తల్లిపాత్ర పోషిస్తున్న నిత్యామీనన్ | Nitya menon to play a mother role | Sakshi
Sakshi News home page

తల్లిపాత్ర పోషిస్తున్న నిత్యామీనన్

Published Wed, Sep 17 2014 10:05 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

తల్లిపాత్ర పోషిస్తున్న నిత్యామీనన్ - Sakshi

తల్లిపాత్ర పోషిస్తున్న నిత్యామీనన్

చిన్న వయసులో తల్లిపాత్ర పోషించాలంటే హీరోయిన్లు ససేమిరా అంటారు. కానీ, నిత్యామీనన్ మాత్రం తాను ఆ పాత్రను చేయడానికి సిద్ధం అంటూ ముందుకొచ్చింది. త్వరలో ఆమె చేయబోతున్న ఓ తెలుగు సినిమాలో తల్లి పాత్ర పోషించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తనుంది. ఇప్పటికే దాదాపు అన్ని దక్షిణభారత భాషల్లోను నటించి, తెలుగులో కూడా మంచి హిట్లు సాధించిన ఈ మళయాళ కుట్టి.. 'ఓనమాలు' దర్శకుడు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రాబోతున్న ఓ సినిమాలో తల్లి పాత్ర పోషించబోతోంది. ఐస్ క్రీం సినిమాలో నటించిన తేజస్వి ఈ సినిమాలో నిత్య కూతురిగా నటిస్తుందట.

సినిమా స్క్రిప్టు వినగానే నిత్యామీనన్ చాలా ఆనందంగా, ఆసక్తిగా స్పందించిందని, ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి తానెప్పుడూ సిద్ధమేనని చెప్పిందని చిత్రం యూనిట్ వర్గాలు తెలిపాయి. ఏదో మూసపాత్రలు చేసుకుంటూ గ్లామర్ ఒలికించడం కాకుండా.. విభిన్నమైన పాత్రలు చేయడం తనకు ఇష్టమని, ఇలాంటి అవకాశాలు ఎప్పుడో వస్తాయంటూ వెంటనే ప్రాజెక్టు ఆమోదించిందని అన్నారు.

ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా చేస్తున్నాడు. వీళ్లిద్దరూ ఇంతకుముందు ఏమిటో ఈ మాయ సినిమాలో చేశారు. ఇప్పుడు రెండోసారి ఇద్దరూ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో శర్వా ఓ క్రీడాకారుడి పాత్ర పోషిస్తాడట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement