Bheemla Nayak Movie 4th Song "Adavi Thalli Mata" Released: పవర్ స్టార్ పవన్ కల‍్యాణ్, రానా దగ్గుబాటి మల్టీసారర్‌గా వస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వ వహించగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, పాటలు, గ్లింప్స్ అదరగొడుతున్నాయి. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు డైలాగ్స్ రాస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు దర్శకనిర్మాతలు. అందులో భాగంగా తాజాగా 'భీమ్లా నాయక్' ఫోర్త్ సింగిల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్.
అయితే ఫోర్త్ సింగిల్ అయిన 'అడవి తల్లి మాట' పాటను డిసెంబర్ 1న విడుదల చేయాల్సింది. అక్షరయోధుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతికి సంతాపంగా ఆ పాట రిలీజ్‌ను ఆపేసారు. చివరికీ ఇవాళ (డిసెంబర్ 4, శనివారం) ఉదయం 10.08 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చెప్పినట్టే ఇవాళ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ 'అడవి తల్లి మాట' పాటను రామజోగయ్య శాస్త‍్రి రచించారు. దుర్గవ్వ, సాహితి చాగంటి తమదైన గాత్రంతో పాడి ఆకట్టుకున్నారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాకు తెలుగు రీమేక్‌గా 'భీమ్లా నాయక్' తెరకెక్కుతోంది.
Comments
Please login to add a commentAdd a comment