇష్టమని చెబుతోంది.